హీరో వికీ కౌశల్ జైలుకు.. కత్రినా కైఫ్ భర్త ఏం తప్పు చేశాడంటే?

బాలీవుడ్ ప్రముఖ నటుల్లో విక్కీ కౌశల్ ఒకరు. లీడ్ యాక్టర్ కాకముందు విక్కీ కౌశల్ అసిస్టెంట్ డైరెక్టర్. ఈ సమయంలో, విక్కీ జైలు శిక్షను కూడా అనుభవించాడు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ భర్త విక్కీ కౌశల్ జైలుకు వెళ్లాడన్న విషయం మీకు తెలుసా? మరి ఆయన ఏం తప్పు చేసి జైలుకు వెళ్ళాడు అనే విషయంపై ఓ లుక్కేద్దాం.

బాలీవుడ్‌లోని ప్రతిభావంతులైన నటుల్లో విక్కీ కౌశల్ కూడా ఒకరు. స్టార్ హీరోయినే కత్రినా కైఫ్ భర్త, బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ సినీ పరిశ్రమలో మంచి నటుడిగా తనదైన ముద్ర వేశారు. 2015లో మసాన్ సినిమా ద్వారా బాలీవుడ్‌లోకి అడుగు పెట్టాడు.
కమర్షియల్ కంటే ఛాలెంజింగ్ పాత్రలనే ఎక్కువగా ఎంచుకునే నటుడు విక్కీ కౌశల్‌కి తనకంటూ ఓ ఫ్యాన్ బేస్ ఉంది. నటుడిగా రంగుల ప్రపంచంలోకి రాకముందు, విక్కీ కౌశల్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా కూడా తెర వెనుక పని చేశాడు. ఆ సమయంలోనే విక్కీ కౌశల్‌ జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చిందన్న విషయం చాలా మందికి ఇప్పటికీ తెలియదు. తాజాగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

vicky kaushal was arrested for illegal activity during Gangs of Wasseypur shoot

విక్కీ కౌశల్ ఒకరు లీడ్ యాక్టర్ కాకముందు గ్యాంగ్స్ ఆఫ్ వస్సేపూర్ వంటి సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారు. ఈ సినిమా విడుదలై 10 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో కపిల్ శర్మ షోకు గ్యాంగ్స్ ఆఫ్ వస్సేపూర్ దర్శకనిర్మాతలను ఆహ్వానించారు. షోలో భాగంగా అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసిన నటుడు విక్కీ కౌశల్‌ జైలుకు వెళ్లాల్సి వచ్చిందన్న విషయాన్ని మేకర్స్ వెల్లడించారు. ఈ సందర్భంగా దర్శకుడు అనురాగ్ కశ్యప్ మాట్లాడుతూ.. ''ఈ సినిమా కోసం అనుమతి లేకుండా లొకేషన్‌లో షూటింగ్ చేశాం. షూటింగ్‌ సమయంలో పోలీసులు అక్కడ అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నట్లు గుర్తించారు.

ఇసుక మాఫియా లొకేషన్‌లో కాల్పులు జరిపినందుకు అక్రమ కార్యకలాపాల కేసులో విక్కీని అరెస్టు చేశారు. కానీ 'హరాంఖోర్' దర్శకుడు శ్లోక్ శర్మ విక్కీ కౌశల్‌ను విడిపించారు. అంతేకాదు రెండుసార్లు విక్కీ జైలుకు వెళ్లాడు' అన్నారు. గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్‌లో దర్శకుడు అనురాగ్ కశ్యప్‌తో పాటు నటులు మనోజ్ బాజ్‌పేయి, పీయూష్ మిశ్రా, నవాజుద్దీన్ సిద్ధిఖీ, హుమా ఖురేషి, వినీత్ కుమార్, పంకజ్ త్రిపాఠి కూడా ఈ షోలో ఉన్నారు.

విక్కీ కౌశల్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా బాలీవుడ్‌లోకి అడుగు పెట్టాడు. తరువాత హీరోగా మారాడు. తరువాత ఆయన వెనుదిరిగి చూసుకోలేదు. ఈ హీరో మే 16న తన 36వ పుట్టినరోజును జరుపుకున్నారు.విక్కీ కౌశల్, రష్మిక మందన్న జంటగా త్వరలో 'చావా' అనే చారిత్రక చిత్రం రానుంది. విక్కీ ఈ సినిమాలో శంభాజీ మహారాజ్ పాత్రలో కనిపించనున్నాడు. రష్మిక మందన్న యేసుబాయ్ భోంసాలే పాత్రలో కనిపించనుంది.

vicky kaushal was arrested for illegal activity during Gangs of Wasseypur shoot

ఈ హిస్టారికల్ మూవీలో తమ అభిమాన తారలను చూసేందుకు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా విక్కీ కౌశల్ ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నట్లు ప్రకటించాడు. కాగా విక్కీ కౌశల్ రీసెంట్ గా కన్పించిన మూవీ డంకీ. ఈ మూవీలో ఆయన షారూఖ్ ఖాన్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. మరోవైపు విక్కీ, కత్రినా తల్లిదండ్రులు కాబోతున్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X