Don't Miss!
- Sports IPL 2024: ఆ తెలుగు టీమ్ సాంగ్ ముందు ఏది పనికి రాదు: రోహిత్ శర్మ వీడియో
- News జూన్ 4 ఫలితాలతో ఏపీలో జరగబోయేదేంటి..!!
- Lifestyle Happy Birthday Wishes : పుట్టినరోజు శుభాకాంక్షలను ఇలా అందంగా తెలపండి..
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Technology వన్‌ప్లస్ 11R 5G కొత్త వేరియంట్ విడుదల.. అమెజాన్‌లో ఈ కార్డులపై రూ.1000 తగ్గింపు..!
- Automobiles జనాలు ఎక్కువగా కొంటున్న టాప్-3 SUVలు ఇవే.. జాబితాలో లేని టాటా కార్లు!!
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
బాలీవుడ్లో పెళ్లి సందడి.. ఆమెతో వరుణ్ ధావన్ వివాహాం
2020లో ఎంతో మంది సెలెబ్రిటీలు ఓ ఇంటి వారయ్యారు. అయితే ఇందులో బాలీవుడ్ స్టార్ హీరోల నుంచి మాత్రం ఏ ఒక్కరూ కూడా పెళ్లిపీటలు ఎక్కలేదు. బాలీవుడ్ ఇండస్ట్రీలోనూ కొన్ని వివాహాలు జరిగినా వారెవ్వరూ కూడా అంతగా తెలియదు. సింగర్ నేహా కక్కర్ పెళ్లి జరిగింది. కానీ అంతగా వైరల్ అవ్వలేదు. అయితే దక్షిణాదిన అది కూడా టాలీవుడ్లో నిజంగానే పెళ్లి సందడిని తలపించింది.
వరుసగా హీరోల పెళ్లిళ్లు జరిగాయి. నిఖిల్, రానా, నితిన్ వంటి స్టార్ హీరోల వివాహాలు జరిగాయి. నిహారిక, కాజల్ వంటి వారి విహహాలు కూడా గతేడాది జరిగాయి. ఇక సునీత పెళ్లి ఈ ఏడాదిప్రారంభంలోనే జరిగింది. బాలీవుడ్‌ల్ రణ్‌బీర్ కపూర్, అలియా భట్ వివాహాం గతేడాది జరిగేదట. కానీ కోవిడ్ వల్ల క్యాన్సిల్ అయిందంటూ రణ్ బీర్ కపూర్ క్లారిటీ ఇచ్చాడు. అయితే ఇప్పడు ఓ జంట మాత్రం పెళ్లి పీటలెక్కబోతోంది.
బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ తన చిన్ననాటి స్నేహితురాలైన నటాషా దలాల్‌ను వివాహాం చేసుకోబోతోన్నాడు. నటాష ప్రస్తుతం ముంబైలోనే ఫ్యాషన్ డిజైనర్‌గా పని చేస్తోంది. జనవరి 24న జరగబోతోన్న ఈ వివాహా వేడుకలు నేడు ప్రారంభమయ్యాయి.
ఇరు కుటుంబ సభ్యులు కూడా అలీభాగ్‌కు బయల్దేరారు. ఈ వేడుకకు బాలీవుడ్ నుంచి సల్మాన్ ఖాన్, అలియా భట్, కత్రినా, రణ్ బీర్ కపూర్ వంటి వారంతా హాజరు కాబోతోన్నట్టు తెలుస్తోంది. వరుణ్ ధావన్ చివరగా కూలీ నెంబర్ వన్ చిత్రంతో పలకరించాడు.