For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎప్పుడూ నైట్ డ్రస్‌లోనే ఎందుకు.. చిలిపి ప్రశ్నకు దీపికా దిమ్మతిరిగే జవాబు

    |

    ఎప్పుడూ షూటింగ్‌లతో బిజీగా ఉండే సినీ తారలు.. కరోనావైరస్ పుణ్యమా అని ఇప్పుడు కాస్త విరామం తీసుకొంటున్నారు. ఈ సందర్భంగా ఇంట్లోనే ఉంటూ సొంత పనులను చక్క బెట్టుకొంటున్నారు. కరొనా కారణంగా దొరికిన విలువైన సమయంలో బాలీవుడ్ తారలు దీపికా పదుకోన్, వరుణ్ ధావన్ మధ్య ఆసక్తికరమైన వాట్సప్ సంభాషణ జరిగింది. ఈ సందర్భంగా వరుణ్ అడిగిన ప్రశ్నకు దీపికా పదుకోన్ ఎలాంటి సమాధానం ఇచ్చిందో మీరే చూడండి..

    గృహ నిర్భంధంలో

    గృహ నిర్భంధంలో

    కరోనావైరస్‌తో లాక్‌డౌన్‌తో దొరికిన సమయాన్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నావని వరుణ్ ధావన్ అడిగిన ప్రశ్నకు దీపిక పదుకోన్ సమాధానం ఇస్తూ.. చాలా ప్రొడక్టివ్ పని చేస్తున్నాను. ఫ్రూట్స్ తింటూ.. ఫ్రూట్ జ్యూస్ తాగుతూ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాను అంటూ ద్రాక్ష రసం గ్లాస్‌తో కూడిన ఫొటోను పోస్టు చేసింది.

     వార్డ్‌రోబ్‌ను సర్దుకుంటున్నా

    వార్డ్‌రోబ్‌ను సర్దుకుంటున్నా

    చాలాకాలం తర్వాత ఇంట్లోనే ఉండే అవకాశం దక్కడంతో నా వార్డ్‌రోబ్‌ను సరిచేసుకొంటున్నాను. అస్తవ్యస్తంగా ఉన్న నా దుస్తులను చక్కగా క్రమపద్దతిలో సెట్ చేసుకొంటున్నాను. అలా నా తొలిరోజు గడిచిపోయింది. ఇక రెండో రోజు నా ఆరోగ్యం, సౌందర్యానికి సంబంధించిన విషయాలను చూసుకొంటున్నాను అని దీపికా పదుకోన్ వెల్లడించింది.

    ఎప్పుడూ నైట్ డ్రస్‌లోనేనా

    ఎప్పుడూ నైట్ డ్రస్‌లోనేనా

    ఇక తనకు ఉన్న చనువుతో దీపికా పదుకోన్‌ను వరుణ్ ధావన్‌ను ఓ చిలిపి ప్రశ్నను అడిగాడు. నీవు ఎప్పుడు నైట్ డ్రస్‌లోనే ఉంటావు ఎందుకు అని వరుణ్ అంటే.. నాకు అది చాలా కంఫర్ట్‌గా ఉంటుంది. ఎప్పుడంటే అప్పుడు పడుకోవడానికి సౌకర్యంగా ఉంటుంది అని ఎమోజీని దీపిక పదుకోన్ పోస్టు చేసింది.

    Rahul Sipligunj Special Request To KTR | నమ్మి ఎన్నుకుంటే ఇలా చేస్తారా..!!
    వరుణ్, దీపికా ఇప్పటి వరకు కలిసి..

    వరుణ్, దీపికా ఇప్పటి వరకు కలిసి..

    కెరీర్‌పరంగా వరుణ్ ధావన్, దీపికా పదుకోన్ కలిసి నటించకపోయినా.. వారిద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. వరుణ్ కెరీర్ విషయానికి వస్తే.. తండ్రి డేవిడ్ ధావన్ రూపొందించే కూలీ నంబర్ 1 చిత్రంలో సారా ఆలీఖాన్‌తో కలిసి నటిస్తున్నాడు. ఇక దీపిక పదుకోన్ విషయానికి వస్తే.. భర్త రణ్‌వీర్ కపూర్ నటించే 83 చిత్రంలో ఆమె అతిథి పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి కబీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.

    English summary
    Bollywood stars Varun Dhawan's Whatsapp Chat with Deepika Padukone goes very interesting. When Varun Dhawan asked, "Why you always in a night suit?" Deepika replied, "Varun Dhawan, coz then I can comfortably sleep (indicating with an emoji) anytime!".
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more
    X