ఒంటిపై నూలుపోగు లేకుండా స్టార్ హీరో అరాచకం.. అసలు కారణం తెలిస్తే ..
బాలీవుడ్ యాక్షన్ స్టార్, 'కమాండో' ఫ్రాంచైజ్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు విద్యుత్ జమ్వాల్ (Vidyut Jammwal). ఈ హీరో ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేశారు. స్ట్రాంగ్ ఫిట్‌నెస్, మార్షల్ ఆర్ట్స్, క్రమశిక్షణతో కూడిన జీవనశైలితో ఎప్పుడూ వార్తల్లో నిలిచే విద్యుత్... ఈసారి పోస్ట్ చేసిన ఓ వీడియోతో షాక్ చేశారు. సోషల్ మీడియాలో నెటిజన్లను విస్మయానికి గురిచేశారు. ఎవరూ ఊహించిన విధంగా ఒంటిపై నూలుపోగు లేకుండా చెట్టు ఎక్కుతున్న దృశ్యాలు బయటకు రావడంతో నెట్టింట పెద్ద చర్చ మొదలైంది. ఇంతకీ ఈ అరాచకానికి కారణమేంటీ?
హీరో విద్యుత్ జమ్వాల్ ఇన్‌స్టాగ్రామ్‌లో శనివారం ఓ వీడియోలో పోస్ట్ చేశారు. అందులో అతడు పూర్తిగా నగ్నంగా చెట్టెక్కుతూ కనిపించారు. అయితే వీడియోలో వ్యక్తిగత గోప్యతను కాపాడేందుకు ఆయన వెనుక భాగాన్ని 'ఈవిల్ ఐ' ఎమోజీతో కవర్ చేశారు. ఎవరో కింద నుంచి షూట్ చేసినట్లుగా ఉన్న ఈ వీడియోలో, విద్యుత్ చెట్టుపైకి చురుగ్గా ఎక్కుతున్న తీరు స్పష్టంగా కనిపిస్తోంది. ఇదే వీడియోలో మరో సన్నివేశంలో ఆయన మంచుతో నిండిన ప్రాంతంలో కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తూ కనిపించడం కూడా విశేషంగా మారింది.

ఈ వీడియో వైరల్ అవ్వగానే సోషల్ మీడియాలో ట్రోల్స్ వర్షం మొదలైంది. 'ఇలా నగ్నంగా తిరగడం అవసరమా?', 'ఇది ఓవర్ కాదు?' అంటూ కొందరు తీవ్రంగా విమర్శించారు. మరోవైపు 'టార్జన్ కూడా ఆకులు కట్టుకున్నాడు, మీరు మాత్రం వేరే లెవెల్' అంటూ కొందరు సరదాగా కామెంట్స్ చేశారు. అయితే విద్యుత్ అభిమానులు మాత్రం ఆయనను సమర్థిస్తూ, 'ఇది అసభ్యం కాదు... ప్రకృతితో మమేకం అయ్యే సాధన', 'ఆయన డిసిప్లిన్, ధైర్యం మాకు ప్రేరణ' అంటూ మద్దతుగా నిలిచారు.
ఈ వీడియో వెనుక అసలు కారణాన్ని విద్యుత్ జమ్వాల్ స్వయంగా వివరించారు. తాను కేరళకు చెందిన ప్రపంచంలోనే అత్యంత పురాతన మార్షల్ ఆర్ట్ అయిన కలరిపయట్టు (Kalaripayattu)లో సాధకుడినని, ఆ సాధనలో భాగంగానే ఏడాదికి ఒకసారి 'సహజ (Sahaja)' అనే యోగాభ్యాసాన్ని చేస్తానని తెలిపారు. 'సహజ అంటే మన సహజ స్థితికి తిరిగి చేరడం. ప్రకృతితో పాటు మన అంతర్గత అవగాహనతో లోతైన అనుబంధాన్ని పెంపొందించుకోవడం'అని ఆయన వివరించారు.
అంతేకాకుండా.. శాస్త్రీయ కోణంలోనూ ఈ సాధన ప్రాముఖ్యతను వివరిస్తూ.. 'ఈ ప్రక్రియలో శరీరంలోని అనేక న్యూరోరిసెప్టర్లు, ప్రోప్రియోసెప్టర్లు యాక్టివేట్ అవుతాయి. దాంతో ఇంద్రియ స్పందన పెరుగుతుంది, శరీర సమతుల్యత, సమన్వయం మెరుగవుతాయి. ఫలితంగా శరీరంపై అవగాహన పెరిగి, మానసిక ఏకాగ్రతను పెంచుతుంది. ఇది లోతైన గ్రౌండింగ్ అనుభూతిని ఇస్తుంది' అని చెప్పారు. ప్రకృతితో నేరుగా మమేకం కావడం వల్ల మనిషి తన అంతరాత్మను మరింతగా అర్థం చేసుకోగలడన్నది విద్యుత్ జమ్వాల్ అభిప్రాయం.
విద్యుత్ జమ్వాల్‌కు ప్రకృతితో అనుబంధం కొత్తేమీ కాదు. గతంలో కూడా హిమాలయాల్లో 14 రోజుల పాటు ఏకాంతంగా గడిపిన సమయంలో, మంచు పర్వతాల మధ్య నగ్న ఫోటోషూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది షో కోసం కాదని, ప్రకృతితో మమేకం కావడానికే చేశానని అప్పట్లో ఆయన స్పష్టం చేశారు. ఆ ఫోటోలు కూడా అప్పట్లో ఇంటర్నెట్‌ను షేక్ చేశాయి. గడ్డకట్టే మంచులోనూ ఆయన చూపించిన ధైర్యం, ఫిట్‌నెస్ చూసి నెటిజన్లు ఆశ్చర్యపోయారు.
ఇక విద్యుత్ జమ్వాల్ సినిమాల విషయానికి వస్తే, అతడు చివరిగా మదరాసి (Madharaasi) సినిమాలో నటించారు. ఏఆర్ మరుగదాస్ (AR Murugadoss) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం విడుదలైన ఐదు రోజుల్లోనే భారతదేశంలో రూ.44 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించి బాక్సాఫీస్ విజయం సాధించింది. దానికి ముందు సౌత్‌లోనూ ఆయనకు మంచి గుర్తింపే ఉంది. దళపతి విజయ్ నటించిన 'తుపాకి'లో విలన్‌గా, నందమూరి బాలకృష్ణ 'డాకు మహారాజ్'లో హై-వోల్టేజ్ యాక్షన్ విలన్‌గా నటించి మాస్ ఆడియన్స్ మనసులు గెలుచుకున్నారు.
ఇక అంతర్జాతీయ స్థాయిలో చూస్తే, విద్యుత్ జమ్వాల్ హాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమవుతున్నారు. ప్రముఖ వీడియో గేమ్ ఆధారంగా తెరకెక్కుతున్న స్ట్రీట్ ఫైటర్ (Street Fighter) రీబూట్ మూవీలో ఆయన 'ధల్సిమ్ (Dhalsim)' పాత్రలో కనిపించనున్నారు. ఇందులో విద్యుత్ ఎటువంటి డూప్ లేకుండా రిస్కీ స్టంట్స్ చేయబోతున్నారని సమాచారం.


Click it and Unblock the Notifications











