Just In
- 6 hrs ago
ట్రెండింగ్ : ఆమె నా తల్లి కాదు.. ప్రైవేట్ పార్టు చూపిస్తూ.. పర్సనల్ సీక్రెట్ లీక్ చేసిన దీపిక పదుకొనే
- 6 hrs ago
ఆ విషయం తెలిసి ఎంతో సంతోషమేసింది.. సోహెల్ కామెంట్స్ వైరల్
- 7 hrs ago
ఎవ్వరూ తగ్గడం లేదు.. కోల్డ్ వార్ ముదిరింది.. కొత్త షోలతో బుల్లితెరపై ఫైట్
- 8 hrs ago
బ్లాక్‌లో పెట్టింది అన్ ఫాలో చేసింది.. అషూ రెడ్డిపై రాహుల్ కామెంట్స్
Don't Miss!
- News
ఘోరం: పూజల పేరుతో ఇద్దరు కుమార్తెలను చంపిన తల్లిదండ్రులు, మళ్లీ బతికిస్తాం, కరోనా శివుడి తల నుంచే..
- Sports
Sri Lanka vs England: జోరూట్ జోరు.. శ్రీలంక బేజారు!
- Finance
బడ్జెట్, మొబైల్ యాప్‌లో 14 డాక్యుమెంట్ల పూర్తి వివరాలు
- Lifestyle
రాత్రుల్లో లోదుస్తులు ధరించకుండా ఒక వారం పాటు నిద్రించండి,ఏం జరుగుతుందో చూడండి, ఆశ్చర్యపోతారు
- Automobiles
బైడెన్ ఉపయోగించే 'మృగం' లాంటి కారు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
హర్దిక్ పాండ్యా నిశ్చితార్థంపై మాజీ ప్రేయసి రియాక్షన్ వైరల్.. సోషల్ మీడియాలో షాకింగ్ పోస్ట్
కొత్త సంవత్సరంలో క్రికెటర్ హర్దిక్ పాండ్యా ఎంగేజ్‌మెంట్‌తో అభిమానులకు ఊహించని షాక్ ఇచ్చాడు. సెర్బియన్ నటి, డాన్సర్ నటాషా స్టాంకోవిక్‌తో నిశ్చితార్థం చేసుకొని ఆ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి తెలియజేయడం చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో హార్థిక్ పాండ్యా నిశ్చితార్థంపై ఆయన మాజీ ప్రేయసి, బాలీవుడ్ నటి ఊర్వశి రటేలా స్పందించారు. సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేసిన స్టేట్‌మెంట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇంతకు ఆమె ఏం పోస్ట్ చేశారంటే..

హర్దిక్, ఊర్వశి డేటింగ్
కొద్దికాలం క్రితం క్రికెటర్ హర్దిక్ పాండ్యా, ఊర్వశి రటేలా చెట్టాపట్టాలేసుకొని తిరిగారు. చిలకా గోరింకల్లా డేటింగ్ చేస్తూ మీడియాకు ప్రత్యేక ఆకర్షణగా మారారు. ఆ తర్వాత వారిద్దరి విడిపోవడంపై అప్పట్లో మీడియాలో పలు రకాల కథనాలు వినిపించాయి. ప్రేమికులుగా విడిపోయినా ఫ్రెండ్స్‌గా మాత్రం కొనసాగుతున్నారు.

నటాషాతో హర్దిక్ ఎంగేజ్‌మెంట్
తాజాగా హర్ధిక్ పాండే తన ప్రేయసి నటాషాతో ఎంగేజ్‌మెంట్ విషయాన్ని తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేశారు. నాకు నీవు.. నీకు నేను. నువ్వే నా ప్రాణం. ఈ విషయం యావత్ దేశం గుర్తించాలి అంటూ హర్దిక్ పాండ్యా ఓ పోస్ట్ పెట్టారు. అంతేకాకుండా ప్రేయసితో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేశాడు. దాంతో వారిద్దరి మధ్య రిలేషన్ అఫీయల్‌గా మారింది.

హర్దిక్ ఎంగేజ్‌మెంట్‌పై ఊర్వశి రటేలా
తన మాజీ ప్రియుడు హార్దిక్ ఎంగేజ్‌మెంట్ గురించి ఊర్వశి రటేలా స్పందిస్తూ.. నీ నిశ్చితార్థం జరిగినందున హ్యాపీగా ఉంది. నీవు సంతోషంగా ఉండాలని కోరుకొంటున్నాను. మీ బంధంలో ప్రేమ, సంతోషం ఉండాలి. మీ ప్రేమ, బంధం చిరకాలం ఉండాలని కోరుకొంటున్నాను అని ఊర్వశి రటేలా సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ఊర్వశి పాజిటివ్‌గా స్పందించడంపై నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

హర్దిక్ ప్రియురాలు డేటింగ్
ఇక నటాషా విషయానికి వస్తే.. అలీ గోని అనే టెలివిజన్ యాక్టర్‌తో డేటింగ్ చేసింది. వారిద్దరూ కలిసి ఇటీవల నచ్ బలియే కార్యక్రమంలో పాల్గొన్నారు. తన మాజీ ప్రేయసి నటాషా ఎంగేజ్‌మెంట్‌పై అలీగొని సానుకూలంగా స్పందించాడు. ఎంగేజ్‌మెంట్‌పై స్పందిస్తూ లవ్ సింబల్‌తో కూడిన ఎమోజీలను పోస్ట్ చేశారు.