అప్పుడు గీతాఆర్ట్స్, ఇప్పుడు జీ స్టూడియోస్.. అమ్మాయి శరీరం చుట్టూ.. అన్నీ సైలెంట్‌గా!
ఈ మధ్యకాలంలో టాలీవుడ్ సినిమాలపై, ఇక్కడి దర్శకుల ఆలోచనలపై బాలీవుడ్ బడా దర్శకనిర్మాతల కన్ను పడింది. తెలుగు దర్శకనిర్మాతల టాలెంట్ చూసి.. ఇక్కడి సినిమాలకు రీమేక్ చేసేందుకు ముందుకొస్తున్నారు బాలీవుడ్ మేకర్స్. ఈ నేపథ్యంలోనే అమ్మాయి శరీరం చుట్టూ తిరిగే డిఫరెంట్ కథాంశంతో తెరకెక్కిన 'టాక్సీవాలా' సినిమా రీమేక్ సైలెంట్‌గా జరుగుతోందట.

విజయ్ దేవరకొండ హీరోగా.. టాలీవుడ్ ప్రేక్షకులకు కనెక్ట్
ఫాంటసీ థ్రిల్లర్ మూవీగా తెలుగులో రాహుల్ సాంక్రిత్యన్ దర్శకత్వంలో రూపొందింది 'టాక్సీవాలా' సినిమా. విజయ్ దేవరకొండ, ప్రియాంక జవల్కర్ హీరో హీరోయిన్లుగా గీతాఆర్ట్స్ 2, యూవీ క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. విడుదలయ్యాక టాలీవుడ్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయిన ఈ సినిమా చెప్పుకోదగ్గ విజయం సాధించింది.

అమ్మాయి శరీరం చుట్టూ
గతంలో ఎప్పుడూ రాని ఓ డిఫెరెంట్ కథాంశాన్ని ఎంచుకున్న డైరెక్టర్.. దాన్ని ఎంతో బాగా తెరకెక్కించారు. హారర్, రొమాన్స్ కలగలుపుతూ వచ్చిన సన్నివేశాలు ప్రేక్షకులను రక్తి కట్టించాయి. దీంతో ఈ సినిమాను బాలీవుడ్‌లో రీమేక్ చేసేందుకు ముందుకొచ్చారు మేకర్స్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోందని తెలిసింది.

ముందుకొచ్చిన జీ స్టూడియోస్.. హీరో అతనే
టాక్సీవాలా రీమేక్ విషయమై ఎప్పటినుంచో వార్తలు వచ్చినప్పటికీ, అది ఇప్పుడు ఓకే అయిందని సమాచారం. మక్బూల్ ఖాన్ దర్శకత్వంలో ఇషాన్ ఖట్టర్ హీరోగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. జీ స్టూడియోస్, ఏఏజెడ్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్ 11 ప్రారంభమైంది. 'ఖాలీ పీలి' పేరుతో రూపొందుతున్న ఈ సినిమాలో ఇషాన్ కు జోడిగా అనన్య పాండే నటిస్తోంది. 2020
ప్రథమార్థంలో ఈ సినిమాను విడుదల చేయబోతున్నారట.

విజయ్ దేరకొండ అనుకున్నారు.. బట్
టాక్సీవాలా రీమేక్ సినిమాను విజయ్ దేరకొండ తోనే రూపొందించాలని ప్లాన్ చేశారు. కానీ విజయ్ దేరకొండ తన సినిమాను తానే రీమేక్ చేయనని చెప్పడంతో ఇషాన్ ఖట్టర్ ని హీరోగా తీసుకున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ.. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాతో పాటు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు మన రౌడీ స్టార్.


Click it and Unblock the Notifications











