తంతే వెళ్లి బూరెలబుట్టలో పడ్డ నానీ హీరోయిన్
లాంగ్ లెగ్స్ బ్యూటీ వాణీ కపూర్ అంటే ఠక్కున గుర్తుకురాకపోవచ్చు కానీ, అహా కల్యాణం సినిమాలో నానీతో రొమాన్స్ చేసిన బ్యూటీ అంటే వెంటనే గుర్తొంది అమ్మడు. తెలుగు తెరకు అలా పరిచయమై ఇలా తెరమరుగు అయిన వాణీ, బాలీవుడ్ లో అడపాదడపా ఆఫర్లతోనే కాలం నెట్టుకువస్తోంది. మధ్య ఒకటీ రెండూ పెద్ద సినిమాలే పడినా అమ్మడికి ఏమాత్రం కలసి రావడం లేదు అక్కడ.
అయితే ఈ మధ్య అమ్మడు నక్కతోక తొక్కిందనే చెప్పుకోవాలి. అసలే కరోనా భయంతో ఇండస్ట్రీ గజగజా వణికిపోతోంటే.. వాణీ మాత్రం ఆనందంతో చిందులువేస్తోంది. ఎందుకంటే.. కష్టకాలంలోనే అమ్మడికి బపర్ ఆఫర్ తగిలింది మరి. అది కూడా యాక్షన్ కింగ్ అక్షయ్ కుమార్ సరసన అమ్మడు హీరోయిన్ గా ఆవకాశం కొట్టేసిందట.

అక్షయ్ కుమార్ హీరోగా బెల్ బాటమ్ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రంజిత్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ థ్రిల్లర్ సినిమాలో వాణీ హీరోయిన్ గా ఎంపికైంది. ఇక సినిమాలో అమ్మడి పాత్ర కేవలం గ్లామర్ షోకు మాత్రమే పరిమితం అవ్వడంలేదని తెలుస్తోంది. వాణీ పాత్ర సినిమాలో కీలక ములుపుకు కారణం అవుతుందని దర్శకుడు రంజిత్ తివారీ స్పష్టం చేశాడు.
నిజానికి ఈ మధ్య వాణీ కపూర్ కెరీర్ పెద్ద ఆశాజనకంగా ఏమీ లేదు. ఆ మధ్య బేఫిక్రే, వార్ సినిమాలు అమ్మడి కెరీర్ ఊపందుకోవడంలో ఎలాంటి పాత్రా పోషించలేకపోయాయి. పలు ప్రాజెక్ట్ లు వచ్చినా, అందులో ప్రాధాన్యత లేని పాత్రలే ఎక్కవ అని చెప్పుకోవచ్చు. అందుకే ఇప్పుడు తన ఆశలన్నీ బెల్ బాటమ్ పైనే పెట్టుకుంది ఈ భామామణి. మరి ఈ సినిమా అయినా అమ్మడికి ఆశించిన బ్రేక్ ఇస్తుందో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











