twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నా పరువు తీశారు: స్టార్ డైరెక్టర్ల మధ్య మొదలైన వార్, లీగల్ నోటీసులు!

    |

    #మీటూ ఉద్యమం హిందీ చిత్ర పరిశ్రమను కుదిపేస్తోంది. ఈ క్రమంలో బాలీవుడ్ దర్శకుడు వికాస్ బహల్ తీవ్రమైన ఆరోపణలు వెళ్లువెత్తాయి. ఫాంటమ్ ఫిల్మ్స్ మాజీ మహిళా ఉద్యోగి ఒకరు వికాస్ తనను సెక్సువల్‌గా వేధించాడంటూ ఆరోపణలు చేశారు. 2015లో 'బాంబే వెల్వెట్' ప్రమోషన్స్ సమయంలో ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు ఆరోపించారు.

    వికాస్ బహల్ తనను వేధిస్తున్న విషయాన్ని తాను ఫాంటమ్ ఫిల్మ్స్ వ్యవస్థాపకుల్లో ఒకరైన అనురాగ్ కశ్యప్ దృష్టికి తీసుకెళ్లానని, రెండు సంవత్సరాల తర్వాత వరకు ఈ విషయాన్ని వారు సీరియస్‌గా తీసుకోలేదని ఆమె ఆరోపించారు.

    వికాస్ బహల్ మీద అనురాగ్ కశ్యప్ ఆరోపణలు

    వికాస్ బహల్ మీద అనురాగ్ కశ్యప్ ఆరోపణలు

    ‘ఫాంటమ్ ఫిల్మ్ సంస్థ' వ్యవస్థాపకుల మధ్య విబేధాలు వచ్చి సంస్థను రద్దు చేసుకోవాలని నిర్ణయించుకున్నపుడు.... అనురాగ్ కశ్యప్ ఈ విషయంతో పాటు తన స్టేట్మెంటులో వికాస్ బహల్ ఇండీసెంట్ బిహేవియర్ గురించి, మహిళా ఉద్యోగిపై అతడి లైంగిక వేధింపుల గురించి కూడా ప్రస్తావించారు.

    అతడు లైంగిక నేరస్థుడు

    అతడు లైంగిక నేరస్థుడు

    ఫాంటమ్ ఫిల్మ్స్ కో ఫౌండర్లలో ఒకరైన విక్రమాదిత్య మొత్వానీ సైతం వికాస్ బహల్ మీద ఆరోపణలు చేశాడు. అతడు ‘సెక్సువల్ అఫెండర్' (లైంగిక నేరస్తుడు) అని, ఎలాంటి షరతు లేకుండా బాధితురాలికి క్షమాపణలు చెప్పాలన్నారు.

    నా పరువు తీశారు

    నా పరువు తీశారు

    ఈ పరిణామాలపై ఎట్టకేలకు వికాస్ బహల్ మౌనం వీడారు. తనపై వస్తున్న లైంగిక వేధింపుల ఆరోపణలపై స్పందించారు. అనురాగ్ కశ్యప్, విక్రమాదిత్య మొత్వానీలను అవకాశవాదులుగా పేర్కొంటూ వారికి లీగల్ నోటీసులు జారీ చేశారు. ఇద్దరూ కలిసి తనను విలన్‌లా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని మండి పడ్డారు.

    వారు అవకాశవాదులు

    వారు అవకాశవాదులు

    తన మాజీ భాగస్వాములు ఇద్దరూ కలిసి తనకు వ్యతిరేకంగా వ్యవహారం నడిపించడంతో పాటు, ఫాంటమ్ ఫిల్మ్స్ సంస్థను విచ్చిన్నం చేయడానికి అన్ని అవకాశాలను వాడుకున్నారని ఆరోపించారు. ఫాంటమ్ ఫిల్మ్స్ సంస్థను రద్దు చేయాలనే చర్చలు కేవలం నెల రోజుల ముందు నుండే జరుగుతున్నాయని, క్రియేటివ్ డిఫరెన్స్ వల్లనే తమ మధ్య విబేధాలు వచ్చాయన్నారు.

    ఆ ఇద్దరికీ వార్నింగ్

    ఆ ఇద్దరికీ వార్నింగ్

    తనపై అనురాగ్ కశ్యప్, విక్రమాదిత్య మొత్వానీ చేసిన ఆరోపణలకు క్షమాపణలు చెబుతూ... సోషల్ మీడియాలో వారు చేసిన సందేశాలను వెనక్కి తీసుకోకుంటే వారిపై పరువు నష్టం దావా వేస్తానంటూ వికాస్ బహల్ హెచ్చరించారు.

    English summary
    Vikas Bahl, who has remained silent on sexual harassment allegations, has now sent a legal notice to Anurag Kashyap and Vikramaditya Motwane calling them "opportunists" for making him look like the fall guy. In the notice, Bahl has alleged that Kashyap and Motwane acted on hearsay to portray him as a villain. Bahl has threatened to file defamation cases against Kashyap and Motwane if they do not withdraw their messages on social media and tender unconditional apology to him.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X