డర్టీ హీరోయిన్‌కు చేదు అనుభవం.. స్టేజీపైనే ఇద్దరు హీరోల చేతిలో దారుణంగా!

బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ సౌత్ ఆడియన్స్ కి కూడా సుపరిచితురాలే. తాజాగా ఈ బ్యూటీ ఇద్దరు హిందీ బడా హీరోలు తనను తీవ్రంగా అవమానించారని చెప్పి షాక్ ఇచ్చింది. మరి ఇంతకీ ఆ స్టార్స్ ఎవరు? విద్యాబాలన్ ను వెక్కివెక్కి ఏడ్చేలా ఎందుకు చేశారు? అనే ఇంట్రెస్టింగ్ విషయంపై ఓ లుక్కేద్దాం పదండి.

విద్యాబాలన్ డర్టీ పిక్చర్ మూవీతో బాగా పాపులర్ అయ్యింది. ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాతో టాలీవుడ్ కి కూడా పరిచయమైంది. అయితే ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నెపోటిజం కారణంగా ఈ బ్యూటీ తీవ్రంగా ఇబ్బందులకు గురైందట. తాజాగా ఓ పాడ్ కాస్ట్ లో ఇద్దరు స్టార్ హీరోలు కెరీర్ మొదట్లో తనను ఎలా బాధ పెట్టారో బయట పెట్టింది విద్యాబాలన్.

Vidya Balan kept crying all over night because of shah Rukh Khan and Saif Ali Khan

2003లో భలే తేకో అనే బెంగాలీ చిత్రంతో విద్యాబాలన్ సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం బీ టౌన్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. తాజాగా సినిమా ఇండస్ట్రీలో బ్యాగ్రౌండ్ లేని వాళ్ళను ఎంత చులకనగా చూస్తారు అనే విషయాన్ని ధైర్యంగా చెప్పేసింది ఈ హాట్ బాంబ్.

ఎవరికో ఎందుకు స్వయంగా తనకే ఎన్నో చేదు అనుభవాలు ఎదురయ్యాయి అంటూ షారుక్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్ తనతో వ్యవహరించిన తీరును బట్టబయలు చేసింది. 2008లో ఫిలింఫేర్ అవార్డుల వేడుకలో ఎదురైన దారుణమైన సంఘటనను గుర్తు చేసుకుంది విద్యాబాలన్.

అప్పట్లో తాను అంత తొందరగా ఎవ్వరితోనూ కలిసిపోయేదాన్ని కాదని చెప్పుకొచ్చిన విద్యాబాలన్ సైలెంట్ గా వేడుక చూస్తున్న తనను ఉన్నట్టుండి అవార్డు ఇస్తామని చెప్పి స్టేజ్ పైకి తీసుకెళ్లి మరీ అవమానించారు అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది.

అప్పట్లో తాను నటించిన హేయ్ బేబీ సినిమాలోని కాస్ట్యూమ్ కి ఓ అవార్డు వచ్చింది. అయితే అదేమంత పెద్ద పాపులర్ అవార్డు కాదు. అసలు ప్రజాధరణ పొందని వారికి ఇచ్చే ఆ అవార్డును కావాలని విద్యా బాలన్ కి ఇచ్చి అవమానించారట. తను ఆ సినిమాకు కాస్ట్యూమ్ డిజైనర్ కాకపోయినా కావాలనే తనను స్టేజ్ పై దారుణంగా ఇబ్బంది పెట్టారని చెప్పుకొచ్చింది విద్యాబాలన్.

Vidya Balan kept crying all over night because of shah Rukh Khan and Saif Ali Khan

అసలు తను కాస్ట్యూమ్ డిజైనర్ కానప్పుడు, ఈ అవార్డుతో సంబంధం ఏంటి అని అడుగుతున్నప్పటికీ వినకుండా అలాంటి పని చేశారని వెల్లడించింది. ఎట్టకేలకు నా డైరెక్టర్, కాస్ట్యూమ్ డిజైనర్లతో కలిసి ఈ అవార్డును అందుకుంటాను అని రిక్వెస్ట్ చేసినా ఒప్పుకోకుండా షారుక్, సైఫ్ అలీఖాన్లు ఇద్దరూ కలిసి బలవంతంగా ఆమెను స్టేజ్ పైకి తీసుకెళ్లి అవార్డు చేతిలో పెట్టారని పేర్కొంది విద్యాబాలన్.

ఇక ఆరోజు జరిగిన అవమానానికి రాత్రంతా నిద్రపోకుండా ఏడుస్తూనే ఉన్నానని ఆవేదనను వ్యక్తం చేసింది. ఒక నటిని అవార్డుల వేడుకలో అందరి ముందు అలా అవమానించే సాహసం చేశారు అంటే కారణం ఇండస్ట్రీలో తన వెనుక ఎవ్వరూ లేకపోవడమే అంటూ మరోసారి నెపోటిజం అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది విద్యాబాలన్.

ఇక ఇప్పటిదాకా ఎవ్వరూ ఇలా షారుక్, సైఫ్ అలీ ఖాన్ లాంటి స్టార్లపై ఇలాంటి నిందల మోపే ధైర్యం చేయలేదు. కానీ తాజాగా విద్యాబాలన్ స్టార్స్ ముసుగులో వీళ్ళిద్దరూ ఇండస్ట్రీలో సపోర్ట్ లేని వాళ్ళతో వ్యవహరించే తీరును ధైర్యంగా బయట పెట్టడంపై ఆమె అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X