అలా టెంప్ట్ చేస్తే.. ఆ హీరో కండోమ్‌ను ఇష్టపడ్డాడు.. సీక్రెట్ బయటపెట్టిన విద్యాబాలన్
బాలీవుడ్‌లో టాలెంటెడ్ యాక్టర్లు విద్యా బాలన్, కార్తీక్ ఆర్యన్ నటించిన భూల్ భులయ్యా 3 చిత్రం నవంబర్ 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ సీక్వెల్ మూవీకి మంచి ఆదరణ లభిస్తున్నది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌ను భారీగా నిర్వహించారు. ఈ సినిమాపై బజ్ క్రియేట్ చేయడానికి విద్యాబాలన్ , కార్తీక్ దేశవ్యాప్తంగా ప్రచారం చేశారు. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ భాగంగా పలు విషయాలు పంచుకొన్నారు. ఈ సందర్భంగా హీరోయిన్ వెల్లడించిన వివరాల్లోకి వెళితే..
దేశవ్యాప్తంగా పలు నగరాల్లో విద్యాబాలన్, కార్తీక్ ఆర్యన్ భారీగా ప్రచారం చేశారు. దాంతో సినిమాకు మంచి హైప్ క్రియేట్ చేసింది. అంతేకాకుండా ప్రమోషన్స్‌లో వారిద్దరి కెమిస్ట్రీకి మంచి రెస్పాన్స్ కూడా లభించింది. తెర మీద కూడా అదే పండిందని నెటిజన్లు పేర్కొంటున్నారు. సీనియర్ నటితో యువ హీరో చేసిన జర్నీ అందరిని ఆకట్టుకొన్నది.

విద్యాబాలన్ గురించి ప్రమోషనల ఈవెంట్‌లో మాట్లాడుతూ.. ఆమెతో జర్నీ చేస్తుంటే..స్కూల్ పిల్లాడిలా మారిపోయాను. ఆమెతో షూటింగుకు వెళ్లినా.. ప్రమోషన్స్‌కు వెళ్లినా స్కూల్‌కో కాలేజీకో వెళ్లినట్టు అనిపిస్తుంది. ఆమె నుంచి నేను చాలా నేర్చుకొన్నాను అని కార్తీక్ ఆర్యన వెల్లడించారు.
యాక్టర్‌గా కొన్ని విషయాలు చాలా టెంప్ట్ చేస్తుంటాయి. నా ముందుకు ఓ పాన్ మసాల యాడ్, కండోమ్ యాడ్ వచ్చింది. పాన్ మసాలా యాడ్ చేయడానికి భారీగా డబ్బు ఆఫర్ చేశారు. కానీ నేను మనీ కోసం టెంప్ట్ కాలేదు. కానీ నేను పాన్ మసాలా యాడ్‌ను రిజెక్ట్ చేశాను. ఆ తర్వాత కండోమ్ యాడ్‌లో నటించేందుకు ఇష్టపడ్డాను అని తెలిపారు.

అయితే కార్తీక్ ఆర్యన్ మాటలు సీరియస్‌గా వింటున్న విద్యాబాలన్ ఆయనపై సెటైర్ వేసింది. పాన్ మసాలా బదులు కండోమ్‌ను మా హీరో ఇష్టపడ్డాడు. తక్కువ డబ్బులు వచ్చిన సేఫ్‌గా ఉండటానికే ముక్కువ చూపాడు. ప్రజలకు హానీ చేసే ఉత్పత్తులు కాకుండా మేలు చేసే ప్రొడక్ట్స్‌ను ఎంచుకోవడం నాకు హ్యాపీగా ఉందని ఆమె ప్రశంసించారు.
గతంలో కొందరు స్టార్ హీరోలు పాన్ మసాలా యాడ్‌లో నటించి చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నారు. వారిని నెటిజన్లు, ప్రజలు దారుణంగా ట్రోల్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంలో కార్తీక్ ఆర్యన్ ముందే జాగ్రత్త పడ్డారని విద్యా బాలన్‌తోపాటు నెటిజన్లు కూడా అభిప్రాయపడుతున్నారు.


Click it and Unblock the Notifications











