‘కూలి నెం.1’ మూవీతో నిర్మాతగా మారుతున్న యంగ్ హీరో!
బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ ఇండస్ట్రీకి వచ్చి ఏడు సంవత్సరాలవుతోంది. వరుస అవకాశాలు, విజయాలు దక్కించుకుంటూ దూసుకెళుతున్న ఈ స్టార్ హిందీ చిత్ర సీమలో స్టార్ హోదా అందుకున్నాడు. ఇప్పటి వరకు కేవలం నటుడిగానే ఉన్న ఇతగాడు త్వరలో నిర్మాత అవతారం ఎత్తబోతున్నాడు.
తాజాగా ఓ బాలీవుడ్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వరుణ్ ధావన్ మాట్లాడుతూ..సొంతగా ప్రొడక్షన్ కంపెనీ మొదలు పెట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. కూలీ నెం.1 సినిమా ద్వారా నిర్మాతగా మారబోతున్నట్లు వెల్లడించారు.
'నేను నిర్మాతగా మారాలనుకుంటున్నాను. కానీ సెట్స్‌లో నిర్మాతగా బిహేవ్ చేయాలనే ఉద్దేశ్యం మాత్రం లేదు. నేను నటుడిని..ఆ విషయాన్ని మైండ్‌లో పెట్టుకుంటాను. మా బ్రదర్ లేదా నాన్నతో కలిసి సినిమా నిర్మించాలనుకుంటున్నాను' అని వరుణ్ ధావన్ స్పష్టం చేశారు.

ఏడేళ్ల వరుణ్ ధావన్ కెరీర్లో ఇప్పటి వరకు ఒక్క ప్లాప్ కూడా లేదు. 'నేను ఏ సినిమా చేసినా అది బాగా ఆడి డబ్బులు తీసుకురావాలని కోరుకుంటాను. ఎవరైనా మనపై పెట్టుబడి పెట్టినపుడు వారు నష్టపోకుండా చూసుకోవడం మన బాధ్యత. అనవసర డిమాండ్లు చేసి ఇతరుల డబ్బును వృధా చేయడం తనకు ఇష్టం ఉండదు' అని వరుణ్ అన్నారు.
'కూలీ నెం.1' మూవీ గురించి వరుణ్ ధావన్ మాట్లాడుతూ.... ఇది రీమేక్ మూవీ కాదని, అయితే 1995లో గోవిందా, కరిష్మా కపూర్ జంటగా వచ్చిన చిత్రానికి అడాప్షన్ మాత్రమే అని స్పష్టం చేశారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.


Click it and Unblock the Notifications











