Shyam Benegal: సినీ ఇండస్ట్రీలో విషాదం.. లెజండరీ డైరెక్టర్ కన్నుమూత.

Shyam Benegal Death News: సినీ ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ డైరెక్టర్ శ్యామ్ బెనగల్ కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచారు. ముంబయిలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. సమాచారం ప్రకారం.. ముంబైలోని వోకార్డ్ ఆసుపత్రిలో శ్యామ్ బెనెగల్ సాయంత్రం 6.30 గంటలకు తుది శ్వాస విడిచారు. మంగళవారం ఆయన భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

శ్యామ్ బెనగల్ సినీ ప్రస్థానం.. శ్యామ్ సుందర్ బెనెగల్ 1934 డిసెంబర్ 14న ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. సినిమాల ప్రపంచంలోకి రాకముందు ఎకనామిక్స్ చదివిన తర్వాత ఫోటోగ్రఫీకి శ్రీకారం చుట్టారు. బాలీవుడ్ ప్రపంచంలో ఆయన దర్శకత్వ ప్రతిభకుగానూ దాదాసాహెబ్ ఫాల్కే పద్మశ్రీ, పద్మభూషణ్ లాంటి సినీ అత్యున్నత అవార్డులు అందుకున్నారు. ఆయన 50 సంవత్సరాలుగా సుదీర్ఘ ప్రయాణం చేసాడు.

Veteran director and screenwriter Shyam Benegal Passed Away at age of 90

శ్యామ్ బెనగల్ సినిమాల్లో అంకుర్ (1974) అనే చిత్రం ద్వారా దర్శకుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. నిశాంత్ (1975), మంథన్ (1976), భూమిక, జునూన్ (1978), మండి (1983), త్రికాల్ (1985), అంతర్నాద్ (1991) లాంటి సూపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించారు.

ప్రముఖ డైరెక్టర్ శ్యామ్ బెనగల్ అవార్డులు .. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్-2005, పద్మశ్రీ -1976, పద్మ భూషణ్-1991, ఇందిరాగాంధీ జాతీయ సమైక్యత పురస్కారం- 2003, ఏఎన్నార్ జాతీయ ‍అవార్డ్-2013, నిశాంత్ చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా జాతీయ చలనచిత్ర అవార్డు -1976, మంథన్ సినిమాకు ఉత్తమ జాతీయ చలనచిత్ర అవార్డు- 1977, జునూన్ చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు- 1980 అందుకున్నారు.

More from Filmibeat

Read more about: shyam benegal tollywood
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X