కత్రినా కైఫ్‌తో డేటింగ్, అఫైర్.. రెడ్ హ్యాండెడ్‌గా దొరకడంపై ప్రియుడు క్లారిటీ
బాలీవుడ్‌లో సినీ తారల మధ్య అఫైర్లు, డేటింగ్స్ చాలా సర్వసాధారణమనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇటీవల కాలంలో మీడియా హెడ్‌లైన్లను ఆకర్షించే జంటగా కత్రికా కైఫ్, వికీ కౌశల్ టాప్ రేసులో ఉన్నారు. అయితే వీరిద్దరూ ఎవరు కూడా తమ అఫైర్ గురించి వెల్లడించడానికి నిరాకరిస్తున్నారు. అయితే కత్రినాకైఫ్‌తో బంధాన్ని వికీ కౌశల్ తాజాగా స్పందించారు. కత్రినా, వికీ కౌశల్ అఫైర్ గురించి వివరాల్లోకి వెళితే..

డ్రగ్స్ వివాదంలో కేంద్ర బిందువుగా
బాలీవుడ్‌లో దేశభక్తి, ఆర్మీ ప్రధానంగా తెరకెక్కుతున్న చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పిస్తున్న వికీ కౌశల్ ఇటీవల పలు విషయాలకు కేంద్ర బిందువుగా మారుతున్నారు. కరణ్ జోహర్ నివాసంలో జరిగిన పార్టీలో డ్రగ్స్ వినియోగించారనే విషయం ఇటీవల కాలంలో వైరల్ అయింది. ఆ పార్టీకి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది.

కత్రినాతో రొమాంటిక్ లైఫ్
డ్రగ్స్ వివాదాన్ని పక్కన పడితే ఇటీవల కాలంలో కత్రినా కైఫ్‌తో రొమాంటిక్ మూమెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి. వారిద్దరూ కలిసి అతిసన్నిహితంగా మీడియా కంటపడుతూ మీడియాకు పలు సందర్భాల్లో చిక్కడం తెలిసిందే. పలుమార్లు వికీ కౌశల్ ఇంటిలోకి వెళ్తూ కత్రినా కైఫ్ మీడియా కంటికి చిక్కిన ఫోటోలు మీడియాలో వైరల్ అయ్యాయి.

పబ్లిక్ లైఫ్‌లోకి సెలబ్రిటీగా
అయితే తాజాగా కత్రినా కైఫ్‌తో డేటింగ్, తన వ్యక్తిగత జీవితం గురించి వికీ కౌశల్ ఘాటుగానే స్పందించారు. ఏ సెలబ్రిటీకైనా ప్రతిష్ట పెరిగిన తర్వాత వారి జీవితం పబ్లిక్ డోమైన్‌లోకి రావడం అత్యంత సహజం. అయితే బహిరంగంగా తన వ్యక్తిగత జీవితం, గురించి తాను ప్రేమించే వ్యక్తి గురించి చర్చ చేయడం సరికాదు అనేది నా అభిప్రాయం అంటూ వికీ కౌశల్ పేర్కొన్నారు.

ఇష్టం వచ్చినట్టు రాస్తే సరికాదు
కొన్నిసార్లు ఎలాంటి ఆధారాలు లేకుండానే మీడియాలో నా అఫైర్లు గురించి, కత్రినాతో రిలేషన్ గురించి కథనాలు పుంఖాలు పుంఖాలుగా వస్తుంటాయి. నిజాలు తెలుసుకోకుండానే వారు తమకు తోచినట్టు రాస్తుంటారు. ఒక కథనానికి, మరో కథనానికి పొంతన ఉండదు. అందుకే మేము ఎప్పటికప్పుడు నా ప్రైవసీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాం అని వికీ కౌశల్ పేర్కొన్నారు.

వికీ కౌశల్ కెరీర్ విషయానికి వస్తే
వికీ కౌశల్ కెరీర్ విషయానికి వస్తే.. ఆయన నటించిన రాజీ, లస్ట్ స్టోరీస్, సంజూ, యూరీ: ది సర్జికల్ స్ట్రైక్స్ లాంటి చిత్రాలు అత్యంత ప్రేక్షకాదరణ పొందాయి. ప్రస్తుతం సర్దార్ ఉద్దమ్ సింగ్, ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ చిత్రాల్లో నటిస్తున్నారు. ఆ చిత్రాలు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.


Click it and Unblock the Notifications











