సీనియర్ నటికి గుండెపోటు.. ఊపిరి కూడా ఆడకపోవడంతో హాస్పిటల్ కి.. ఇప్పుడెలా ఉందంటే?

దివంగత నటుడు దిలీప్ కుమార్ భార్య సైరా భాను ఆరోగ్య సమస్యల కారణంగా ముంబైలోని హిందూజా ఆసుపత్రిలో చేరారు. అయితే ఆమెను మూడు రోజుల క్రితమే హాస్పిటల్ కి తరలించినా సరే ఈ రోజు ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఐసీయూకి తరలించారని అంటున్నారు. సైరా భానుకి మూడు రోజుల క్రితం రక్తపోటు సమస్య వచ్చిందని, ఆ తర్వాత ఆమె ఆసుపత్రిలో చేరిందని కొన్ని వార్తలు వస్తుంటే ఆమెకు గుండె పోటు వచ్చిందని కూడా వార్తలు వస్తున్నాయి. అసలు ఏమైందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది

శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది

సైరా భాను ఆరోగ్యం క్షీణించడంతో హిందూజా ఆసుపత్రిలో చేర్చారు. రక్తపోటు ఎక్కువ కావడంతో సైరాను వెంటనే ఆసుపత్రికి తీసుకు వచ్చినట్లు సమాచారం. ఆమెకు మూడు రోజుల క్రితం రక్తపోటు ఎక్కువ కావడంతో ఆస్పత్రిలో చేర్చారని అంటున్నారు. టైమ్స్ నౌ నివేదిక ప్రకారం, మూడు రోజులు అయినా సైరా ఆరోగ్యం మెరుగు పడకపోవడంతో ఐసీయూలో చేర్చారు.

ఇక ఆ నివేదికల ప్రకారం, ఆమె శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బంది పడుతున్నారు. ఆమె ఆక్సిజన్ స్థాయి నిరంతరం తగ్గుతూ వచ్చిందని అంటున్నారు. అయితే ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన పని లేదని డాక్టర్లు చెప్పినట్లు తెలుస్తోంది. దిలీప్ కుమార్ 7 జూలై 2021 న కన్నుమూశారనే సంగతి తెలిసిందే, ఎంతో ప్రేమించే భర్త దూరం కావడంతో ఆమె విషాదంలో మునిగిపోయారు.

గుండెపోటు కారణంగా?

గుండెపోటు కారణంగా?

అయితే నటి సైరాభాను మూడు రోజుల క్రితం స్వల్ప గుండెపోటు కారణంగానే హిందూజా ఆసుపత్రికి తరలించబడ్డారని తాజాగా వార్తలు వెలువడుతున్నాయి. ఆసుపత్రికి తరలించినప్పుడు కూడా ఆమె పక్కనే కుటుంబ సభ్యులు ఉన్నారని, ఆమె ఆసుపత్రిలో చేరి మూడు రోజులు అయ్యింది మరియు ఇప్పుడు బాగానే ఉందని అంటున్నారు.

గుండె మీద ఒత్తిడి

గుండె మీద ఒత్తిడి

తాజా నివేదిక ప్రకారం, సీనియర్ నటిని ఈ రోజు ఐసియు వార్డుకు తరలించారు. అయితే ఈ ఫ్యామిలీకి దగ్గరి బంధువు అన్ని విషయాలు వెల్లడిస్తూ, "ఆమెకు శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంది, కాబట్టి ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక పరిశోధనల తర్వాత, ఆమె గుండెపై ఒత్తిడి ఉన్నట్లు గుర్తించారు. ఆమె మూడు రోజుల క్రితం హాస్పిటల్ లో చేరింది ఇప్పుడు చాలా బాగుందని పేర్కొన్నారు. అయితే ఆమెకు గుండె పోటు అనేది కాకపోవచ్చని అంటున్నారు.

ధర్మేంద్ర ఏమన్నారంటే?

ధర్మేంద్ర ఏమన్నారంటే?

ఇక దిలీప్ కుమార్ మరియు అతని కుటుంబానికి ఫామిలీ ఫ్రెండ్ అయిన ధర్మేంద్ర, సైరా భాను ఆరోగ్యం గురించి చాలా ఆందోళన చెందుతున్నారు , గత కొన్ని రోజుల నుండి ఆమె హెల్త్ దిగజారి, హిందూజా ఆస్పత్రి ఐసీయూలో చేర్చడానికి దారితీసిందని పేర్కొన్నారు. ధర్మేంద్రను సంప్రదించినప్పుడు, సైరా బాను మరియు తాను నాలుగు రోజుల క్రితం ఫోన్‌లో మాట్లాడుకున్నామని, సైరా బానుకు తాను కాల్ చేస్తే ఆమె ఎత్తలేదని తరువాత ఆమె తిరిగి ఫోన్ చేసి, ఆరోగ్యం బాగోలేదని ఆమె నాకు చెప్పిందని పేర్కొన్నారు.

Recommended Video

Chiru బృందంలో Mahesh Babu, Allu Arjun | Ys Jagan ఒకే అంటేనే || Filmibeat Telugu
ఔటాఫ్ డేంజర్

ఔటాఫ్ డేంజర్

ధర్మేంద్ర అప్పుడు ఆమెను వివరాలు అడగలేదని, కానీ దిలీప్ కుమార్ మరణం తర్వాత సైరా బానుకు ఇది చాలా కష్టమైన సమయం అని తాను గ్రహించానని చెప్పాడు. "నేను చాలా ప్రశ్నలు అడగలేదు కానీ దిలీప్ కుమార్ మరణించిన తర్వాత ఆమె ఎలా బాధపడుతుందో మీరు అర్థం చేసుకోగలరని. ఆమె ఒక శూన్యతను అనుభవిస్తోందని పేర్కొన్నారు. ఇక సైరా భాను ప్రమాదం నుంచి బయటపడిందని, ఆమె ఆరోగ్యం స్థిరంగా ఉందని హిందూజా ఆసుపత్రిలో సీనియర్ డాక్టర్ ఒకరు వెల్లడించారు. ఆమె గురించి ఆందోళన చెందాల్సిన పనిలేదని. ఆమె ఇప్పుడు చాలా బాగుంది మరియు త్వరలో డిశ్చార్జ్ అవుతుందని వెల్లడించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X