అవ్వా! జాగ్రత్త.. ఓటెయ్యడానికి వచ్చిన వృద్ధురాలికి స్టార్ హీరో చేయుత.. ‌హృదయాలను గెలుచుకొన్న..

Recommended Video

Varun Dhawan Helps Old Woman Cast Vote, Wins Hearts || Filmibeat Telugu

దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో బాలీవుడ్ ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకొన్నారు. నాలుగో విడుత ఎన్నికల్లో భాగంగా ముంబైలో దీపిక పదుకోన్, రణ్‌బీర్ కపూర్, కరీనా కపూర్ ఖాన్, షారుక్ ఖాన్, ఐశ్వర్య రాయ్ బచ్చన్, అనుష్క శర్మ, ప్రియాంక చోప్రా, రణ్‌వీర్ సింగ్ తమ తమ పోలింగ్ స్టేషన్‌కు వచ్చి ఓటు వేశారు. ఈ సందర్భంగా హీరో వరుణ్ ధావన్‌కు సంబంధించిన ఆసక్తికర సంఘటన చోటుచేసుకొన్నది. ఏం జరిగిందంటే..

వరుణ్ ధావన్ ఓటు హక్కు కోసం

వరుణ్ ధావన్ ఓటు హక్కు కోసం

ముంబైలోని ఓ పోలింగ్ బూతులో ఓటు హక్కును ఉపయోగించుకొనేందుకు బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ తన తండ్రి డేవిడ్ ధావన్‌తో కలిసి వచ్చారు. ఆ సందర్భంగా ఓటు వేయడానికి వచ్చిన ఓ వృద్ధురాలు నడువలేక ఇబ్బంది పడటం గుర్తించారు. దాంతో ఆమె చేయి చేతిలోకి తీసుకొని మెట్లు ఎక్కించి ఓటు హక్కు వేసేందుకు సహకరించాడు.

వృద్ధురాలికి చేయూతతో

వృద్ధురాలికి చేయూతతో

వృద్ధురాలికి సహాయం అందించిన వరుణ్ ధావన్ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. తోటి వారిపై పంచిన ప్రేమ, గౌరవానికి నిదర్శనం అని పొగడ్తలతో ప్రశంసిస్తున్నారు. సినీ తారలంటే ఆకాశం నుంచి ఊడిపడినట్టు వ్యవహరిస్తారు. కానీ వరుణ్ నేల మీద నడిచే తార అని ఓ ఫొటో జర్నలిస్టు కామెంట్ చేయడగా.. మంచి విలువలతో పెరిగిన యువకుడు అని, వరుణ్ చూస్తే గర్వంగా ఉంది అని మరికొందరు కామెంట్ చేశారు.

 ఓటు హక్కు వినియోగించుకోవాలి

ఓటు హక్కు వినియోగించుకోవాలి

తన ఓటు హక్కను వినియోగించుకొన్న తర్వాత వరుణ్ తన వేలికి ఇంక్ ఉన్న ఫొటోను సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్టు చేశాడు. ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకోండి.. జైహింద్ అంటూ కామెంట్ పెట్టారు. అంతేకాకుండా అందరూ ఓటు హక్కును ఉపయోగించుకోవాలని సోషల్ మీడియా ద్వారా పిలుపునిచ్చాడు.

 కూలీనంబర్ నంబర్ 1 రీమేక్

కూలీనంబర్ నంబర్ 1 రీమేక్

ఇక వరుణ్ కెరీర్ విషయానికి వస్తే.. ఇటీవల కరణ్ జోహర్ రూపొందించిన కళంక్ సినిమాలో నటించగా, ఆ చిత్రం బాక్సాపీస్ వద్ద బోల్తా కొట్టింది. ప్రస్తుతం స్ట్రీట్ డ్యాన్సర్ 3డీ చిత్రంలో శ్రద్ధాకపూర్‌తో కలిసి నటిస్తున్నారు. అలాగే కూలీ నంబర్ 1 చిత్ర రీమేక్‌లో నటించనున్నారు. త్వరలోనే ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X