twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాలీవుడ్ నటి కన్నుమూత, అమితాబ్ తీవ్ర దిగ్భ్రాంతి.. శ్రీదేవి మరణం నుంచి..

    By Rajababu
    |

    శ్రీదేవి మరణ విషాదం నుంచి ఇంకా తేరుకోకముందే మరో సినీయర్ నటి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. బాలీవుడ్‌లో తనదైన పాత్రలతో ప్రేక్షకులను మెప్పించిన షమ్మీ అంటీ మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఆమె వయసు 87 సంవత్సరాలు. షమ్మీ మృతి నేపథ్యంలో అమితాబ్‌తో సహా పలువురు బాలీవుడ్ సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.

     18 ఏటనే సినీ పరిశ్రమలోకి

    18 ఏటనే సినీ పరిశ్రమలోకి

    షమ్మీ అంటీ అసలు పేరు నర్గీస్ రబాది. తన మూడేళ్ల వయసులోనే తండ్రి మరణించాడు. తన 18వ ఏట ఉస్తాద్ పెద్రో అని చిత్రం ద్వారా బాలీవుడ్‌లోకి ప్రవేశించారు. దాదాపు 64 ఏళ్లపాటు చిత్ర పరిశ్రమకు సేవలందించారు.

     ముఖేష్ చిత్రంలో సోలో హీరోయిన్‌గా

    ముఖేష్ చిత్రంలో సోలో హీరోయిన్‌గా

    ప్రముఖ గాయకుడు ముఖేష్ నిర్మాతగా రూపొందించిన మల్హర్ చిత్రంలో తొలిసారి సోలో హీరోయిన్‌గా కనిపించారు. దురదృష్టవశాత్తూ ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో అవకాశాలు ఆశించినంతగా రాలేదు. ఆ తర్వాత సినీ దిగ్గజం దిలీప్ కుమార్‌తో నటించిన సంగ్‌దిల్ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఆమె వెనకకు తిరిగి చూసుకోలేదు.

     సినీ నిర్మాత, దర్శకుడితో వివాహం

    సినీ నిర్మాత, దర్శకుడితో వివాహం

    ప్రముఖ నిర్మాత, దర్శకుడు సుల్తాన్ ఆహ్మద్‌ను వివాహం చేసుకొన్నారు. ఏడు సంవత్సరాల దాంపత్య జీవితం తర్వాత వ్యక్తిగత విభేదాల కారణంగా విడాకులు తీసుకొన్నారు.

     నటించిన చిత్రాలు ఇవే

    నటించిన చిత్రాలు ఇవే

    కూలీ నంబర్ 1, ఖుదాగవా, హమ్, అర్థ్, ది బర్నింగ్ ట్రైన్, షిరిన్ పర్హాద్ కి తో నికల్ పడి అనే చిత్రాల్లో షమ్మీ అంటీ నటించారు. దేఖ్ బాయ్ దేఖ్, జబాన్ కే, శ్రీమన్ శ్రీమతి, ఖభీ యే కభీ వో, ఫిల్మీ చక్కర్ టెలివిజన్ సీరియల్స్‌లో కూడా నటించారు.

    అమితాబ్ తీవ్ర దిగ్భ్రాంతి

    అమితాబ్ తీవ్ర దిగ్భ్రాంతి

    షమ్మీ అంటీ మృతిపై అమితాబ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. షమ్మీ అంటీ అద్భుతమైన నటి. ఏన్నో ఏళ్లుగా పరిశ్రమకు అంకితమై సేవలందించారు. నాకు అత్యంత ఆప్తురాలు. తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. వృద్ధాప్య సంబంధిత వ్యాధులతో చాలా కాలంగా బాధపడుతున్నారు. ఆమె లేరనే వార్త నాలో విషాదాన్ని నింపింది అని అమితాబ్ ట్వీట్ చేశారు.

    English summary
    Veteran actress and Bollywood's beloved 'Shammi aunty' passed away this morning. She was 87 years old. Born as Nargis Rabadi. She had spent 64 years in the industry and had made her acting debut with Ustad Pedro at the age of 18. Her first film as a solo heroine was Malhar, produced by playback singer Mukesh. Unfortunately, the movie tanked at the box office. Later she got a role in Dilip Kumar starrer Sangdil and after that, there was no looking back for the actress. She starred in Coolie No 1, Khuda Gawah, Hum, Arth, The Burning Train and the recent Shirin Farhad Ki Toh Nikal Padi, as well as TV shows like Dekh Bhai Dekh, Zabaan Sambhal Ke, Shriman Shrimati, Kabhi Yeh Kabhi Woh and Filmi Chakkar. Shammi was married to film producer-director Sultan Ahmed for seven years before they got divorced.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X