Katrina Kaif తో సీక్రెట్‌గా వికీ కౌశల్ నిశ్చితార్థం.. ఒక్క పోస్ట్‌తో బాలీవుడ్‌లో దుమారం!

బాలీవుడ్ స్టార్స్ విక్కీ కౌశల్ మరియు కత్రినా కైఫ్ డేటింగ్ గురించి చాలా కాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఆ స్టేజ్ దాడి ఇప్పుడు వారిద్దరి వివాహం గురించి ఊహాగానాలు మొదలయ్యాయి. అదే సమయంలో, ఇప్పుడు ఇద్దరూ రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నారని కూడా ఇప్పుడు నివేదికలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే

డేటింగ్ చేస్తున్నా

డేటింగ్ చేస్తున్నా

కత్రినా కైఫ్ - విక్కీ కౌశల్ లు ఇద్దరూ ప్రేమలో ఉన్నారనే సంగతి తెలిసిందే. నిజానికి ఒక అవార్డు ఫంక్షన్‌లో విక్కీ కౌశల్ తనకు కత్రినాతో ప్రేమ ఉందని ఒప్పుకోవడంతో ఈ ఇద్దరి మధ్య సంబంధం గురించి పుకార్లు ఊపందుకున్నాయి. కత్రినా కైఫ్ మరియు విక్కీ కౌశల్ గత రెండు సంవత్సరాలుగా ఒకరితో ఒకరు డేటింగ్ చేస్తున్నారు. ఇద్దరూ చాలా సార్లు కలిసి కనిపించారు. ఈ సారి న్యూ ఇయర్ కూడా ఇద్దరూ కలిసి జరుపుకున్నారు. కానీ వారిద్దరూ తమ సంబంధం గురించి బహిరంగ పరచలేదు.

సల్మాన్ నిద్రపోతున్నట్లు

సల్మాన్ నిద్రపోతున్నట్లు

ఇంతకు ముందు ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోలో విక్కీ కౌశల్ కత్రినాను 'నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా' అని అడగడం కనిపిస్తుంది? సల్మాన్ ఖాన్ కూడా ఉన్న ఈ అవార్డుల కార్యక్రమంలో విక్కీ అలా అడిగిన వెంటనే సల్మాన్ ఖాన్ రియాక్షన్ చూడాలి. అప్పుడు అతని సోదరి అర్పిత కూడా సల్మాన్‌తో కలిసి ఉంది. విక్కీ ప్రపోజ్ చేసినప్పుడు, సల్మాన్ తన సోదరి అర్పిత భుజంపై తల పెట్టుకుని నిద్రపోతున్నట్లు నటించారు.

చివరిగా అలా

చివరిగా అలా

విక్కీ కౌశల్ మరియు కత్రినా కైఫ్ కొంతకాలం క్రితం 'షెర్షా' స్పెషల్ స్క్రీనింగ్‌లో కలిసి కనిపించారు. ఇద్దరూ సినిమా హాల్ నుండి బయటకు రావడం కనిపించింది. విక్కీ కౌశల్ మొదట థియేటర్ నుంచి బయటకు వచ్చాడు, తర్వాత కత్రినా కైఫ్ బయటకు వచ్చింది మరియు ఆమె తన సోదరి కోసం ఉండిపోయింది. దీంతో, ఆమె కెమెరా దృష్టి నుండి తప్పించుకో లేకపోయింది.

 ఫ్యాన్స్ పేజీలతో

ఫ్యాన్స్ పేజీలతో

అయితే వారిద్దరికి ఎంగేజ్మెంట్ సహా రోకా వేడుకలు కూడా జరిగాయని ఇప్పుడు పుకార్లు ఇంటర్నెట్‌లో వ్యాపిస్తున్నాయి. అయితే, ఈ నివేదికలకు ఎటువంటి ఆధారం లేదు ... విక్కీ మరియు కత్రినా తమ సంబంధం గురించి ఇంకా మాట్లాడలేదు. నిజానికి వీరిద్దరి నిశ్చితార్థం మరియు రోకా వేడుక గురించి ఫేక్ న్యూస్ విక్కీ కౌశల్ మరియు కత్రినా కైఫ్ యొక్క ఫ్యాన్ పేజీల ద్వారా వ్యాపిస్తుంది.

అది నిజం కాదు

అది నిజం కాదు

జరుగుతున్న ప్రచారం మేరకు కత్రినా మరియు విక్కీ ఖచ్చితంగా ఒకరితో ఒకరు డేటింగ్ చేస్తున్నారు కానీ వారి గురించి వ్యాప్తి చేస్తున్న వార్తలు పూర్తిగా అబద్ధం అని అంటున్నారు. నిజానికి కత్రినా మరియు విక్కీ వారి సంబంధాన్ని అంగీకరించనప్పటికీ, వారి మ్యూచ్యువల్ ఫ్రెండ్ సోనమ్ కపూర్ సోదరుడు హర్షవర్ధన్ కపూర్ దాని గురించి సూచనలు చేశారు.

ఆ మాటలతో మరింత బలం

ఆ మాటలతో మరింత బలం

హర్షవర్ధన్‌ ను ఒక ఇంటర్వ్యూలో, మీరు ఏ బాలీవుడ్ స్టార్స్ రిలేషన్‌షిప్ రూమర్‌లను నమ్ముతారని అడిగారు?. దీనిపై ఆయన మాట్లాడుతూ- 'కత్రినా కైఫ్ మరియు విక్కీ కౌశల్' అని ఆయన చెప్పారు. 'ఇలా చెప్పినందుకు నేను ఇబ్బందుల్లో పడతానా? ఏమో నాకు తెలియదు కానీ వారిద్దరూ దాని గురించి చాలా ఓపెన్‌గా ఉన్నట్లు నాకు అనిపిస్తోందని అన్నారు.

అసలు కారణం ఏంటంటే

అసలు కారణం ఏంటంటే

అసలు దీనికి కారణం బాలీవుడ్ లో ప్రముఖ పాపారాజీ వైరల్ భయానీ విక్కీ కౌశల్ మరియు కత్రినా ఎంగేజ్మెంట్ చేసుకున్నారని, ఇద్దరికీ రోక వేడుకలు జరిగాయని అన్నారు. వారిద్దరి ఫోటోను ఇన్‌స్టా ఖాతాలో పంచుకుని 'ఎంగేజ్‌మెంట్ రూమర్స్' రాశాడు, ఆ తర్వాత అభిమానులు వారిద్దరికీ అభినందనలు తెలిపారు. అయితే ఏమయిందో ఏమో కానీ కాసేపట్లోనే తన పోస్ట్‌ను తొలగించాడు. సో అధికారిక ప్రకటన వచ్చే దాకా ఇది పుకారు అనే అనుకోవాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X