నిజజీవితంలో ప్రేమ, కుర్ర హీరోతో స్టార్ హీరోయిన్ రొమాన్స్.. బాలీవుడ్‌లో హాట్ టాపిక్!
యంగ్ హీరో విక్కీ కౌశల్ యురి ది సర్జికల్ స్ట్రైక్ చిత్రంతో దేశం మొత్తం ఫేమస్ అయిపోయాడు. యురి చిత్రంలో విక్కీ కౌశల్ నటన ప్రతి ఒక్కరిని మెప్పించింది. ఆర్మీ అధికారి పాత్రలో విక్కీ ఒదిగిపోయి నటించాడు. విక్కీ కౌశల్ తన ప్రేమ వ్యవహారంతో ఇటీవల వార్తల్లో నిలిచాడు. విక్కీ కౌశల్ ప్రస్తుతం దర్శక నిర్మాతలకు మోస్ట్ వాంటెండ్ హీరో. యురి చిత్రం ఏకంగా 200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. విక్కీ కౌశల్ ప్రస్తుతం పలు చిత్రాల్లో అవకాశాలు అందుకుంటున్నాయి. తాజాగా విక్కీ కౌశల్ ఓ స్టార్ హీరోయిన్ తో రొమాన్స్ చేయబోతున్నాడనే వార్త బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

మరో వార్ చిత్రం
ఈ ఏడాది ఆరంభంలో విదులైన యురి చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఆదిత్య ధార్ ఈ చిత్రానికి దర్శకుడు. రోన్ని స్క్రూవాలా ఏఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ మరోమారు ఏకం కాబోతోంది. విక్కీ కౌశల్ హీరోగా ఆదిత్య ధార్ ఓ వార్ చిత్రానికి ప్లాన్ చేస్తున్నారట. రోన్ని స్క్రూవాలానే ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. ఏ క్రేజీ ప్రాజెక్ట్ ని త్వరలో ప్రారంభించి 2020లో విడుదల చేయాలని భావిస్తున్నారు.

కత్రినా కైఫ్‌తో రొమాన్స్
విక్కీ కౌశల్ గురించి మరో ఆసక్తికర వార్త బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. రోన్ని స్క్రూవాలా విక్కీ కౌశల్ హీరోగా, కత్రినా కైఫ్ హీరోయిన్ గా ఓ అద్భుతమైన ప్రేమ కథకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నిర్మాత ప్రస్తుతం విక్కీ కౌశల్, కత్రినా ఇద్దరితో సంప్రదింపులు జరుపుతున్నారు. దర్శకుడు ఎవరనేది త్వరలో తేలనుంది. కత్రినా కైఫ్ వరుసగా క్రేజీ చిత్రాల్లో నటిస్తోంది. అలాంటిది కత్రినా విక్కీ కౌశల్ తో రొమాన్స్ చేయడానికి అంగీకరించడం ఆసక్తికరమైన అంశం.

నిజజీవితంలో ప్రేమ
కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ జంటగా నటించే ఈ చిత్ర కథని నిజజీవితంలో జరిగిన ఓ ప్రేమ కథ ఆధారంగా రూపొందిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రం చాలా ఎమోషనల్ గా ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. విక్కీ కౌశల్, కత్రినా మధ్య కెమిస్ట్రీపై ఈ చిత్రంలో హైలైట్ గా నిలిచే అవకాశం ఉందని, ఆ తరహాలో కథ సిద్ధం అవుతోందని అంటున్నారు. త్వరలో ఈ చిత్రంపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి.

ఫిదా అవుతున్న హీరోయిన్లు
యురి చిత్రంతో విక్కీ కౌశల్ ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడని చెప్పొచ్చు. ఆ మధ్యన ఓ ఇంటర్వ్యూలో తనకు విక్కీ కౌశల్ తో డేటింగ్ చేయాలని ఉందని మిల్కీ బ్యూటీ తమన్నా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇక కత్రినా కైఫ్ కాఫీ విత్ కరణ్ షోలో తనకు విక్కీ కౌశల్ తో నటించాలని ఉన్నట్లు వెల్లడించింది. దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు.. స్టార్ హీరోయిన్లలో విక్కీ కౌశల్ క్రేజ్ ఎలా ఉందో అని.


Click it and Unblock the Notifications











