షాకింగ్.. విడాకుల దిశగా ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ జంట.. ఏం జరిగిందంటే!

క్రేజీ హీరోయిన్ ప్రియాంక చోప్రా బాలీవుడ్ లో ఓ సంచలనం. 2000 సంవత్సరంలో ప్రపంచ సుందరిగా అవార్డు గెలుచుకున్న తర్వాత ప్రియాంక బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. మూడు పదుల వయసు దాటినా తర్వాత కూడా ప్రియాంక హవా తగ్గలేదు. ప్రియాంక క్రేజ్ హాలీవుడ్ కు సైతం పాకింది. ప్రియాంక తన గ్లామర్, నటనతో హాలీవుడ్ లో కూడా కొన్ని చిత్రాల్లో నటించింది. హాలీవుడ్ సింగర్ నిక్ జోనస్ ప్రేమలో పడడం, గత ఏడాది డిసెంబర్ లో ఈ జంట వివాహం చేసుకోవడం అందరికి తెలిసిందే. ప్రియాంక, నిక్ జోనస్ దాంపత్య జీవితం గురించి హాలీవుడ్ మీడియాలో సంచలన కథనాలు వెలువడుతున్నాయి. ఈ జంట విడాకులు తీసుకునేందుకు సిద్ధం అవుతోంది అంటూ ప్రచారం జరుగుతోంది.

 వయసులో పదేళ్లు పెద్ద

వయసులో పదేళ్లు పెద్ద

నిక్ జోనస్, ప్రియాంక చోప్రా మధ్య వయసు వ్యత్యాసం దాదాపు 10 ఏళ్ళు. ప్రియాంక చోప్రా నిక్ జోనస్ కన్నా పదేళ్లు పెద్దదైనా అతడి ప్రేమలో పడింది. వివాహానికి ముందు ఈ జంట పార్టీలు, షికారులతో బాగా ఎంజాయ్ చేశారు. అంతే త్వరగా వీరి వివాహం కూడా జరిగింది. ఇండియాలో ప్రియాంక, నిక్ వివాహం హిందూ, క్రిస్టియన్ సంప్రదాయాల్లో జరిగింది. డిసెంబర్ లో ఈ జంట వివాహబంధంతో ఒక్కటయ్యారు.

జోరుగా కథనాలు

జోరుగా కథనాలు

వివాహం తర్వాత కూడా వీరిద్దరూ పార్టీలతో ఎంజాయ్ చేస్తూ కనిపించారు. కానీ తాజాగా వీరి మధ్య బంధం సరిగా లేదని వార్తలు వస్తున్నాయి. ఈ జంట విడాకులకు సిద్ధం అవుతోందని హాలీవుడ్ మీడియాలో జోరుగా కథనాలు వెలువడుతున్నాయి. దీనికి కారణం ప్రియాంక, నిక్ జోనస్ ఒకరినొకరు సరిగా అర్థం చేసుకోకుండా వివాహం చేసుకోవడమే కారణం అని అమెరికన్ మీడియాలో వస్తున్న కథనాల సారాంశం.

ఈజీగా తీసుకునే స్వభావం

ఈజీగా తీసుకునే స్వభావం

వెలువడుతున్న కథనాన్ని నిక్ జోనస్ కుటుంబ సభ్యుల కోణంలోనే ప్రియాంక స్వభావాన్ని వివరిస్తున్నాయి. ప్రియాంక చోప్రా 36 ఏళ్ల పరిణితి చెందిన మహిళ అయినా ఇంకా 21 ఏళ్ల యువతిలా వ్యవహరిస్తోందని నిక్ కుటుంబ సభ్యులు భావిస్తున్నారట. వివాహానికి ముందు ప్రియాంక చోప్రా ఏ విషయాన్ని అయినా ఈజీగా తీసుకుంటుంది, సరదాగా ఉంటుంది అని భావించారట. కానీ పెళ్లి తర్వాత ప్రియాంక అలా లేదని అంటున్నారు. ప్రతి విషయంలోనూ కాంప్రమైజ్ కావడానికి ప్రయత్నిస్తూ.. ఒక్కో సందర్భంలో తన అసహనాన్ని ప్రదర్శిస్తోందని వార్తలు వస్తున్నాయి.

నిక్‌పై కుటుంబసభ్యుల ఒత్తిడి

నిక్‌పై కుటుంబసభ్యుల ఒత్తిడి

ప్రియాంక చోప్రా కొన్ని సందర్భాల్లో సర్దుకుపోలేక షార్ట్ టెంపర్ బయట పెడుతోందని వార్తలు వస్తున్నాయి. నిక్ కుటుంబ సభ్యులు కూడా ప్రియాంక వైఖరితో విసిగిపోయినట్లు అమెరికాకు చెందిన కొన్ని పత్రికల్లో కథనాలు వెలువడ్డాయి. అందుకు నిక్ కుటుంబ సభ్యులు అతడిపై ఒత్తిడి తెస్తున్నారట. ప్రియాంక చోప్రా నుంచి విడాకులు పొందాలని నిక్ జోనస్ ని ఉసిగొల్పుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X