సల్మాన్‌కు షాక్.. ఆ సినిమాను అడ్డుకొంటామని వీహెచ్‌పీ హెచ్చరిక
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తన సొంత బ్యానర్‌పై రూపొందిస్తున్న లవ్‌రాత్రి చిత్రంపై విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) కన్నెర్ర జేసింది. ఈ చిత్రంలో సల్మాన్ సొంత బావ ఆయుష్ శర్మ హీరోగా బాలీవుడ్‌కు పరిచయమవుతున్నారు. ఈ సినిమా టైటిల్ హిందువుల మనోభావాలను కించపరిచే విధంగా ఉందనే కారణంతో లవ్ రాత్రి చిత్ర ప్రదర్శనను అడ్డుకొంటామని వీహెచ్‌పీ నేతలు హెచ్చరిస్తున్నారు.

లవ్‌రాత్రిపై వీహెచ్‌పీ ఫైర్
సల్మాన్ ఖాన్ రూపొందిస్తున్న లవ్ రాత్రి టైటిల్ హిందువుల పవిత్ర పండుగ నవరాత్రి మాదిరిగా వినిపిస్తున్నది. అందుకే ఆ చిత్ర టైటిల్‌ను మార్చాలని సూచించాం. ఒకవేళ మార్చకపోతే దేశవ్యాప్తంగా ఆ సినిమాను అడ్డుకొంటాం అని వీహెచ్‌పీ ఇంటర్నేషనల్ వర్కింగ్ ప్రసిడెంట్ అలోక్ కుమార్ హెచ్చరించారు.

నవరాత్రి బ్యాక్‌డ్రాప్‌గా
లవ్‌రాత్రి చిత్రం నవరాత్రి బ్యాక్‌డ్రాప్‌గా రూపొందుతున్నది. హిందువుల మత విశ్వాసాలతో నవరాత్రి పండుగ ముడిపడింది. గుజరాత్‌లో ఈ పండుగకు చాలా ప్రాముఖ్యత ఉంది. అలాంటి పండుగ నేపథ్యంగా ప్రేమకథా చిత్రంగా రూపొందడం చాలా దారుణం అని కుమార్ అన్నారు.

సల్మాన్ ఖాన్ సొంత బ్యానర్‌పై
సల్మాన్ ఖాన్ ఫిలింస్ రూపొందిస్తున్న లవ్ రాత్రి చిత్రానికి అభిరాజ్ మినావాలా తొలిసారి దర్శకత్వం వహిస్తున్నారు. సల్మాన్ ఖాన్ నటించిన సుల్తాన్ చిత్రానికి, షారుక్ ఖాన్ నటించిన ఫ్యాన్ సినిమాకు అభిరాజ్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు.

అక్టోబర్ 5న రిలీజ్
ఇక సల్మాన్ సోదరి అర్పితాఖాన్ భర్త ఆయుష్ అనే సంగతి తెలిసిందే. తన సొంత బ్యానర్‌పై సల్మాన్ రూపొందిస్తున్న ఈ చిత్రంలో వారినా హీరోయిన్‌గా పరిచయం అవుతున్నది. ఈ చిత్రం అక్టోబర్ 5న రిలీజ్‌కు సిద్దమవుతున్నది.


Click it and Unblock the Notifications











