తనకు కాబోయే భార్య ఎవరో చెప్పేసిన యువ హీరో.. ఆమె నార్మల్ అమ్మాయి!
బాలీవుడ్ లో దూసుకుపోతున్న యువ హీరోల్లో వరుణ్ ధావన్ ఒకరు. స్టైలిష్ పాత్రలకు వరుణ్ ధావన్ పెట్టింది పేరు. ప్రస్తుతం దేశమంతటా కాఫీ విత్ కరణ్ షో హాట్ టాపిక్ గా మారుతోంది. కరణ్ జోహార్ ఈ షోలో హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ షోకు హాజరయ్యే సెలెబ్రిటీల వ్యక్తిగత విషయాలు కూడా బయటకు లాగేస్తున్నాడు. ఇటీవల ఈ షోలో యంగ్ హీరో వరుణ్ ధావన్, అందాల తార కత్రినా కైఫ్ అతిధులుగా హాజరైన సంగతి తెలిసిందే.

కాబోయే భార్య గురించి
ఈ షోలో వరుణ్ ధావన్ పెళ్ళికి సంబంధించిన విశేషాలు రాబట్టాడు. దీనితో వరుణ్ ధావన్ కు కాబోయే భార్య ఎవరో తెలిసిపోయింది. తాను ప్రస్తుతం నటాషా దలాల్ తో ప్రేమలో ఉన్నానని వరుణ్ తెలిపాడు. త్వరలోనే వివాహానికి ప్లాన్ చేస్తున్నట్లు కూడా వరుణ్ ధావన్ వివరించాడు.

అప్పుడు అలా
గతంలో కూడా వరుణ్ ధావన్ నటాషా ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. మీడియా వరుణ్ ధావన్ ని నటాషా గురించి అడిగిన సందర్భంలో నా వ్యక్తిగత జీవితం గురించి బయటకు వివరించడం ఇష్టం లేదని తెలిపాడు. నా పర్సనల్ లైఫ్ గురించి మీడియాలో వార్తలు రావడం ఇష్టం లేదు. అందుకే అలాంటి విషయాలేవీ బయటకు చెప్పను అని తెలిపాడు. కానీ ఇప్పుడు మాత్రం వరుణ్ ధావన్ తన పెళ్లి గురించి జాతీయ ఛానల్ వేదికగా మాట్లాడడం హాట్ టాపిక్ గా మారింది.

ఆమె నార్మల్ అమ్మాయి
తన ప్రేయసి గురించి వరుణ్ ధావన్ మాట్లాడుతూ నటాషా చాలా నార్మల్ అమ్మాయి. మీడియా, హడావిడి వీటన్నింటికి దూరంగా పెరిగింది. తనకు అలా ఉండడమే ఇష్టం. తన స్వేచ్చకు భంగం కలగకుండా చూసుకోవడం నా భాద్యత అని వరుణ్ ధావన్ తెలిపాడు.

వైవిధ్యమైన పాత్రలో
వరుణ్ ధావన్ తొలిసారి సూయి ధాగా అనే చిత్రంలో స్టైల్ కు దూరంగా వైవిధ్యమైన పాత్రలో నటించాడు. వరుణ్ ధావన్, అనుష్క శర్మ జంటగా నటించిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. వరుణ్ ధావన్ ప్రస్తుతం పలు చిత్రాలతో బిజీగా గడుపుతున్నాడు.


Click it and Unblock the Notifications











