twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అలా చేస్తావా అంటే.. F**k అని గట్టిగా అరువాలనిపించేది.. విద్యాబాలన్

    |

    విభిన్నమైన పాత్రలకు విద్యాబాలన్ కేరాఫ్ అడ్రస్. 15 ఏళ్ల కెరీర్‌లో ఎన్నో విలక్షణ, వైభిన్నమైన పాత్రలు పోషించి మెప్పించారు. ఆమె తొలి చిత్రం పరిణిత నుంచి డర్డీ పిక్చర్, తాజాగా వచ్చిన ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా వరకు ఎన్నో గొప్ప పాత్రలు పోషించారు. చూడటానికి కొంచెం పుష్టిగా కనిపిస్తారు. తనను ఎవరైనా బరువు తగ్గమంటే తనకు ఒళ్లు పడిపోతుంది అని విద్యాబాలన్ చెప్పారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..

    బాల్యం నుంచే నాకు ఆ వ్యాధి

    బాల్యం నుంచే నాకు ఆ వ్యాధి

    నాకు బాల్యం నుంచే హరోన్ల సమస్య వెంటాడుతున్నది. ఆ కారణంగా ఉన్నట్టుంది బరువు పెరిగిపోతాను. ఆ క్రమంలో నేను చాలాసార్లు ఆకలితో కడుపు మాడ్చుకోవాల్సి వచ్చేది. చాలా మంది నా బరువు గురించి మాట్లాడేవారు. కానీ నాకు ఉన్న సమస్యను అందరికీ చెప్పుకోవడం ఇష్టం ఉండకపోయేది.

    నా బాధ వారికేమీ తెలుసు

    నా బాధ వారికేమీ తెలుసు

    యుక్త వయసులో నీ ముఖం చూస్తే చాలా అందంగా ఉంటుంది. కానీ స్థూలకాయం తగ్గించికొని నాజుకుగా మారితే ఇంకా అందంగా ఉంటారని సలహా ఇచ్చేవారు. వారికేమీ తెలుసు.. నా బరువును తగ్గించుకోవడానికి నేనేమీ చేస్తున్నానో. అయినా ప్రతీ ఒక్కరికి నేను చెప్పుకోవాల్సిన అవసరం లేదనుకొంటాను.

    నన్ను నేను చూసుకొనే దానిని కాదు

    నన్ను నేను చూసుకొనే దానిని కాదు

    నాకున్న హారోన్మ సమస్య వలన నేను బరువు పెరగడం, తగ్గడం జరుగుతూనే ఉంటుంది. షూటింగ్‌లో సీను పూర్తయిన తర్వాత నా సీన్లను చూడటం మానేశాను. ఎందుకంటే లావుగా కనిపిస్తాననే భయం నన్ను వెంటాడేది. అందుచేత మానిటర్‌లో చూసుకొనే దానిని కాదు అని విద్యాబాలన్ అన్నారు.

     F==k అని గట్టిగా అరువాలని

    F==k అని గట్టిగా అరువాలని

    నేను లావుగా ఉండటం చూసి ఎక్సర్‌సైజుల చేయొచ్చుగా అని సలహాలు ఇచ్చేవారు. వారు నన్ను ఎగాదిగా చూడటం చూసి F**k అని గట్టిగా అరువాలని అనిపించేది. కొన్నిసార్లు నా బరువు గురించి మాట్లాడటం మీకు సరికాదు అని సున్నితంగా మదలించేదానిని. బరువు తగ్గించుకోవడానికి నేను ఎంత కష్టపడుతున్నానో అవతలివారికి ఏం తెలుసు అని విద్యాబాలన్ పేర్కొన్నారు.

    శకుంతలగా విద్యాబాలన్

    శకుంతలగా విద్యాబాలన్

    ఎన్టీఆర్ బయోపిక్ తర్వాత విద్యాబాలన్ మరో బయోపిక్‌లో నటిస్తున్నారు. అందులో ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్రలో కనిపించారు. మ్యాథమెటిషియన్ శకుంతల జీవితం ఆధారంగా తెరకెక్కించే మూవీలో నటిస్తున్నారు. అలాగే పింక్ తమిళ రీమేక్‌లో ముఖ్య పాత్రలో కనిపిస్తారు. అలాగే ఆమె నటించిన ఎన్టీఆర్: మహానాయకుడు త్వరలో విడుదల కానున్నది.

    English summary
    Vidya Balan opens up about the challenges of weight problems she has faced over the years. She revealed that she had hormonal problems since childhood. "When people tell me why don’t you start exercising, I want to say f**k you!
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X