నా లవర్‌‌ను తిడితే పిచ్చ కోపం వస్తుంది, రెస్పెక్ట్ ఇవ్వకుంటే నచ్చదు: యంగ్ హీరో స్టేట్మెంట్

బాలీవుడ్లో అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరో ఇమేజ్ సొంతం చేసుకుని దూసుకెళుతున్న హీరో వరుణ్ ధావన్. తన సినిమాలు మాత్రమే కాదు.. ప్రియురాలు నటాషా దలాల్‌కి సంబంధించిన అంశాలతో కూడా వరుణ్ ధావన్ ఎప్పుడూ వార్తల్లో ఉంటూ ఉంటారు. ఈ ఏడాది వీరు పెళ్లి చేసుకోబోతున్నట్లు టాక్.

బాలీవుడ్ మూవీ సర్కిల్‌లో వరుణ్ ధావన్, నటాషా హాట్ పెయిర్. ఇండస్ట్రీలో ఏ వేడుక జరిగినా వీరు జంటగా హాజరైసందడి చేస్తుంటారు. ఈ జంటను అభిమానించే వారే కాదు.. వీరిపై సోషల్ మీడియాలో ట్రోల్స్ చేసే వారు కూడా చాలా మందే ఉన్నారు. కొన్ని సార్లు నటాషాను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ నీచమైన కామెంట్స్ సైతం చేస్తుంటారు.

వరుణ్ ధావన్

వరుణ్ ధావన్

తాజాగా అర్భాజ్ ఖాన్ చాట్ షోలో పాల్గొన్న వరుణ్ ధావన్... ‘‘తన ప్రియురాలు నటాషా దలాల్ మీద సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్ మీద స్పందించారు. ఇలాంటివి జరిగినపుడు పిచ్చ కోపం వస్తుంది. నాకు సంబంధించిన వ్యక్తులకు రెస్పెక్ట్ ఇవ్వకుంటే అస్సలు నచ్చదు'' అన్నారు.

తెలిసి కూడా ఎందుకు ఇలా చేస్తారు?

తెలిసి కూడా ఎందుకు ఇలా చేస్తారు?

నటాషా నా గర్ల్‌ఫ్రెండ్ అని, ఇద్దరం చాలా రోజులుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నామని అందరికీ తెలుసు. కానీ కావాలని కొందరు మమ్మల్ని అపహాస్యం చేసే విధంగా కామెంట్స్ చేస్తుంటారు. అలా చేయడం సరికాదు. మీకు సంబంధించిన వ్యక్తులపై ఇలానే ఎవరైనా కామెంట్స్ చేస్తే మీరు ఊరుకుంటారా? అని వరుణ్ ధావన్ ప్రశ్నించారు.

అందుకే నాకు నటాషా నచ్చింది

అందుకే నాకు నటాషా నచ్చింది

గతంలో కరణ్ జోహార్ షోలో వరుణ్ ధావన్ మాట్లాడుతూ.. ‘నాకు నటాషాలోని ఇండివిడ్యువాలిటీ నచ్చుతుంది. రేపు మేము పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఆమె వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించను. ఈ విషయంలో మా ఇద్దరి మధ్య మంచి అండర్‌స్టాండింగ్ ఉంది. ఏ విషయంలో అయినా ఆమెకంటూ ఒక అభిప్రాయం ఉంటుంది. దాన్ని నేను కూడా గౌరవిస్తాను' అన్నారు.

నటాషాను చంపుతామని బెదిరింపులు

నటాషాను చంపుతామని బెదిరింపులు

ఇటీవల ఓ లేడీ అభిమాని వరుణ్ ధావన్ ఇంటి వద్ద గొడవ చేయడం మీడియాలో హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. గంటల తరబడి వెయిట్ చేసిన తనను కలిసేందుకు వరుణ్ ధావన్ నిరాకరించడంతో రెచ్చిపోయిన సదరు ఫ్యాన్స్... నీ ప్రియురాలు నటాషాను చంపుతానంటూ బెదిరింపులకు పాల్పడింది. దీనిపై వరుణ్ ధావన్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు.

వరుణ్ ధావన్

వరుణ్ ధావన్

వరుణ్ ధావన్ ప్రస్తుతం ‘కలంక్' సినిమా చేస్తున్నారు. అభిషేక్ వర్మన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కరణ్ జోహార్, సాజిద్ నడియావాలా నిర్మిస్తున్నారు. మాధురి దీక్షిత్, సోనాక్షి సిన్హా, అలియా భట్, వరుణ్ ధావన్, ఆదిత్య రాయ్ కపూర్, సంజయ్ దత్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఏప్రిల్ 17న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X