విజయ్ దేవరకొండ బాలీవుడ్ ఎంట్రీ... క్రికెట్ నేపథ్యంగా సినిమా.. దర్శకుడు ఎవరంటే!

పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, గీతా గోవిందం లాంటి విజయాలతో జోష్ మీద ఉన్న విజయ దేవరకొండ బాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్నారనే ఊహాగానాలు ఈ మధ్యకాలంలో ఎక్కువగానే వినిపిస్తున్నాయి. అయితే చాలా రోజులుగా విజయ్ దేవరకొండ ఆ వార్తలపై పెదవి విప్పలేదు. కానీ గీతా గోవిందం మూవీ హిందీలో రీమేక్ అవుతున్న నేపథ్యంలో విజయ్ దేవరకొండ తన బాలీవుడ్ ఎంట్రీ మరోసారి చర్చనీయాంశమైంది. గీతా గోవిందం రీమేక్‌, బాలీవుడ్ రీఎంట్రీ గురించి ఏం చెప్పారంటే..

 గీతా గోవిందం బాలీవుడ్ రీమేక్‌లో

గీతా గోవిందం బాలీవుడ్ రీమేక్‌లో

గీతా గోవిందం బాలీవుడ్ రీమేక్‌లో నటించడం లేదు. ఒకవేళ బాలీవుడ్‌ చిత్రంలో నటించాల్సి వస్తే స్ట్రయిట్ చిత్రంలో నటిస్తాను. అర్జున్ రెడ్డి, గీతా గోవిందం చిత్రాల విజయాలకు ఎంత కృషి చేయాలో అంత చేశాను. మళ్లీ రీమేక్‌లో అంటే నాకు ఇష్టం లేదు అని విజయ్ దేవరకొండ చెప్పారు.

 రీమేక్‌లో నటించలేను

రీమేక్‌లో నటించలేను

ఒకవేళ బాలీవుడ్‌లో నటిస్తే కొత్త కథతోనే వస్తాను. చేసిన సినిమానే మళ్లీ చేస్తే రిపీట్ అవుతుంది తప్ప తృప్తి ఉండదు. అందుకే మంచి కథ కోసం వెయిట్ చేస్తున్నాను. త్వరలోనే ఏదో ఒకటి ఫైనల్ అవుతుంది. రీమేక్ సినిమాల్లో నటించడం కుదరదు అని విజయ్ దేవరకొండ వెల్లడించారు.

కబీర్ ఖాన్ 83 మూవీలో విజయ్ దేవరకొండ

కబీర్ ఖాన్ 83 మూవీలో విజయ్ దేవరకొండ

ఇదిలా ఉండగా, ప్రముఖ దర్శకుడు కబీర్ ఖాన్ రూపొందించే 83 అనే చిత్రంలో విజయ దేవరకొండ నటిస్తున్నట్టు వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ క్రికెటర్‌గా నటిస్తున్నట్టు సమాచారం. విజయ్ బాలీవుడ్ ఎంట్రీపై అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

ప్రపంచ కప్ ఫైనల్‌ విజయం

ప్రపంచ కప్ ఫైనల్‌ విజయం

క్రికెట్ నేపథ్యంతో సాగే కథను దర్శకుడు కబీర్ ఖాన్ తెరకెక్కించే ప్రయత్నంలో ఉన్నాడు. ఆ సినిమాకు 83 అనే టైటిల్‌ను ఖరారు చేశారు. 1983లో జరిగిన ప్రపంచకప్ ఫైనల్ పోటీలో వెస్టిండీస్‌పై విజయం సాధించిన భారత క్రికెట్ జట్టు కథతో సినిమా సాగుతుందట. ఈ చిత్రంలో భారత జట్టు సభ్యుడిగా విజయ్ దేవరకొండ నటిస్తున్నట్టు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X