»   » మీదపడి పెదవులు కొరికాడు.. భార్యకు కూడా నరకం.. క్వీన్ దర్శకుడిపై నటి ఆరోపణలు

మీదపడి పెదవులు కొరికాడు.. భార్యకు కూడా నరకం.. క్వీన్ దర్శకుడిపై నటి ఆరోపణలు

Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  బాలీవుడ్ ఫిల్మ్ మేకర్, క్వీన్ మూవీ దర్శకుడు వికాస్ బెహల్‌పై లైంగిక ఆరోపణలు రావడం సినీ వర్గాల్లో మరోసారి సంచలనంగా మారింది. బాంబే వెల్వెట్ ప్రమోషన్‌ టూర్‌లో తనను లైంగిక వేధించాడని ఓ నటి ఆరోపణలు చేసింది. బలవంతంగా దౌర్జన్యం చేసి ముద్దు పెట్టుకోవాలని చూశాడు అని ఆమె పేర్కొన్నది. బాలీవుడ్ వెబ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్యూలో తన పేరు వెల్లడించడానికి సదరు నటి నిరాకరించారు. ఆమె చేసిన ఆరోపణలు ఏమిటంటే..

  పీకల దాకా తాగినట్టు నటించి

  పీకల దాకా తాగినట్టు నటించి

  వికాస్ బెహల్ చాలా చెత్త వ్యక్తి. అతని పక్కన ఉండాలంటే ఓ రకమైన భయం ఉండేది. దాదాపు 20 మందితో పార్టీ జరిగింది. ఆ పార్టీలో పీకలదాకా తాగినట్టు నటించాడు. మద్యం మత్తులో ఉన్నట్టు నటిస్తూ నాతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. నా పెదాలపై ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించాడు. దాంతో ఆయనను పక్కకు తోశాను. అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తే అడ్డుకొన్నాడు అని సదరు నటి వెల్లడించింది.

  పెదాలు కొరికి గాయపరిచాడు

  పెదాలు కొరికి గాయపరిచాడు

  పెదాలను కొరికి గాయపరిచడంతో తాను చాలా భాదపడ్డాను. ఆ సమయంలో నా వద్దకు వచ్చి ఏమి చేయనివాడిగా నటిస్తూ.. ఆకలిగా ఉందా? ఏమైనా తిన్నావా? నీ కోసం కబాబ్స్ తీసుకు రావాలా? అని డ్రామాలు చేశాడు. నేను నిన్నేమీ చేయను. నువ్వు ఏమైనా చేస్తావా అని తాగినట్టు తూలుతూ నటించడం మొదలుపెట్టాడు.

   మాజీ భార్యకు తెలుసు

  మాజీ భార్యకు తెలుసు

  నాతో అసభ్యంగా ప్రవర్తించిన తీరు వికాస్ బెహల్ మాజీ భార్యకు తెలుసు. ఆమెకు నరకం చూపి జీవితాన్ని కూడా నాశనం చేశాడు. నాతోనే కాదు. గతంలో కూడా ఇలాంటి నీచంగా కొందరితో ప్రవర్తించాడు అని సదరు నటి ఆవేదన వ్యక్తం చేసింది. బాంబే వెల్వెట్ ప్రమోషన్ టూర్‌లో వికాస్ బెహల్ చేతిలో దారుణమైన అనుభవాన్ని చవిచూసింది. ఫాంథామ్ ఫిల్మ్స్‌ సిబ్బందికి ఫిర్యాదు చేసినా పెద్దగా పట్టించుకోలేదు అని తెలిపింది.

   కంగనా రనౌత్‌తో కూడా అసభ్యంగా

  కంగనా రనౌత్‌తో కూడా అసభ్యంగా

  క్వీన్ సినిమా షూటింగ్ సమయంలో తనతో అసభ్యంగా ప్రవర్తించాడని బాలీవుడ్ నటి కంగన రనౌత్ సంచనల వ్యాఖ్యలు చేసింది. తనను గాఢంగా కౌగిలిలో బంధించి ఊపిరి సలపకుండా చేశాడు. మాటలతో శృంగారానికి దిగేవాడు. నోటి నుంచి బూతు పదాలు ఎక్కువగా వచ్చేవి. ఎదుటి వారికి ఇష్టం ఉన్నా, లేకున్నా తనకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవాడు అని ఆ నటి చెప్పింది.

  English summary
  Anurag Kashyap's Bombay Velvet, an actress, requesting anonymity, has now come forward and related how the Queen director once tried to "forcibly kiss her". "He forcibly tried to kiss me on the lips, I pushed him and left immediately and he pretended not to see me leaving," she said.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more