దిలీప్ కుమార్ తీవ్ర అస్వస్థత.. హాస్పిటల్ చేరిక
బాలీవుడ్ నట దిగ్గజం, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత దిలీప్ కుమార్ మరోసారి అనారోగ్యంతో హాస్పిటల్‌లో చేరారు. న్యూమోనియా వ్యాధితో బాధపడుతున్న ఆయనను ఆదివారం రాత్రి 7 గంటల ప్రాంతంలో ముంబైలోని ఓ హాస్పిటల్‌లో చేర్పించామని ఆయన స్నేహితుడు ఫైసల్ ఫరూఖీ ట్వీట్ చేశారు.
దిలీప్ కుమార్‌ను గతరాత్రి హాస్పిటల్‌లో చేర్పించాం. రికరెంట్ న్యూమోనియాతో బాధపడుతున్న ఆయనకు వైద్యులు చికిత్సను అందిస్తున్నారు. ఆయన ఆరోగ్యం గురించి భగవంతుడిని ప్రార్థిస్తున్నాం. ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్యం గురించి సమాచారం వెల్లడిస్తాం అని ఫారుఖీ పేర్కొన్నారు.

దిలీప్ కుమార్‌కు 70 ఏళ్లకుపైగా సినీ పరిశ్రమతో అనుబంధం ఉంది. ఏడు దశాబ్దాల కాలంలో ఆయనతో ఎవరైనా ఫొటో దిగితే దానితో ట్విట్ చేయండి. ఆ ఫొటోనే మేము రీట్వీట్ చేస్తాం అని ఫారుఖీ ట్విట్టర్‌లో తెలిపారు.
గత కొన్నేళ్లుగా దిలీప్ కుమార్ తరచూ అస్వస్థతకు గురవుతూ హాస్పిటల్ చేరూతూ ఉన్నారు. ఆయన ఆరోగ్యంపై రూమర్లు అనేక వెలువడుతున్నాయి. అలాంటి రూమర్ల గురించి పట్టించకోవద్దని సన్నిహితులు సూచిస్తున్నారురు.


Click it and Unblock the Notifications











