మహిళలపై యువ కమెడియన్ లైంగిక వేధింపులు.. న్యూడ్ ఫోటోలు కావాలని!
అప్ కమింగ్ కమెడియన్ గా ఎదుగుతున్న ఉత్సవ్ చక్రవర్తి చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. మహిళల్ని లైంగికంగా వేధించిన కేసులో పోలీసులు రంగంలోకి దిగారు. ఉత్సవ్ యూట్యూబ్ వీడియోలతో కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. పలువురు మహిళలు అతడిపై లైంగిక వేధింపుల కేసు నమోదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

యూట్యూబ్ వీడియోలు
ఉత్సవ్ యూట్యూబ్ లో కామెడీ వీడియోలతో పాపులర్ అయ్యాడు. అప్ కమింగ్ కమిడియన్ గా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. ఉత్సవ్ ఏఐబి పేరుతో యూట్యూబ్ లో లెక్కుకు మించినన్ని వీడియోలు దర్సనం ఇస్తాయి.

మహిళలపై వేధింపులు
ఉత్సవ్ సోషల్ మీడియా వేదికగా పలువురు మహిళలని లైంగికంగా వేధించినట్లు కేసు నమోదైంది. సోషల్ మీడియాలో కొందరు అమ్మాయిలకు అశ్లీల చిత్రాలు పంపుతూ, వారిని న్యూడ్ ఫోటోలు అడుగుతూ వేధిస్తున్నాడని ఆరోపణలు వస్తున్నాయి.

ముంబై పోలీసులు
ఆరోపణలు రావడంతో ముంబై పోలీసులు రంగంలోకి దిగారు. దీనిపై ఉత్సవ్ సోషల్ మీడియాలో స్పందించాడు. మొత్తం వ్యవహారంలో క్లారిటీ రావాలనుంటే కాస్త సహనం వహించాలని ఉత్సవ్ ట్విట్టర్ ద్వారా స్పందించాడు.
శిక్షకు సిద్ధం
అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించే మనస్తత్వం తనకు లేదని ఉత్సవ్ తెలిపాడు. ఒకవేళ తనపై వస్తున్న ఆరోపణలు రుజువైతే చట్టపరంగా ఎలాంటి శిక్షకైనా సిద్దమే అంటూ చెప్పుకొచ్చాడు. ఉత్సవ్ కొందరు మైనర్ అమ్మాయిలని కూడా వేధించినట్లు వార్తలు వస్తున్నాయి.


Click it and Unblock the Notifications