నీ ప్రియురాలిని చంపేస్తా.. స్టార్ హీరో ఇంటి ముందు లేడీ అభిమాని రచ్చ!

బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ కొంతకాలంగా తన ప్రియురాలు నటాషా దలాల్‌తో ప్రేమలో మునిగితేలుతున్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరూ త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. అయితే తాజాగా వరుణ్ ధావన్ ఇంటి ముందు ఓ లేడీ అభిమాని రచ్చ చేయడం, నీ ప్రియురాలిని చంపేస్తా అంటూ బెదిరింపులకు పాల్పడం చర్చనీయాంశం అయింది. దీనిపై వరుణ్ కేసు కూడా పెట్టడం గమనార్హం.

సదరు లేడీ అభిమాని అలా ప్రవర్తించడానికి, గొడవ చేయడానికి, ఏకంగా ప్రియురాలినే చంపేస్తాను అని చెప్పడానపికి కారణం ఏమిటనేది హాట్ టాపిక్ అయింది. ముంబై మీడియా నుంచి వస్తున్న కథనాల ప్రకారం వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.

గంటల తరబడి నిరీక్షించింది

గంటల తరబడి నిరీక్షించింది

వరుణ్ ధావన్‌కు వీరాభిమాని అయిన ఓ లేడీ... అతడిని కలిసేందుకు శనివారం రాత్రి అతడి ఇంటి బయట గంటల తరబడి నిరీక్షించింది. తన తాజా చిత్రం ‘కలంక్' ప్రమోషనల్ ఈవెంట్లలో బిజీగా ఉన్న వరుణ్ అలసిపోయి ఇంటికి వచ్చాడు. ఆమెను కలవడానికి ఇష్టపడలేదు.

వరుణ్ ధావన్ ప్రియురాలు నటాషాను చంపేస్తానని బెదిరింపు

వరుణ్ ధావన్ ప్రియురాలు నటాషాను చంపేస్తానని బెదిరింపు

ఈ రోజు వరుణ్ ధావన్ ఎవరినీ కలవనని చెప్పారని, ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని సెక్యూరిటీ సిబ్బంది సూచించడంతో ఆగ్రహానికి గురైన సదరు లేడీ అతడి ఇంటి ముందు గొడవ చేయడం ప్రారంభించింది. ముందుగా తనను తాను గాయపరుచుకుని సెక్యూరిటీ సిబ్బందిని భయపెట్టిందని, తనను లోనికి పంపకపోతే వరుణ్ ధావన్ ప్రియురాలు నటాషా దలాల్‌ను చంపేస్తాను అంటూ బెదిరింపులకు పాల్పడినట్లు సమాచారం.

సెక్యూరిటీ సిబ్బంది ఏమన్నారంటే

సెక్యూరిటీ సిబ్బంది ఏమన్నారంటే

‘‘వరుణ్ సర్ తనను కలవడానికి వచ్చే అభిమానులను తప్పకుండా కలుస్తారు. వారికి సెల్ఫీలు ఇస్తారు. ఆయన్ను కలవడానికి నిన్న వచ్చిన ఒక లేడీ గంటల తరబడి వెయిట్ చేసింది. అయితే వరుణ్ సర్ లేటుగా రావడం, చాలా అలసిపోయి ఉండటంతో ఆమెను కలవలేక పోయారు. దీంతో ఆమె గొడవ చేయడం ప్రారంభించింది, మొదట తనను తాను గాయపరుచుకుంటానని బెదిరించింది. తర్వాత నటాషా మేడమ్‌ను చంపుతానని బెదిరించింది.'' అని సెక్యూరిటీ సిబ్బంది చెప్పినట్లు ముంబైకి చెందిన మీడియా సంస్థలు పేర్కొన్నాయి.

పోలీసులకు ఫిర్యాదు

పోలీసులకు ఫిర్యాదు

ఈ సంఘటనపై ముంబైలోని శాంతా క్రజ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైనట్లు తెలుస్తోంది. అయితే వరుణ్ ధావన్ నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాతే పోలీసులు ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారని తెలుస్తోంది.

కలంక్

కలంక్

కలంక్ సినిమా విషయానికొస్తే.. అభిషేక్ వర్మన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కరణ్ జోహార్, సాజిద్ నడియావాలా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మాధురి దీక్షిత్, సోనాక్షి సిన్హా, అలియా భట్, వరుణ్ ధావన్, ఆదిత్య రాయ్ కపూర్, సంజయ్ దత్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఏప్రిల్ 17న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X