»   » నా ప్రేయసి దారుణంగా మోసగించింది.. గుండె పగిలేలా వంచించింది.. వరుణ్

నా ప్రేయసి దారుణంగా మోసగించింది.. గుండె పగిలేలా వంచించింది.. వరుణ్

Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి చీట్ చేస్తే ఎవరికైనా గుండె పగలడం సాధారణం. బాలీవుడ్ నటుడు వరుణ్ తేజ్ దీనికి ఏ మాత్రం అతీతుడు కాదని నిరూపితమైంది. సెక్సీగా కనిపించే వరుణ్ ధావన్ అంటే లెక్కలేనంత మంది అమ్మాయిలు పడిపోతుంటారు. తన జీవితంలో ప్రియురాలు మోసగించిన విషయాన్ని ఇండియా టుడే సదస్సులో పూసగుచ్చినట్టు వివరించారు. వరుణ్ చెప్పిన ప్రకారం..

    కాలేజీలో నా ప్రేయసి

    కాలేజీలో నా ప్రేయసి

    నేను ముంబైలోని ఓ కాలేజీలో చదువుతున్నప్పటి రోజుల్లో నాకు లవర్ ఉండేది. నేను ఆమెతో జీవితాన్ని పంచుకోవాలని సీరియస్‌గా ఉండేవాడిని. లాంగ్ టర్మ్ రిలేషన్‌ను కొనసాగించాలని అనుకొనే వాడిని. కానీ ఆమె చేసిన మోసంతో నేను షాక్ తిన్నాను. ఆ రిలేషన్ మొదలైన నాలుగు నెలలకే మా బంధం తెగిపోయింది అని వరుణ్ తెలిపారు.

    దారుణంగా చీట్ చేసింది

    దారుణంగా చీట్ చేసింది

    నా ప్రేయసి చేసిన మోసానికి చాలా దిగ్భ్రాంతికి గురయ్యాను. నటుడిని అయినంత మాత్రాన ఇలాంటి అనుభవాలు ఎదురుకాకుండా ఉండవు. మనిషి జీవితంలో తొమ్మిది రకాల ఎమోషన్స్ ఉంటాయి. జీవితంలో గుండె పగిలినప్పుడు వాటిని నుంచి గుణపాఠాలు నేర్చుకోవాలి అని వరుణ్ పేర్కొన్నాడు.

    బాల్య స్నేహితురాలితో డేటింగ్

    బాల్య స్నేహితురాలితో డేటింగ్

    ప్రస్తుతం నటాషా దలాల్ అనే తన బాల్య మిత్రురాలితో వరుణ్ ప్రేమలో ఉన్నాడు. నటాషా అంటే నాకు చాలా ఇష్టం. అందుకే పబ్లిక్‌గా ఆమె గురించి మాట్లాడటానికి ఇష్టపడను. ఆమెకు సినీ పరిశ్రమతో పరిచయం లేదు. అందుకే నేను ఆమెను మీడియా కంట పడకుండా కాపాడుకుంటాను అని వరుణ్ తన ప్రేయసి గురించి చెప్పుకొచ్చాడు.

    ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదు

    ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదు

    తన పెళ్లి గురించి వివరణ ఇస్తూ.. నిజంగా చెప్పాలంటే ఇప్పట్లో పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేదు. జీవితంలో ఎవరితోనైనా బలమైన బంధం ఏర్పడేవరకు వేచి చూడాలి. ఆ తర్వాతే మనకు ఆ వ్యక్తితో జీవితాన్ని పంచుకోవాలనిపిస్తుంది. ఒక్కటై జీవితాన్ని ముందుకు తీసుకువెళ్లాలనిపిస్తుంది అని వరుణ్ ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు.

     అనుష్కశర్మతో డిఫరెంట్‌గా

    అనుష్కశర్మతో డిఫరెంట్‌గా

    ప్రస్తుతం శరత్ కటారియా రూపొందించే సూయి దాగా అనే చిత్రంలో నటించాడు. అనుష్క శర్మతో కలిసి ఓ విభిన్నమైన పాత్రను పోషించాడు. ఈ చిత్రం సెప్టెంబర్ 28న రిలీజ్‌కు ముస్తాబవుతున్నది. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్, ట్రైలర్‌కు మంచి స్పందన వస్తున్నది.

    English summary
    Varun Dhawan revealed that his girlfriend in college was unfaithful to him. He said It was the first serious, long term relationship I'd been in. I think it had lasted four months... but then she cheated on me.
    దేశంలోనే అతిపెద్ద పొలిటికల్ పోల్: ఈ సర్వేలో మీరు పాల్గొన్నారా?
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more