కత్రినా కైఫ్, విశాల్ కౌశల్ పెళ్లికి సర్వం సిద్దం.. అతిథుల లిస్ట్ రెడీ.. ఎవరెవరికి ఆహ్వానాలంటే

కత్రినా కైఫ్ విక్కీ కౌశల్ వివాహ సన్నాహాలు ఊపందుకుంటున్నాయి. కత్రినా - విక్కీ డిసెంబర్ 7 లేదా 8 న రాజస్థాన్‌లోని ఒక కోటలో వివాహం చేసుకోబోతున్నారని తెలుస్తోంది. ఈ పెళ్లి చర్చలపై విక్కీ, కత్రినా బహిరంగంగా ఏమీ చెప్పనప్పటికీ సన్నాహాలు మాత్రం జోరుగా సాగుతున్నాయి. సన్నాహకాల కోసం కత్రినా, విక్కీల బృందం రాజస్థాన్ చేరుకున్నట్లు సమాచారం. ఇక ఆ వివరాల్లోకి వెళితే

డేట్స్ ఫ్రీ

డేట్స్ ఫ్రీ

కత్రినా కైఫ్ - విక్కీ కౌశల్ ఎవరికైనా వివాహ ఆహ్వానాన్ని పంపారా అనేది ఇంకా తెలియదు, కానీ 'ఇండియా టుడే'లో వచ్చిన ఒక నివేదిక ప్రకారం, ఈ జంట మ్యారేజ్ గెస్ట్ లిస్ట్ నుండి కొంతమంది పేర్లు బయటకు వచ్చాయి. రిపోర్ట్ ప్రకారం, కత్రినా పెళ్లి లీక్‌తో కలత చెందిందని, బహుశా అందుకే ఎవరికీ ఇంకా ఆహ్వానం పంపలేదని అంటున్నారు. అయితే, ఈ ఇద్దరు తారలు తమ స్నేహితులు మరియు సన్నిహితులను డిసెంబర్ 7-9 వరకు పూర్తిగా డేట్స్ ఫ్రీ చేసుకోవాలని కోరారు.

వాళ్లనే పిలిచారు

వాళ్లనే పిలిచారు

కత్రినా - విక్కీ సన్నిహితుడు 'ఇండియా టుడే'తో మాట్లాడుతూ, ఈ జంట తమ వివాహానికి సినీ పరిశ్రమలోని స్నేహితులను మరియు తమ సలహాదారులను ఆహ్వానించాలని యోచిస్తున్నట్లు చెప్పారు. ఈ జాబితాలో కరణ్ జోహార్, అలీ అబ్బాస్ జాఫర్, రోహిత్ శెట్టి, మినీ మాథుర్ మరియు కబీర్ ఖాన్, వరుణ్ ధావన్ మరియు నటాషా దలాల్ మరియు సిద్ధార్థ్ మల్హోత్రా-కియారా అద్వానీ ఉన్నారని అంటున్నారు.

సల్మాన్ ఖాన్ కూడా

సల్మాన్ ఖాన్ కూడా

ఇక కత్రినా-విక్కీల వివాహానికి సల్మాన్ ఖాన్ కూడా హాజరవుతారని కొన్ని రోజుల క్రితం వార్తలు వచ్చాయి. ఈ కారణంగా, ఆయన తన 'ఏక్ థా టైగర్' సినిమా షూటింగ్‌ను కూడా జనవరి 2022 వరకు వాయిదా వేసుకున్నాడు కానీ అధికారికంగా ఇంకా ఏదీ ధృవీకరించబడలేదు. ఒకానొక సమయంలో, సల్మాన్ మరియు కత్రినా రిలేషన్ షిప్ లో ఉన్నారు. అయితే తర్వాత బ్రేకప్ అయింది. అయితే బ్రేకప్ తర్వాత కూడా ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది. సల్మాన్ మరియు కత్రినా ఒకరినొకరు కుటుంబంలో భాగంగా భావిస్తారు.

అక్కడ రోకా వేడుకలు

అక్కడ రోకా వేడుకలు

ఇక నివేదికల ప్రకారం, కత్రినా - విక్కీ రోకా వేడుక ముంబైలోని కబీర్ ఖాన్ ఇంట్లో జరిగింది. కత్రినా కబీర్ ఖాన్‌ను తన రాఖీ సోదరుడిగా భావిస్తుంది. అందుకే ఆయనతో చాలా సన్నిహితంగా ఉంటుంది. అందుకే రోకా వేడుకను ఆయన ఇంట్లోనే జరిపారు. దీపావళి రోజున దర్శకుడు కబీర్ ఖాన్ ఇంట్లో విక్కీ, కత్రినాల రోకా వేడుక జరిగినట్లు ఇటీవల వార్తలు కూడా వచ్చాయి.

Recommended Video

Athadu Ame Priyudu Movie Launch| Nagababu | Yandamuri Veerendranath | Kaushal | Filmibeat Telugu
కత్రినా పట్టుపట్టి

కత్రినా పట్టుపట్టి

నిజానికి విక్కీ కౌశల్ ఈ వివాహం వచ్చే ఏడాది జరిగితే బాగుండు అనుకున్నాడు కానీ కత్రినా ఒత్తిడి కారణంగా, ఈ వివాహం డిసెంబర్‌లో జరుగుతుంది. విక్కీ మే 2022లో పెళ్లి చేసుకోవాలనుకున్న కత్రినా మాత్రం డిసెంబర్‌లో పెళ్లి చేసుకోవడం కరెక్ట్‌గా భావించింది. కత్రినా తన పెళ్లికి సంబంధించిన ప్రతి విషయాన్ని జాగ్రత్తగా ప్లాన్ చేసిందని సన్నిహిత వర్గాలు తెలిపాయి.

తన వేదిక నుంచి డ్రెస్ వరకు అన్నీ సిద్ధం చేసుకున్నారని అంటున్నారు. రాజస్థాన్‌లో, మే నెలలో, తీవ్రమైన వేడి ఉంటుంది, బయట పెళ్లి చేయలేదు అందుకే డిసెంబర్‌లోనే పెళ్లి చేసుకోవాలని కత్రినా నిర్ణయించుకుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X