Don't Miss!
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- News విశాఖ లోక్‌సభ పరిధిలో ఆ సామాజిక వర్గందే పెత్తనం..బొత్స ఝాన్సీకి కలిసొస్తుందా..?
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
హీరోయిన్ ప్రైవేట్ పార్ట్స్‌పై కమెడియన్ నీఛమైన కామెంట్.. ఆమె భర్త ఎవరో తెలిస్తే!
హీరోయిన్ అయేషా టకియా తెలుగులో సూపర్ చిత్రంలో నటించింది. పలు బాలీవుడ్ చిత్రాల్లో కూడా అయేషా టకియా పలు చిత్రాల్లో నటించింది. 2009లో వివాహం చేసుకున్న తర్వాత అయేషా టాకియా సినిమాలకు గుడ్ బై చెప్పింది. సూపర్ చిత్రంలో అయేషా అందానికి కుర్రకారు ఫిదా అయ్యారు. ఆ తర్వాత తెలుగు చిత్రాల్లో నటన కొనసాగించేందుకు అయేషా ఆసక్తి చూపలేదు. తాజాగా అయేషా టాకియా ఓ కమెడియన్ వల్ల వార్తల్లో నిలిచారు. ఏడేళ్ల క్రితం ఓ కార్యక్రమంలో కెమెడియన్ వరుణ్ గ్రోవర్ అయేషా టాకియాని ఉద్దేశిస్తూ చేసిన వల్గర్ కామెంట్ ని దర్శకుడు అశోక్ పండిట్ తాజాగా షేర్ చేశారు.
అసభ్యకరంగా
వరుణ్ గ్రోవర్ కామెడీ పంచులతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఏడేళ్ల క్రితం అతడు అయేషా టకియాని ఉద్దేశిస్తూ చేసిన అసభ్యకరమైన కామెంట్ ని అశోక్ పండిట్ షేర్ చేశాడు. అమితాబ్ బచ్చన్ ప్రతి చిత్రంలో నటిస్తున్నారు. ఏ సినిమాలో చూసినా ఆయనే కనిపిస్తున్నారు. ఈ విషయాన్ని అయేషా టకియా యద సంపదతో పోల్చుతూ వరుణ్ గ్రోవర్ వల్గర్ గా మాట్లాడాడు.
అలాంటి కమెడియన్
అశోక్ పండిట్ ట్విట్టర్లో ఈ వీడియో షేర్ చేయగానే.. నెటిజన్లు వరుణ్ గ్రోవర్ పై దుమ్మెత్తి పోస్తున్నారు. అతడొక థర్డ్ గ్రేడ్ కమెడియన్. ఒకరిని అవమానించేలా కామెంట్స్ చేస్తే అది హాస్యం అవదు అని ఓ నెటిజన్ వ్యాఖ్యానించారు. అతడిని చూస్తుంటే అసహ్యంగా ఉంది.. చీప్ మెంటాలిటీ అని మరో నెటిజన్ కామెంట్ చేశారు.
ఆమె మామగారు ఎవరో తెలిస్తే
మరో నెటిజన్ ఆసక్తికర సమాధానం ఇచ్చాడు.వరుణ్ గ్రోవర్ కు అయేషా టకియా భర్త, మామగారు ఎవరో తెలిసినట్లు లేదు. అయేషా భర్త ఫర్హాన్ అజ్మీ, మామగారు అబు అజ్మీ చాలా దూకుడైన పొలిటీషియన్స్.. వాళ్ళ గురించి తెలిస్తే వరుణ్ గ్రోవర్ ఇక జీవితంలో ఆమె పేరు ఎత్తడు అని తెలిపాడు. ఇదిలా ఉండగా అశోక్ పండిట్ ఈ వీడియో పోస్ట్ చేస్తూ స్వర భాస్కర్, రిచా చద్దా, షబానా అజ్మీ లాంటి సెలెబ్రిటీలపై విమర్శలు కురిపించారు.
|
వాళ్లంతా ఏమయ్యారు
అయేషా టకియాపై వరుణ్ గ్రోవర్ చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యల పట్ల స్వర భాస్కర్, రిచా చద్దా, షబానా అజ్మీ ఎందుకు సైలెంట్ గా ఉన్నారు అని అశోక్ పండిట్ ప్రశ్నించారు. వివాదాస్పద అంశాలలో మహిళా సాధికారత అంటూ వ్యాఖ్యలు చేసే వీళ్ళు ఇప్పుడేమయ్యారు అని అశోక్ పండిట్ ప్రశ్నించారు. ఇతడు చేసిన వ్యాఖ్యలు మహిళలని కించపరిచే విధంగా ఉన్నాయి. అయినా ఎవరూ స్పందించలేదు అని అశోక్ పండిట్ ఆగ్రహం వ్యక్తం చేశారు.