Don't Miss!
- News బీఆర్ఎస్కు బిగ్ షాక్.. కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్న వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి
- Sports SRHకు భయపడి CSK సంచలన నిర్ణయం: ధోనీ మైండ్ గేమ్?
- Finance Stock Market Close: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- Lifestyle హడలెత్తిస్తున్న Bird Flu పాలు,గుడ్లు మరియు చికెన్ తినడం సురక్షితమేనా?మనుషులకూ వ్యాపిస్తుందా..నిపుణులు ఏమంటారు?
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఎప్పుడూ నైట్ డ్రస్‌లోనే ఎందుకు.. చిలిపి ప్రశ్నకు దీపికా దిమ్మతిరిగే జవాబు
ఎప్పుడూ షూటింగ్‌లతో బిజీగా ఉండే సినీ తారలు.. కరోనావైరస్ పుణ్యమా అని ఇప్పుడు కాస్త విరామం తీసుకొంటున్నారు. ఈ సందర్భంగా ఇంట్లోనే ఉంటూ సొంత పనులను చక్క బెట్టుకొంటున్నారు. కరొనా కారణంగా దొరికిన విలువైన సమయంలో బాలీవుడ్ తారలు దీపికా పదుకోన్, వరుణ్ ధావన్ మధ్య ఆసక్తికరమైన వాట్సప్ సంభాషణ జరిగింది. ఈ సందర్భంగా వరుణ్ అడిగిన ప్రశ్నకు దీపికా పదుకోన్ ఎలాంటి సమాధానం ఇచ్చిందో మీరే చూడండి..
గృహ నిర్భంధంలో
కరోనావైరస్తో లాక్‌డౌన్‌తో దొరికిన సమయాన్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నావని వరుణ్ ధావన్ అడిగిన ప్రశ్నకు దీపిక పదుకోన్ సమాధానం ఇస్తూ.. చాలా ప్రొడక్టివ్ పని చేస్తున్నాను. ఫ్రూట్స్ తింటూ.. ఫ్రూట్ జ్యూస్ తాగుతూ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నాను అంటూ ద్రాక్ష రసం గ్లాస్‌తో కూడిన ఫొటోను పోస్టు చేసింది.
వార్డ్రోబ్ను సర్దుకుంటున్నా
చాలాకాలం తర్వాత ఇంట్లోనే ఉండే అవకాశం దక్కడంతో నా వార్డ్రోబ్ను సరిచేసుకొంటున్నాను. అస్తవ్యస్తంగా ఉన్న నా దుస్తులను చక్కగా క్రమపద్దతిలో సెట్ చేసుకొంటున్నాను. అలా నా తొలిరోజు గడిచిపోయింది. ఇక రెండో రోజు నా ఆరోగ్యం, సౌందర్యానికి సంబంధించిన విషయాలను చూసుకొంటున్నాను అని దీపికా పదుకోన్ వెల్లడించింది.
ఎప్పుడూ నైట్ డ్రస్లోనేనా
ఇక తనకు ఉన్న చనువుతో దీపికా పదుకోన్‌ను వరుణ్ ధావన్‌ను ఓ చిలిపి ప్రశ్నను అడిగాడు. నీవు ఎప్పుడు నైట్ డ్రస్‌లోనే ఉంటావు ఎందుకు అని వరుణ్ అంటే.. నాకు అది చాలా కంఫర్ట్‌గా ఉంటుంది. ఎప్పుడంటే అప్పుడు పడుకోవడానికి సౌకర్యంగా ఉంటుంది అని ఎమోజీని దీపిక పదుకోన్ పోస్టు చేసింది.
Recommended Video
వరుణ్, దీపికా ఇప్పటి వరకు కలిసి..
కెరీర్‌పరంగా వరుణ్ ధావన్, దీపికా పదుకోన్ కలిసి నటించకపోయినా.. వారిద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. వరుణ్ కెరీర్ విషయానికి వస్తే.. తండ్రి డేవిడ్ ధావన్ రూపొందించే కూలీ నంబర్ 1 చిత్రంలో సారా ఆలీఖాన్‌తో కలిసి నటిస్తున్నాడు. ఇక దీపిక పదుకోన్ విషయానికి వస్తే.. భర్త రణ్వీర్ కపూర్ నటించే 83 చిత్రంలో ఆమె అతిథి పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి కబీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.