twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సల్మాన్ బావకు చిక్కులు.. ఆ సినిమాపై రగిలిపోతున్న హిందువులు, లవ్ రాత్రిలో ఏముందటే!

    |

    సల్మాన్ ఖాన్ బాగా ఆయుష్ శర్మ హీరోగా పరిచయం కాబోతున్నాడు. సల్మాన్ సోదరి అర్పిత ఖాన్ భర్త ఇతడు. ఆయుష్ నటిస్తున్న తొలి చిత్రం లవ్ రాత్రి. అక్టోబర్ లో కానుంది. పద్మావత్ చిత్రం తరహాలో ఈ చిత్రం కూడా విడుదలకు ముందే హిందువుల ఆగ్రహానికి గురి అవుతోంది. దేశంలో ఎక్కడా ఈ చిత్రాన్ని విడుదల కానీయం అంటూ విశ్వ హిందూ పరిషత్ హెచ్చరిక జారీ చేసింది. దీనితో సల్మాన్ బావ ఆయుష్ తొలి చిత్రానికి చిక్కులు మొదలయ్యాయి.

     ఇద్దరికీ తొలి చిత్రమే

    ఇద్దరికీ తొలి చిత్రమే

    ఆయుష్ శర్మ, హీరోయిన్ గా నటిస్తున్న వారైనా హుస్సేన్ ఇద్దరికి ఇది తొలి చిత్రమే కావడం విశేషం. సుల్తాన్ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన అభిరాజ్ ఈ చిత్రంతో దర్శకుడిగా మారుతున్నాడు.

    వివాదం ఎక్కడ మొదలైందంటే

    వివాదం ఎక్కడ మొదలైందంటే

    హిందువులు పవిత్రంగా భావించే నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుంది. నవరాత్రి ఉత్సవాలలో కలుసుకున్న జంట మధ్య సాగే ప్రేమ కథే ఈ చిత్రం. అందుకు తగ్గట్లుగానే నవరాత్రి నేపథ్యంలో కాబట్టి లవ్ రాత్రి అనే టైటిల్ పెట్టారు. ఇక్కడే వివాదం మొదలైంది.

    దేశంలో ఎక్కడా

    దేశంలో ఎక్కడా

    దీనిపై విశ్వ హిందూ పరిషత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. హిందువుల పవిత్ర పర్వదినాల నేపథ్యంలో తీస్తూ ఆ పేరుకు ఉన్న అర్థాన్ని నాశనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో ఎక్కడా ఈ చిత్రాన్ని విడుదల కనీయం అంటూ అల్టిమేటం జారీ చేశారు.

    సెగ చల్లారాక ముందే

    సెగ చల్లారాక ముందే

    లవ్ రాత్రి చిత్రం రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతోంది. పద్మావత్ చిత్రం ఏవిధంగా వివాదం అయిందో అందరికి తెలిసిందే. ఆ సెగలు చల్లారాక ముందే మరో బాలీవుడ్ చిత్రం హిందువుల ఆగ్రహానికి గురి అవుతోంది.

    English summary
    VHP says won’t allow screening of Aayush Sharma’s Loveratri. This movie distorting’ Navratri’s name
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X