నేనలా కనిపించడానికి శ్రీదేవే కారణం: సీక్రెట్ రివీల్ చేసిన విద్యా బాలన్
తమిళ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా వెలుగొందుతున్నాడు అజిత్ కుమార్. స్టైలిష్ లుక్, విలక్షణమైన నటనతో అశేషమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్నాడు. అయితే, ఈ మధ్య అతడు చేసిన సినిమాలేవీ పెద్దగా ఆడడం లేదు. దీంతో అజిత్ ఫ్యాన్స్ నిరాశకు లోనవుతున్నారు. వరుస పరాజయాల తర్వాత అజిత్ నటించిన చిత్రం 'నెర్కొండ పార్వాయి'.
బాలీవుడ్‌లో అమితాబ్ బచ్చన్ - తాప్సీ పన్ను కలయికలో వచ్చిన చిత్రం 'పింక్'కు ఇది రీమేక్‌గా వచ్చింది. దీన్ని శ్రీదేవి భర్త బోనీ కపూర్ నిర్మించారు. ఖాకీ ఫేం హెచ్ వినోథ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. శ్రద్ధా శ్రీనాథ్, అభిరామి వెంకటచలం, ఆండ్రియా తరియంగ్‌లు ముఖ్య పాత్రలలో కనిపించారు. అలాగే, బాలీవుడ్ బ్యూటీ విద్యా బాలన్ కూడా ఓ అతిథి పాత్రలో కనిపించారు.

వ్యభిచార గృహాల్లో చిక్కుకున్న ముగ్గురు యువతులను రక్షించే న్యాయవాది ఇతివృత్తంగా తమిళ నేటివిటీకి అనుగుణంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. గత వారం విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమా విడుదలైన మొదటి రోజే చెన్నైలో భారీ వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డులకెక్కింది. అలాగే, భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది. చాలా కాలంగా సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న అజిత్.. ఈ సినిమా ఫలితంతో ఖుషీగా ఉన్నాడు.
'నెర్కొండ పార్వాయి' చిత్రంలో అజిత్ భార్యగా విద్యా బాలన్ కనిపించారు. ఈమెకి ఈ చిత్రం తమిళంలో తొలి మూవీ. అసలు ఈ సినిమాలో ఎందుకు నటించిందన్న దానిపై ఆమె క్లారిటీ ఇచ్చింది. 'ఈ సినిమాలో నటించడానికి శ్రీదేవి గారే కారణం. ఆమె భర్త బోనీ కపూర్ ఈ సినిమాను నిర్మించారు. ఆయన కోరిక మేరకు ఇందులో చేయడానికి ఒప్పుకున్నాను. గతంలో శ్రీదేవి గారితో ఉన్న అనుబంధం వల్లే ఇది కుదిరింది' అని ఆమె చెప్పుకొచ్చింది.


Click it and Unblock the Notifications











