twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాలీవుడ్‌లో మరో విషాదం.. ప్రముఖ నిర్మాత కన్నుమూత

    |

    బాలీవుడ్ సినీ పరిశ్రమ మరో ప్రముఖుడిని కోల్పోయింది. 80 దశకంలో అగ్రహీరోలతో సినిమాలను నిర్మించిన నిర్మాత హరీష్ షా కన్నుమూశారు. గత కొద్దికాలంగా గొంతు క్యాన్సర్‌తో బాధపడుతున్న హరీష్ షా మంగళవారం అంటే జూలై 7వ తేదీన ఉదయం ముంబైలో తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 76 సంవత్సరాలు. హరీష్ షా మరణంతో సినీ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. ఆయన మృతికి పలువురు బాలీవుడ్ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.

    హరీష్ షా పలు సినిమాలను నిర్మించడమే కాకుండా దర్శకత్వం కూడా చేపట్టారు. రాజేశ్ ఖన్నా నటించిన మేరే జీవన్ సాథీ, రామ్ తేరే కిత్నే నామ్ అనే చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. అలాగే ధర్మేంద్ర, శతృఘ్న సిన్హా నటించిన జల్‌జలా, రిషీ కపూర్, నీతూ సింగగ్ నటించిన ధన్ దౌలత్ అనే చిత్రాలను నిర్మించి దర్శకత్వం వహించారు. 2003లో రిలీజైన జల్ ది ట్రాప్ అనే సినిమా ఆయన నిర్మించిన చివరి చిత్రం. ఈ చిత్రంలో సన్నీడియోల్, టుబూ, రీమా సేన్, అనుపమ్ ఖేర్ నటించారు.

     Veteran Producer and Director Harish Shah died at 76

    హరీష్ షా మృతిపై కుటుంబ సభ్యులు స్పందించారు. గత పదేళ్లుగా గొంతు సంబంధింత క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. క్యాన్సర్‌కు కొన్నేండ్లుగా ఆయనకు చికిత్స జరుగుతున్నది. దాంతోపాటు ఆయనకు వృద్దాప్య సంబంధిత సమస్యలు కూడా ఇటీవల తలెత్తాయి. దాంతో ఆయన జూలై 7వ తేదీ ఉదయం 6 గంటలకు మరణించారు అని హరీష్ షా సోదరుడు వినోద్ షా మీడియాకు తెలిపారు. కొద్ది మంది కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో మంగళవారం మధ్యాహ్నం ఆయన అంత్యక్రియలను పవన్ హాన్స్ శ్మశాన వాటికలో జరిగాయి.

    English summary
    Veteran Producer and Director Harish Shah died at 76 in mumbai. He produced and directed few movies with Rajesh Khanna, Dharmendra, Shatrughan Sinha, Rishi Kapoor, and Sunny Deol.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X