ఆ హీరో తండ్రి కూడా అలాంటి వాడే.. అవుట్ డోర్ షూటింగ్‌లో అసభ్యంగా.. నమిత ప్రకాష్!
మీటూ ఉద్యమం బాలీవుడ్ లో తీవ్ర రూపం దాల్చుతోంది. బడా హీరోయిన్ల నుంచి చిన్న ఆర్టిస్టులు, మహిళా టెక్నీషియన్ల కూడా మీటూ ఉద్యమంలో పాల్గొంటున్నారు. నానా పాటేకర్, వికాస్ బహల్, షాజిద్ ఖాన్ వంటి బాలీవుడ్ ప్రముఖులు ఆరోపణలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. తాజాగా బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ తండ్రి శ్యామ్ కౌశల్ పై కూడా ఆరోపణలు ఎదురయ్యాయి. నమిత ప్రకాష్ అనే అసిస్టెంట్ డైరెక్టర్ శ్యామ్ కౌశల్ పై ఆరోపణలు చేసింది.

అసిస్టెంట్ డైరెక్టర్
నమిత ప్రకాష్ తాజా ఆరోపణలతో మరో బాలీవుడ్ ప్రముఖుడు వెలుగులోకి వచ్చాడు. పలు చిత్రాలకు నమిత ప్రకాష్ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. విక్కీ కౌశల్ తండ్రి శ్యామ్ కౌశల్ తనని వేధించాడని ఆమె సోషల్ మీడియా వేదికగా తెలిపారు. రోజు రోజుకు ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ ప్రముఖుల సంఖ్య పెరుగుతోంది.

2006లో జరిగిన సంఘటన
ఇది 2006లో జరిగిన సంఘటన అని నమిత వివరించారు. ఓ చిత్రానికి అవుట్ డోర్ షూటింగ్ కోసం వెళ్ళాను. ఆరోజు రాత్రి శ్యామ్ కౌశల్ మద్యం సేవిస్తూ తనని పిలిచాడు. మద్యం సేవించమని అడిగాడు. నేను తాగనని చెప్పా. ఆయన బాగా మద్యం సేవించిన తరువాత నాదగ్గరకు వచ్చాడు.

అశ్లీల చిత్రాలు
నాకు అశ్లీల చిత్రాలు చూపించడానికి ప్రయత్నించాడు. ఈ సంఘటనని నేను నిర్మాతలకు చెప్పగా వారు క్షమాపణలు చెప్పారు. కానీ శ్యామ్ కౌశల్ పై ఎలాంటి చర్యలు తీసుకోలేదని నమిత వాపోయింది. ఆ సంఘటన తరువాత తాను శ్యామ్ కౌశల్ తో మాట్లాడడం మానేశానని నమిత తెలిపింది.
Recommended Video


ఒక్కొక్కటిగా వెలుగులోకి
తనుశ్రీ దత్తా నానా పాటేకర్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన సమయంలో మీటూ ఉద్యమం ఇంత సంచలనంగా మారుతుందని ఎవరూ ఊహించలేదు. కానీ ప్రస్తుతం మీటూ ఉద్యమమే మీడియాలో ప్రధాన అంశంగా మారింది.


Click it and Unblock the Notifications











