For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఆ నిర్మాత నాతో అసభ్యంగా ప్రవర్తించాడు.. దక్షిణాది ఇండస్ట్రీలో ఎన్నో అవమానాలు.. విద్యాబాలన్ సంచలన వ్యాఖ్యలు

  |

  అందంతో పాటు అద్భుతమైన ప్రతిభ కలిగిన నటీమణుల్లో విద్యాబాలన్ ఒకరు. ఇప్పటికీ ఆమెకు బాలీవుడ్‌లో మంచి ఫ్యాన్ బేస్ ఉంది. సిల్క్ స్మిత బయోపిక్ ది డర్టీ పిక్చర్తో విద్య దశ తిరిగింది. ఆ సినిమాతో దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించింది. అనంతరం వరుస సినిమాలు చేస్తూ కెరీర్‌లో బిజీ అయిపోయింది. విద్య నటించిన తాజా చిత్రం జల్సా. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ అమెజాన్‌ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా విడుదలైంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో విద్యా బాలన్ తన కెరీర్ ఆరంభం నాటి విషయాలు పంచుకుంది.

  Recommended Video

  Vidya Balan Shares Her Casting Couch Experience In Latest Interview || Telugu
  బాలచందర్ కూతురు చెప్పింది..

  బాలచందర్ కూతురు చెప్పింది..


  `కెరీర్ ప్రారంభంలో ఏదీ నేను అనుకున్నట్టు జరగలేదు. ముందు నన్ను సినిమాల్లో ఎంపిక చేసుకునే వారు. రాత్రికి రాత్రే వాటి నుంచి తొలగించేవారు. అలా దాదాపు 13 సినిమాల వరకు కోల్పోయాను. దక్షిణాది ప్రముఖ దర్శకుడు కె.బాలచందర్ కూడా నన్ను హీరోయిన్‌గా తీసుకుని రెండు సినిమాల నుంచి తొలగించారు. తొలగించిన విషయం గురించి వారు కనీసం సమాచారం కూడా ఇవ్వలేదు. చివరికి మా అమ్మ ఫోన్ చేస్తే నన్ను సినిమా నుంచి తీసేశారనే విషయాన్ని బాలచందర్ కూతురు చెప్పింది.

  అద్దంలో చూసుకోవడానికి భయపడ్డా..

  అద్దంలో చూసుకోవడానికి భయపడ్డా..


  `కెరీర్ ఆరంభంలో ఓ నిర్మాత నాతో అసభ్యంగా ప్రవర్తించాడు. అతడు మాట్లాడిన మాటలు నాపై నాకు నమ్మకం కొల్పోయేలా చేశాయి. నేను అందంగా ఉండనని, నా మొహం సినిమాలకు పనికి రాదని అన్నాడు. దాంతో దాదాపు ఆరు నెలల వరకు అద్దంలో చూసుకోవడానికి కూడా భయపడ్డాను. కెరీర్ ఆరంభంలో నన్ను తీసేసిన వారిలో చాలా మంది ఆ తర్వాత సినిమాలు చేయమని అడిగారు. అయితే వారి ఆఫర్స్‌ని సున్నితంగా తిరస్కరించాన'ని విద్య చెప్పుకొచ్చింది.

   సిద్ధార్థ్ రాయ్ కపూర్‌తో పెళ్లి..

  సిద్ధార్థ్ రాయ్ కపూర్‌తో పెళ్లి..


  బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సిద్ధార్థ్ రాయ్ కపూర్‌‌ను విద్య ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా ఆమె వరుస సినిమాలతో బిజీగానే ఉంది. అయితే భర్త నిర్మించే సినిమాల్లో మాత్రం విద్య నటించడం లేదు. సిద్ధార్థ్ కపూర్ నిర్మాణంలో విద్య చేసిన చివరి చిత్రం 2013లో వచ్చిన `ఘన్‌చక్కర్`. ఆ తర్వాత ఇన్నేళ్లలో తమ స్వంత బ్యానర్లో ఒక్క సినిమా కూడా విద్య చేయలేదు. సాధారణంగా చాలా మంది బాలీవుడ్ హీరోలు, హీరోయిన్లు తమ స్వంత బ్యానర్స్‌లోనే సినిమాలు చేసేందుకు ఇష్టపడుతుంటారు. కానీ, విద్య మాత్రం భర్త సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపడం లేదు.

  అందుకే భర్త సినిమాలకు దూరం..

  అందుకే భర్త సినిమాలకు దూరం..


  తను కావాలనే భర్త నిర్మించే సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపించనని విద్య చెబుతోంది. నీ భర్త వల్లే ఎన్నో సాధించావని, ఎవరూ తన విజయాల్ని తక్కువ చేసి మాట్లాడడం తనకిష్టం ఉండదని, అందుకే భర్త సినిమాల్లో నటించాలని అనుకోనని విద్య చెప్పింది. ఈ స్థితికి రావటానికి తామిద్దరం ఎంతో కృషి చేశామని, తామిద్దరిలో ఒకరి వల్ల మరొకరి విజయాలు చులకన కాకూడదని అనుకుంటామని విద్య పేర్కొంది.

  రూటు మార్చిన డర్టీ పిక్చర్..

  రూటు మార్చిన డర్టీ పిక్చర్..


  అప్పటివరకు సాంప్రదాయబద్ధమైన పాత్రల్లోనే కనిపించిన విద్య `డర్టీ పిక్చర్`తో రూటు మార్చింది. 2011లో విడుదలైన `డర్టీ పిక్చర్‌` చిత్రంలో ఆమె నట విశ్వరూపం, అందాల విస్పోటనం గురించి అందరికి తెలిసిందే. అప్పట్లో ఘాటెక్కించే ఫోటో షూట్లతోనూ విద్యా బాలన్ కనువిందు చేసింది‌. ఆ తర్వాత కూడా అటు గ్లామర్, ఇటు నటనకు ప్రాధాన్యం ఉన్న చిత్రాలను ఎంచుకుని విద్య మంచి విజయాలు సాధించింది. బాలీవుడ్‌లో కథానాయిక ప్రాధాన్యం ఉన్న చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది.

  English summary
  Actress Vidya balan's latest movie Jalsa released on Amazon Prime Video. In this movie promotions, She revealed a producer's Misbehaviour
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X