Don't Miss!
- News సీఎం జగన్పై రాళ్లదాడి కేసులో బొండ ఉమ అరెస్ట్..?
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
క్షీణించిన దిలీప్ కుమార్ ఆరోగ్య పరిస్థితి
వెటరన్ యాక్టర్ దిలీప్ కుమార్ ఆరోగ్య పరిస్థితి మరోసారి విషమించింది. ఆయన చాలా నీరశంగా ఉన్నారని, సరిగ్గా నడవలేకపోతున్నారని ఆయన సతీమణి సైరా భాను వెల్లడించారు. తన గది నుంచి హాల్ వరకూ మాత్రమే నడవగలుగుతున్నారని, దీలీప్ రోగనిరోధక శక్తి క్రమంగా తగ్గుతోందని తెలిపిన భాను, ఆయన ఆరోగ్యం కుదుటపడాలని అభిమానులు ప్రార్ధించాల్సిందిగా కోరారు.
భారత వెండితెర ఆణిముత్యాల్లో ఒకరిగా పేరుగాంచిన దిలీప్ కుమార్ ప్రపంచవ్యాప్తంగా ఎందరో అభిమానులను సంపాదించుకున్నారు. 1966లో నటీమణి సైరా భానును వివాహమాడిన దిలీప్ కుమార్ ఈ ఏడాది 54 వివాహ వార్షికోత్సవం జరుపుకున్నారు. ఇక ఇటీవలే ఓ వార్తా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దిలీప్ ఆరోగ్య పరిస్థితిని వివరించిన సైరా భాను పలు కీలక విషయాలను వెల్లడించారు.
ఆయన లేచి నడుస్తున్న ప్రతీ రోజూ దేవుడి రుణపడి ఉంటున్నామని తెలిపిన సైరా... ఆయన కోలుకోవాలని అభిమానులు కూడా ప్రార్థించాలని విన్నవించుకున్నారు. జీవిత చరమాంకంలో ఆయనకు తోడుగా ఉంటోంది కేవలం ప్రేమతో మాత్రమే తప్ప, ఆయన నుంచి ఇంకేమీ ఆశించడంలేదని భాను స్పష్టం చేశారు.
ఆయన సంరక్షణలోనే తనకు అమితమైన ఆనందం దొరుకుతోందని తెలిపిన సైరాభాను, మంచి భార్యగా పేరు సంపాదించుకోవాలన్న అభిలాష లేదని తేల్చిచెప్పారు. జీవితంలో తనకు అత్యంత అపురూపమైనది దిలీప్ మాత్రమేనని వెల్లడించారు. ఆయనే తన శ్వాస అని ఎమోషనల్ అయ్యారు.
ఇటీవలే దిలీప్ కుమార్ సోదరులు అషాన్, అస్లమ్ కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. దిలీప్, సైరాభాను సైతం మార్చ్ నుంచి ఇంటికే పరిమితమయ్యారు. దిలీప్ ఆరోగ్య రిత్యా దంపతులు ఇద్దరూ ఐసోలేషన్ లోనే కాలం వెల్లడిస్తున్నారు. ఏమైనా దిలీప్ త్వరగా కోలుకోవాలని అందరూ ఆశిస్తున్నారు.