Sherni: విద్యాబాలన్ ఇంట్రెస్టింగ్ మూవీ.. మరోసారి డైరెక్ట్ గా ఓటీటీలోనే..

ఓటీటీ సంస్థలకు సెకండ్ వేవ్ కూడా మరింత బలాన్ని ఇస్తోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా మరిన్ని సినిమాలను డైరెక్ట్ గా ఓటీటీలో విడుదల చేయాలని బడా నిర్మాతలు కూడా ముందడుగు వేస్తున్నారు. ఆలస్యం చేస్తే నష్టపోతామని రిస్క్ చేయడం లేదు. రాధే సినిమా డైరెక్ట్ గా ఓటీటీలో విడుదలైన విషయం తెలిసిందే. ఇక విద్యా బలన్ నటించిన మరొక ఇంట్రెస్టింగ్ మూవీ కూడా డైరెక్ట్ గా డిజిటల్ వరల్డ్ లో విడుదలకు సిద్ధమయ్యింది.

ఇదివరకే 'శకుంతల దేవి' లాంటి విభిన్నమైన సినిమాతో ఓటీటీ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న విద్యా బాలన్ ఇప్పుడు మరో సినిమాను కూడా సిద్ధం చేసింది. ఫారెస్ట్ ఆఫీసర్ పాత్రలో నటించిన 'షెర్ని' అనే సినిమా షూటింగ్ పనులను ఎప్పుడో పూర్తి చేసుకుంది. ఎక్కువగా షూటింగ్ ను దట్టమైన అడవులల్లోనే షూట్ చేశారు. ఇక ఈ సినిమాకు గత రెండు నెలలుగా వివిధ ఓటీటీ సంస్థల నుంచి ఆఫర్స్ వస్తున్నాయి.

 Vidya Balans Sherni gets OTT release new poster viral

హాట్ స్టార్ బాగానే ప్రయత్నాలు చేసినప్పటికీ చివరికి అమెజాన్ ప్రైమ్ రిలీజ్ హక్కులను దక్కించుకుంది. ఈ సినిమాను జూన్ లో విడుదల చేయనున్నట్లు అఫీషియల్ గా క్లారిటీ అయితే ఇచ్చారు. 'షెర్ని' చిత్రానికి ప్రతిభావంతులైన చిత్రనిర్మాత అమిత్ మసుర్కర్ దర్శకత్వం వహించారు. ఇక T-సిరీస్ అలాగే అబుండాంటియా ఎంటర్టైన్మెంట్స్ వారు సినిమాను సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రంలో శరద్ సక్సేనా, ముకుల్ చద్దా, విజయ్ రాజ్, అరుణ్, బ్రిజేంద్ర కాలా, నీరజ్ కబీ వంటి ప్రముఖ నటీనటులు ముఖ్యమైన పాత్రల్లో నటించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X