twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాలీవుడ్‌లో పెళ్లి సందడి.. ఆమెతో వరుణ్ ధావన్ వివాహాం

    |

    2020లో ఎంతో మంది సెలెబ్రిటీలు ఓ ఇంటి వారయ్యారు. అయితే ఇందులో బాలీవుడ్ స్టార్ హీరోల నుంచి మాత్రం ఏ ఒక్కరూ కూడా పెళ్లిపీటలు ఎక్కలేదు. బాలీవుడ్ ఇండస్ట్రీలోనూ కొన్ని వివాహాలు జరిగినా వారెవ్వరూ కూడా అంతగా తెలియదు. సింగర్ నేహా కక్కర్ పెళ్లి జరిగింది. కానీ అంతగా వైరల్ అవ్వలేదు. అయితే దక్షిణాదిన అది కూడా టాలీవుడ్‌లో నిజంగానే పెళ్లి సందడిని తలపించింది.

    వరుసగా హీరోల పెళ్లిళ్లు జరిగాయి. నిఖిల్, రానా, నితిన్ వంటి స్టార్ హీరోల వివాహాలు జరిగాయి. నిహారిక, కాజల్ వంటి వారి విహహాలు కూడా గతేడాది జరిగాయి. ఇక సునీత పెళ్లి ఈ ఏడాదిప్రారంభంలోనే జరిగింది. బాలీవుడ్‌ల్ రణ్‌బీర్ కపూర్, అలియా భట్ వివాహాం గతేడాది జరిగేదట. కానీ కోవిడ్ వల్ల క్యాన్సిల్ అయిందంటూ రణ్ బీర్ కపూర్ క్లారిటీ ఇచ్చాడు. అయితే ఇప్పడు ఓ జంట మాత్రం పెళ్లి పీటలెక్కబోతోంది.

    Varun Dhawan Natasha marriage on 24th January

    బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ తన చిన్ననాటి స్నేహితురాలైన నటాషా దలాల్‌ను వివాహాం చేసుకోబోతోన్నాడు. నటాష ప్రస్తుతం ముంబైలోనే ఫ్యాషన్ డిజైనర్‌గా పని చేస్తోంది. జనవరి 24న జరగబోతోన్న ఈ వివాహా వేడుకలు నేడు ప్రారంభమయ్యాయి.

    ఇరు కుటుంబ సభ్యులు కూడా అలీభాగ్‌కు బయల్దేరారు. ఈ వేడుకకు బాలీవుడ్ నుంచి సల్మాన్ ఖాన్, అలియా భట్, కత్రినా, రణ్ బీర్ కపూర్ వంటి వారంతా హాజరు కాబోతోన్నట్టు తెలుస్తోంది. వరుణ్ ధావన్ చివరగా కూలీ నెంబర్ వన్ చిత్రంతో పలకరించాడు.

    English summary
    Varun Dhawan Natasha marriage on 24th January..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X