అజయ్ దేవగన్ తండ్రి అంత్యక్రియలు.. కంటతడి పెట్టిన బిగ్‌బీ, ఇతర ప్రముఖులు
బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ తండ్రి, ప్రముఖ స్టంట్ మాస్టర్ వీరు దేవగన్ మృతితో బాలీవుడ్ పరిశ్రమ విషాదంలో కూరుకుపోయింది. వీరు ఇకలేరనే విషయం తెలుసుకొన్న ప్రముఖులు ఆయనతో అనుబంధాన్ని పంచుకొన్నారు. పలువురు తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యారు. అజయ్ దేవగన్, కాజల్ దంపతును వ్యక్తిగతం వచ్చి పరామర్శించారు.
సోమవారం సాయంత్రం ముంబైలోని విల్లే పార్లేలో జరిగిన అంత్యక్రియల్లో అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్, విద్యా బాలన్, అర్జున్ కపూర్, బోని కపూర్, సిద్ధార్థ్ రాయ్ కపూర్, అనిల్ కపూర్, అభిషేక్ బచ్చన్, సల్మాన్ తండ్రి సలీం ఖాన్, జిమ్మీ షెగ్రిల్, తుషార్ కపూర్, సునీల్ శెట్టి, దారా సింగ్, శేఖర్ కపూర్, మధుర్ బండార్కర్, రితేష్ దేశ్‌ముఖ్ తదితరులు హాజరయ్యారు.

వీరు దేవగన్ నివాసానికి వెళ్లి ఆయనకు శ్రద్దాంజలి ఘటించిన వారిలో ఐశ్వర్యరాయ్ తదితరుల ఉన్నారు. కాజోల్‌ను పరామర్శించి ఓదార్చారు.

బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ తండ్రి, ప్రముఖ స్టంట్స్ మాస్టర్ వీరు దేవగన్ ఇక లేరు. వృద్దాప్య సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వీరు దేవగన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. వీరు దేవగన్ మృతివార్త సినీ వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. వీరు మరణంపై బాలీవుడ్ ప్రముఖులు తమ సంతాపాన్ని సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తున్నారు. సినీ పరిశ్రమకు చేసిన సేవలను ఈ సందర్బంగా గుర్తు చేసుకొంటున్నారు.


Click it and Unblock the Notifications











