స్టార్ హీరో కూతుర్ని బైకెక్కించుకుని చిక్కుల్లో పడ్డ కత్రినా భర్త.. ఎరక్క పోయి ఇరుక్కున్నాడుగా!

కొత్త పెళ్లి కొడుకు విక్కీ కౌశల్ అనుకోకుండా చిక్కుల్లో పడ్డాడు. ఈ మధ్యనే కత్రినాను పెళ్లి చేసుకుని ఒక్కటైన విక్కీ కౌశల్ హీరోగా నటిస్తున్న ఒక సినిమాలో సినిమా యూనిట్ ఇచ్చిన బైక్ మీద తన హీరోయిన్, స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కుమార్తె సారా అలీ ఖాన్ ను ఎక్కించుకుని చక్కెరలు కొట్టడమే. ఆ వివరాల్లోకి వెళితే

కొత్త తలనొప్పి

కొత్త తలనొప్పి

యంగ్‌ హీరో విక్కీ కౌశల్‌, బ్యూటిఫుల్‌ హీరోయిన్‌ సారా అలీ ఖాన్‌ జంటగా నటిస్తున్న సినిమా లుకా చుప్పి 2. ప్రస్తుతం షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి ఇటీవల ఓ వీడియో క్లిప్‌ లీకైంది. ఇందులో హీరో.. చీరకట్టులో ఉన్న సారా అలీ ఖాన్‌ను బైక్‌పై తీసుకెళ్తున్నాడు. అయితే చాలా మంది ఈ జంట భలే బాగుందే అని అనుకుంటూ కామెంట్లు చేస్తుంటే ఇప్పుడు అదే సీన్ ఆయనకు కొత్త తలనొప్పి తెచ్చి పెట్టింది.

పోలీసులకు ఫిర్యాదు

పోలీసులకు ఫిర్యాదు

ఈ సీన్ ను చూసిన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన జై సింగ్‌ యాదవ్‌ అనే వ్యక్తి ఆగ్రహం చేశాడు. దానికి కారణం.. విక్కీ నడుపుతున్న బైక్‌ నంబర్‌ ప్లేట్‌ తనదే కావడంతో చిత్రయూనిట్‌పై మండిపడ్డాడు. తన అనుమతి లేకుండా నంబర్‌ ప్లేట్‌ వాడుకున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వైరల్ ఫోటోలో బైక్ నడుపుతున్న విక్కీ కౌశల్ వాహనం నంబర్ తనదని ఫిర్యాదుదారు చెప్పారు.

చట్టవిరుద్ధం,

చట్టవిరుద్ధం,

జై సింగ్ యాదవ్ అనే ఫిర్యాదుదారు మాట్లాడుతూ, "సినిమా సీక్వెన్స్‌లో ఉపయోగించిన వాహనం నంబర్ నాది. ఈ విషయం చిత్ర యూనిట్‌కి తెలిసిందో లేదో తెలియదు. అయినా ఇలా వేరే వారి నంబర్ వాడడం చట్టవిరుద్ధం, ఎవరూ కూడా అనుమతి లేకుండా నా నంబర్ ప్లేట్‌ను ఉపయోగించలేరు, ఇదే విషయం మీద స్టేషన్‌లో మెమోరాండం ఇచ్చాను. ఈ విషయంలో చర్యలు తీసుకోవాలి'' అని అన్నారు.

చర్యలు తీసుకుంటా

చర్యలు తీసుకుంటా

దీనిపై బంగాంగ ఎస్‌ఐ రాజేంద్ర సోని ఏఎన్‌ఐతో మాట్లాడారు. విక్కీ కౌశల్‌పై మాకు ఫిర్యాదు వచ్చింది. అన్ని కోణాలలో విచారణ జరిపి నెంబర్‌ ప్లేట్‌ దుర్వినియోగం అయ్యిందా లేదా అన్నది తేలుస్తామని అన్నారు. నిజంగా అలా వాడినట్టు అయితే కనుక మోటారు వాహన చట్టంలోని నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటారని అన్నారు. ఇక చిత్ర యూనిట్ ఇండోర్‌లో ఉంటే వారిని కూడా విచారించనున్నారు.

Recommended Video

Katrina Kaif, Vicky Kaushal Wedding Specials From Mehendi To Food Menu || Filmibeat Telugu
సోషల్ మీడియాలో వైరల్

సోషల్ మీడియాలో వైరల్

కొన్ని రోజుల క్రితం, విక్కీ కౌశల్ మరియు సారా అలీ ఖాన్ యొక్క అనేక చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇండోర్‌లో ఇద్దరూ బైక్‌పై వెళుతూ కనిపించారు. ఫోటోలో, విక్కీ టీ-షర్ట్, జాకెట్ మరియు జీన్స్ ధరించి బైక్ నడుపుతుండగా, సారా అలీ ఖాన్ పసుపు రంగు చీర ధరించి అతని వెనుక కూర్చున్నారు. ఈ సినిమా పేరును నిర్మాతలు ఇంకా ప్రకటించలేదు. లూకా చూప్పి సీక్వెల్ కావడంతో లూకా చూప్పి 2 అని అంటున్నారు. మరి ఈ ఘటనపై లుకా చుప్పి 2 చిత్రబృందం ఏమని స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది.


More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X