పబ్లిక్‌గా సింగర్‌కి హీరోయిన్ ఘాటు ముద్దు.. ప్రియురాలి పనికి షాక్‌లో స్టార్ హీరో
ప్రియుడు పక్కనే ఉండగా.. ప్రియురాలు పరాయి వ్యక్తితో సన్నిహితంగా ఉంటేనే తట్టుకోవడం కష్టం. అలాంటిది తన ప్రేయసి మరొకరికి ముద్ధుపెట్టి, హగ్ చేసుకుంటే ఆ ప్రియుడి పరిస్ధితి దారుణంగా ఉంటుంది. ఇది ఎన్నో పరిణామాలకు దారి తీస్తుంది. ప్రస్తుతం సమాజంలో ఈ పోకడల కారణంగా నేరాలు గణనీయంగా పెరుగుతున్నాయి. సామాన్యులే కాదు సెలబ్రిటీలు కూడా ఇందుకు అతీతం కాదు. కోట్లాది ప్రజలు ఫాలో అయ్యే ప్రముఖులు ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అయితే ఓ హీరోయిన్ తన ప్రియుడి ముందే ఓ సింగర్‌కి ముద్ధుపెట్టడం కలకలం రేపుతోంది. ఈ వివరాల్లోకి వెళితే..
సదరు నటి ఎవరో కాదు.. తారా సుతారియా. బాలీవుడ్‌లో తన అందం, నటనతో దూసుకెళ్తుంది. ముంబైలో పుట్టిన ఈ ముద్దుగుమ్మ.. తొలుత ధర్మా ప్రొడక్షన్ వంటి ప్రఖ్యాత బ్యానర్‌లో చిత్ర పరిశ్రమకు పరిచచమైంది. అదే 2019లో విడుదలైన స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్. నటనకు ముందే ఆమె సింగర్, డ్యాన్సర్. అలాగే బెల్లి డ్యాన్స్‌లోనూ, మోడ్రన్, లాటిన్ అమెరికన్ స్టైల్ డ్యాన్స్‌లలో తార శిక్షణ తీసుకున్నారు. ప్రఖ్యాత రాయల్ అకాడమీ ఆఫ్ డ్యాన్స్, ఇంపీరియల్ సోసైటీ ఫర్ టీచర్స్ ఆఫ్ డ్యాన్సింగ్‌లో ట్రైనింగ్ తీసుకున్నారు.

అయితే నటిగా మారడానికి ముందే 2010లో డిస్నీ ఇండియా బిగ్ బడా బూమ్‌లో వీడియో జాకీగా నటించారు. ఆ తర్వాత ది స్యూట్ లైఫ్ ఆఫ్ కరణ్ అండ్ కబీర్‌లో వినీత మిశ్రాగా నటించారు. అలాగే ఓయ్ జెస్సీ, ఎంటర్‌టైన్‌మెంట్ కే లియే కుచ్ బీ కరేగాలోనూ తారా మెరిసింది. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్‌లో బాలీవుడ్ యంగ్ హీరో జాకీష్రాఫ్‌తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఇందులో అనన్య పాండే ఫిమేల్ లీడ్ అయినప్పటికీ తారాకి కూడా మంచి మార్కులు పడ్డాయి. అనంతరం మార్జావాన్, తాడప్, హీరోపాంటి 2, ఏక్ విలన్ రిటర్న్స్, అపూర్వ తదితర చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తోన్న టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ మూవీలో తారా కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇందులో కియారా అద్వానీ, రుక్మీణి వసంత్, హ్యూమా ఖురేషీ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సింగర్‌గాను పాలు పాటలు పాడటంతో పాటు ఈవెంట్స్‌లోనూ పాల్గొన్నారు తారా సుతారియా.
హీరోయిన్‌గా మంచి జోరు మీదున్న దశలో ఈ ముద్దుగుమ్మ ప్రేమలో పడింది. నటుడు వీర్ పహారియాతో తారా ప్రేమాయణం నడుపుతున్నట్లు గతంలో బాలీవుడ్ మీడియా కోడై కూసింది. పార్టీలు, సినిమా ఈవెంట్స్‌లో వీరిద్దరూ క్లోజ్‌గా ఉండటం, జంటగా చక్కర్లు కొట్టడంతో వీటికి బలం చేకూరినట్లయ్యింది. అయితే ఈ ఏడాది గణేష్ చతుర్ధిని జంటగా జరుపుకుని దీనికి సంబంధించిన ఫోటోలను విడుదల చేసిన వీర్ - తారాలు తాము ప్రేమలో ఉన్నట్లు బయటపెట్టారు.
ఇదిలాఉండగా.. ప్రపంచ ప్రఖ్యాత ర్యాపర్ ఏపీ ధిల్లాన్ ముంబైలో ఓ కన్సర్ట్ నిర్వహించాడు. స్వతహాగా సింగర్ కావడంతో తారా కూడా ధిల్లాన్‌తో కలిసి వేదికపైకి వచ్చింది. అనంతరం ఇద్దరూ కలిసి థోడీ సి దారు సాంగ్ ఆలపించి ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ఆ వెంటనే ధిల్లాన్ చెంపలపై తారా ముద్దు పెట్టింది. అతను కూడా ఆమెను హగ్ చేసుకోవడంతో కింద ఇదంతా చూస్తున్న వీర్ పహారియా షాక్‌కు గురయ్యాడు. ఏం చేయాలో తెలియక అలా చూస్తూ ఉండిపోయాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నెటిజన్లు తారాను ట్రోల్ చేస్తున్నారు. ప్రియుడు పక్కనే ఉండగా పరాయి మగాడికి ముద్ధు పెట్టడం ఏంటంటూ దారుణంగా కామెంట్స్ పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











