ఆకాశంలో తారకు సుశాంత్ సింగ్ పేరు. అమెరికాలో అభిమాని ఘన నివాళి
యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణాన్ని ఇంకా అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయనను గుర్తు చేసుకొంటూ చాలా మంది ఫ్యాన్స్ అతడి జాపకాల్లో బతుకుతున్నారు. తాజాగా సుశాంత్‌పై ఉన్న అభిమానాన్ని చాటుకొంటూ అమెరికాలోని ఓ ఫ్యాన్ తనకు గొప్పగా నివాళి ప్రకటించారు. ప్రస్తుతం అభిమాని చేసి గొప్ప పనిని అందరూ హర్షిస్తున్నారు. అమెరికా అభిమాని చేసిన పని ఏమిటంటే..
Recommended Video

ఖగోళ శాస్త్రంపై మక్కువ
ఇంజనీరింగ్ స్టూడెంట్ అయిన సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు ఖగోళ శాస్త్రమంటే చాలా ఇష్టం. నటుడిగా మారిన తర్వాత కూడా ఆస్ట్రో ఫిజిక్స్‌పై అనేక అధ్యయనాలు చేశారు. విశ్వంలో ఉండే తారా మండలాన్ని చూడటానికి ఖరీదైన ఓ టెలిస్కోప్‌ను కొనుగోలు చేశారు. తనకు వీలు దొరికినప్పుడల్లా ఆ టెలిస్కోప్ నుంచి విశ్వంలోకి చూస్తూ తన పరిశోధనను సాగించే వారు అని స్నేహితులు వెల్లడించారు.

చంద్రమండలంపై స్థలం
అంతేకాకుండా సుశాంత్ సింగ్‌కు ఖగోళ పరిశోధనపై ఎంత మక్కువ అంటే.. ఏకంగా చంద్ర మండలంపై స్థలాన్ని కొనుగోలు చేసేటంతా. గతంలో చంద్రుడిపై కొంత స్థలాన్ని కొనుగోలు చేసి అధికారికంగా పత్రాలు పొందారు. వచ్చే కొన్నేళ్లలో చంద్రమండలంపైకి రూపొందించే అంతరిక్ష ప్రయోగాల్లో భాగం కావాలనే ఉద్దేశంతో సుశాంత్ అడుగులు వేశారు.

అమెరికాలో అభిమాని నివాళి
ఖగోళ పరిశోధనపై ఇష్టం చూపించే సుశాంత్ సింగ్‌కు అమెరికాకు చెందిన రక్ష అనే అభిమాని గొప్పగా నివాళలర్పించారు. ఖగోళంలోని ఓ స్టార్‌కు సుశాంత్ సింగ్ పేరు పెట్టాలని నిర్ణయించుకొని ఆ ప్రక్రియను పూర్తి చేశారు. అందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాన్ని ట్విట్టర్‌లో పోస్ట్ చేసి ఆ ప్రక్రియను ధృవీకరించారు.

విశ్వంలోని తారకు సుశాంత్ పేరు
విశ్వంలో ఉంటే తారల్లో ఒకటైన RA 22.121, Declination -10.14 దానిని గుర్తించాం. జూన్ 25వ తేదీ 2020 నుంచి ఆ స్టార్‌కు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌గా నామకరణం చేశాం. ఇక నుంచి ఆ తారను సుశాంత్ అని పిలువాలని నిర్ణయించాం. ఆ మేరకు ఖగోళ శాస్త్ర సంస్థ కూడా మాకు ఆ హక్కులు అందుజేసింది. ఆ తారకు సంబంధించిన హక్కులు, కాపీరైట్స్ మాకు లభించాయి అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

సుశాంత్ మరింత మెరువాలి
సుశాంత్‌కు తారలంటే చాలా ఇష్టం. ఈ లోకం నుంచి వీడిన బాలీవుడ్ తారకు ఘనమైన నివాళి అర్పించాలని భావించంా. అందుకే ఓ అందమైన స్టార్‌కు సుశాంత్ పేరు పెట్టాం. ఇక నుంచి ఆ తార మరింత ప్రకాశవంతంగా మెరువాలి. అని రక్ష అనే అభిమాని ట్వీట్ చేశారు.


Click it and Unblock the Notifications











