ప్రభాస్ సినిమాలో మరో సీరియల్ నటుడు: ఆ ట్వీట్‌తో బయటకు వచ్చిన మేటర్
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నటిస్తోన్న చిత్రాల్లో 'ఆదిపురుష్' ఒకటి. చరిత్రతో కూడిన చిత్రాలతో మంచి గుర్తింపును అందుకున్న ఓం రౌత్ ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. రామాయణం నాటి కథతో.. చెడు మీద మంచి గెలవడం అనే కాన్సెప్టుతో ఇది తెరకెక్కుతోంది. పాన్ ఇండియా రేంజ్‌లో వచ్చే ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. ఇప్పటికే చాలా వరకు షూటింగ్‌ను కూడా పూర్తి చేసుకుందీ మూవీ. ఈ నేపథ్యంలో తాజాగా ఈ భారీ బడ్జెట్ చిత్రం గురించి ఓ న్యూస్ బయటకు వచ్చింది.
'ఆదిపురుష్' మూవీ తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో తెరకెక్కుతోంది. ఇందులో ఎంతో మంది హిందీ నటులు కీలక పాత్రలను పోషిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో నటుడు ఇందులో భాగం అయ్యాడని తెలిసింది. ఎన్నో సీరియళ్లలో అద్భుతమైన నటనతో ఆకట్టుకుని ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన వత్సల్ సేథ్ 'ఆదిపురుష్'లో నటిస్తున్నాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్వీట్ చేశాడు. దర్శకుడితో దిగిన ఓ ఫొటోను కూడా షేర్ చేశాడు. అయితే, అతడు ఇందులో ఏ పాత్రను పోషిస్తున్నాడన్న దానిపై క్లారిటీ లేదు.

'జస్ట్ మొహబ్బత్' అనే సీరియల్‌తో నటుడిగా పరిచయం అయిన వత్సల్ సేథ్.. ఆ తర్వాత చాలా వాటిలో నటించాడు. ఈ క్రమంలోనే 'టార్జాన్.. ద వండర్ కార్' అనే చిత్రంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత చాలా మూవీల్లో నటించాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు 'ఆదిపురుష్'లో చేస్తున్నాడు. ఇక, ఈ సినిమాలో ప్రభాస్ శ్రీరాముడిగానూ.. సైఫ్ అలీ ఖాన్ రావణుడిగానూ నటిస్తున్నారు. అలాగే, టాల్ బ్యూటీ కృతి సనన్ సీతగా చేస్తోంది. సన్నీ సింగ్ లక్ష్మణుడి పాత్రను పోషిస్తున్నాడు. భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











