twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హిమాలయాల్లో మంచు కొండలు బద్దలు.. 150పైగా మృతి.. సోనూసూద్, బాలీవుడ్ ప్రముఖుల సంతాపం

    |

    హిమాలయ పర్వత శ్రేణుల్లో మంచు కొండలు బద్దలైన ఘటన ఉత్తరాఖండ్‌లో విషాదం నింపింది. మంచు కొండలు హఠాత్తుగా కరిగి భారీగా వరద ముంచెత్తడంతో ధౌలీగంగా నది ప్రాంతంలో పలు ఇళ్లు నీటి ప్రవాహంలో కొట్టుకోయాయి. దాదాపు 150 మందికి పైగా ఈ వరద ముంపుకు గురై ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనపై దియా మిర్జా, సోనూసూద్‌తోపాటు బాలీవుడ్ ప్రముఖులు తమ సంతాపాన్ని, ఆవేదనను వ్యక్తం చేశారు. సోనూసూద్ ట్వీట్ చేస్తూ మేమంత మీ వెంట ఉన్నాం అంటూ భరోసాను ఇచ్చారు. ఇంకా బాలీవుడ్ ప్రముఖులు ఎవరెవరూ స్పందించారంటే...

    Recommended Video

    Rescue workers reached Reni village in Chamoli district of Uttarakhand | Oneindia Telugu
    ఉత్తరాఖండ్‌లో వరద ముంపు

    ఉత్తరాఖండ్‌లో వరద ముంపు

    ఉత్తరాఖండ్‌లో మంచు పర్వతాలు బద్దలయ్యాయనే వార్త నన్ను విషాదానికి గురి చేసింది. ఆ ప్రాంతంలోని ప్రజలందరూ క్షేమంగా ఉండాలని కోరుకొంటున్నాను. ఇలాంటి సమయంలో ప్రజలందరూ ధైర్యంగా ఉండాలి అంటూ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

    ప్రభుత్వ విధానాల వల్లే

    ప్రభుత్వ విధానాల వల్లే

    హిమాలయ పర్వత శ్రేణుల్లో అనేక డామ్స్‌ కట్టడమే ఇలాంటి ప్రమాదానికి ప్రధాన కారణం. ఛమోలీ ప్రాంతంలోని ప్రజలందరూ క్షేమంగా ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నాం. ప్రమాద సమయంలో ఎలాంటి సహాయానికైనా డిజాస్టర్ ఆపరేషన్స్ సెంటర్ టోల్ ఫ్రీ నంబర్ 1070 గానీ, 9557444486 గానీ కాల్ చేయండి అంటూ పేర్కొన్నారు.

    టోల్ ఫ్రీ నంబర్ కాల్ చేయండి

    టోల్ ఫ్రీ నంబర్ కాల్ చేయండి

    ఉత్తరాఖండ్‌లో వరద ముంపు వల్ల ప్రజలు ప్రాణాలు కోల్పోవడం బాధగా ఉంది. ఎవరైనా వరదల్లో చిక్కకుంటే టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి సహాయం పొందండి అంటూ సిద్దార్థ మల్హోత్రా ట్వీట్ చేశారు.

    ప్రజలంతా క్షేమంగా ఉండాలంటూ

    ప్రజలంతా క్షేమంగా ఉండాలంటూ

    ఇక బాలీవుడ్ ప్రముఖుల్లో శ్రేయాస్ తల్పాడే, ప్రసూన్ జోషి ఇంకా పలువురు తమ బాధను, సంతాపాన్ని ట్విట్టర్‌ ద్వారా స్పందిస్తున్నారు. ప్రమాదకర వార్త విని నా హృదయం బాధతో తల్లడిల్లింది. ఆ ప్రాంతంలో వారంతా క్షేమంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అని శ్రేయాస్ తల్పాడే ట్వీట్ చేశారు. ఛమోలీ, ఇతర జిల్లాలోని ప్రజలంతా క్షేమంగా ఉండాలని కోరుకొంటున్నాను అంటూ ప్రసూన్ జోషి ట్వీట్ చేశారు.

    English summary
    Uttarakhand glacier burst: 150 people died due to Dhauliganga river rises suddenly. In this tragic situation, Shraddha Kapoor tweeted that Distressing to hear about the glacier breaking off in #Uttarakhand Praying everyone’s safety there
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X