తనుశ్రీపై గుండాల దాడి.. సంచలనం సృష్టిస్తున్న వీడియో, నానా పాటేకర్‌కు బిగుసుకుంటున్న ఉచ్చు!

Recommended Video

తనుశ్రీపై గుండాల దాడి.. సంచలనం సృష్టిస్తున్న వీడియో, నానా పాటేకర్‌కు బిగుసుకుంటున్న ఉచ్చు!

బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తపై వేధింపుల వ్యవహారం రోజుకొక మలుపు తిరుగుతోంది. ఈ వ్యవహారంలో దిగ్గజ నటుడు నానా పాటేకర్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటున్నట్లు తెలుస్తోంది. కొన్ని రోజులు క్రితం తనుశ్రీ దత్త ఓ ఇంటర్వ్యూలో భాగంగా నానా పాటేకర్ తనని లైంగికంగా వేధించాడు అంటూ సంచలనం ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దీనితో పాటు బాలీవుడ్ లో హీరోయిన్ల వేధింపులకు సంబందించిన కొన్ని విషయాలని బయట పెట్టింది. వేధింపుల గురించి తనుశ్రీ ధైరంగా మాట్లాడుతుండడంతో ఆమెకు బాలీవుడ్ ప్రముఖుల నుంచి క్రమంగా మద్దత్తు పెరుగుతోంది. తనుశ్రీ కారుపై దాడి జరుగుతున్న వీడియో సంచలనంగా మారింది.

అప్పట్లో జరిగిన ఘటన

అప్పట్లో జరిగిన ఘటన

తనని నానా పాటేకర్ లైంగికంగా వేధించాడని తనుశ్రీ చెబుతున్న ఘటన పదేళ్ల క్రితం నాటిది. హార్న్ ఓకె ప్లీజ్ చిత్ర సాంగ్ షూటింగ్ లో భాగంగా డాన్స్ పేరుతో నానా పాటేకర్ తనని వేధించాడని తనుశ్రీ ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం 2009 లో విడుదలయింది. నానా పాటేకర్ వేధించడంతో తాను సినిమా నుంచి తప్పుకుంటానని తనుశ్రీ తెలిపింది.

తన మనుషులని పంపి

తన మనుషులని పంపి

అప్పటి నుంచి నానా పాటేకర్ కొందరు గుండాలతో తనని వేధిస్తూనే ఉన్నాడని ఓ ఇంటర్వ్యూలో ఆరోపిస్తూనే ఉంది. తనుశ్రీ ఆరోపణలతో నానా పాటేకర్ ఆమెకు లీగల్ నోటీసులు పంపారు. ఇదిలా ఉండగా 2008లో తనుశ్రీ కారుపై జరిగిన దాడికి సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఈ వీడియోతో నానా పాటేకర్ చుట్టూ మరింతగా ఉచ్చు బిగుసుకున్నట్లే అనే వాదనలు వినిపిస్తున్నాయి.

కారు అద్దాలు పగలగొట్టి

తనుశ్రీ తన తల్లిదండ్రులతో కారులో ప్రయాణిస్తుండగా కొందరు గుండాలి ఆమె వాహనాన్ని చుట్టుముట్టారు. అద్దాలు పగలగొట్టారు. టైర్లకు గాలి తీసేశారు. కొందరైతే కారుపైకి ఎక్కి టాప్ ని ద్వాంసం చేసే ప్రయత్నం కూడా చేశారు. ఆ సమయంలో తనుశ్రీ, తన తల్లిదండ్రులతో పాటు కారులోనే కూర్చుని ఉంది.

 పోలీసులు వచ్చాక

పోలీసులు వచ్చాక

చాలా సేపు వరకు తనుశ్రీ వాహనాన్ని కదలనీయలేదు. చివరకు పోలీసులకు సమాచారం తెలియడం వారు అక్కడకు చేరుకున్నారు. లాఠీ ఛార్జ్ నిర్వహించి పోకిరిగాళ్లని చెదరగొట్టారు. పోలీసుల రక్షణ వలయంలో తనుశ్రీ సురక్షితంగా బయలుదేరింది. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ వీడియో 2008 నాటిది.

వాస్తవాలు బయటకు

ఈ వీడియోకి సంబందించిన మరిన్ని వాస్తవాలని నిర్మాత, జర్నలిస్ట్ అయిన ఝాన్సీ సెక్యూరా బయట పెట్టింది. హార్న్ సౌండ్ ప్లీజ్ చిత్ర షూటింగ్ కు తనుశ్రీ ఆరోజు హాజరైంది. కొన్ని షాట్స్ చిత్రీకరించిన తరువాత నానా పాటేకర్ కూడా స్టూడియోకి వెళ్లారు. నానా పాటేకర్ లోనికి వెళ్లిన కొద్దీ సేపటికే తనుశ్రీ బయటకు వచ్చేసింది. ఆ సందర్భంగానే ఈ ఘటన చోటు చేసుకుందని సెక్యూరా వివరించింది.

రవీనా టాండన్ మద్దత్తు

బాలీవుడ్ నటి రవీనా టాండన్ తాజాగా తనుశ్రీకి మద్దత్తు ప్రకటించడం విశేషం. ఈ ఘటనపై వెంటనే విచారణ జరిపించాలి. అంత ఉద్రిక్త పరిస్థితుల్లో కూడా తనుశ్రీ దత్త దైర్యంగా కనిపిస్తోందని రవీనా టాండన్ ప్రశంసించింది. ఈ దాడిని నానా పాటేకర్ చేయించాడని తనుశ్రీ ఆరోపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X