సుశాంత్ కేసులో ఏదో దాచిపెడుతున్నారు.. ముంబై పోలీసులపై వికాస్ సింగ్ సెన్సేషనల్ కామెంట్స్
సుశాంత్ సింగ్ మరణానికి సంబంధించిన కేసు ఎన్నో మలుపులు తిరుగుతోంది. ఎన్నో రాష్ట్రాలు, ఎన్నో ఇండస్ట్రీల్లో ప్రకంపనలు రేపుతోంది. ఎన్నో అనూహ్యమైన మలుపుల తరువాత సుశాంత్ కేసులో డ్రగ్స్ మాఫియా హస్తం బయట పడింది. బాలీవుడ్‌లో డ్రగ్స్ దందా విషయం బయటకు వచ్చింది. సుశాంత్‌కు కూడా డ్రగ్స్ ఇచ్చేవారని, రియా చక్రవర్తి ఈ డీలింగ్స్ చేసేదని బయటకు వచ్చిన వాట్సప్ చాట్ సెన్సేషన్ క్రియేట్ చేసింది.
Recommended Video

రంగంలోకి ఎన్‌సీబీ..
సుశాంత్ కేసులో ఇప్పటికే సీబీఐ, ఈడీలు కొరడా ఝులిపించగా.. ప్రస్తుతం నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) రంగంలోకి దిగింది. బాలీవుడ్‌లో డ్రగ్స్ మాఫియాపై ఎన్‌సీబీ ఉక్కుపాదం మోపుతోంది. ఇప్పటికే డ్రగ్స్ డీలర్ కైజన్ ఇబ్రహీంను అదుపులోకి తీసుకున్నారు

రియా సోదరుడి అరెస్ట్..
అతను ఇచ్చిన సమాచారం మేరకు రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్, సుశాంత్ ఇంటి మేనేజర్ శామ్యూల్ ఇంట్లో దాడులు నిర్వహించారు. అందులో భాగంగానే షోవిక్, సుశాంత్ ఇంటి మేనేజర్ శామ్యూల్‌లను అరెస్ట్ చేశారు. వీరిని నేడు కోర్టులో హాజరపరిచారు.

కోర్టులో వాదనలు..
వీరిని కాసేపటి క్రితమే కోర్టులో హాజరు పరిచినట్టు తెలుస్తోంది. వీరి నివాసాల్లో దాడులు అయితే చేశారు గానీ ఏ ఒక్క ఆదారం గానీ, డ్రగ్ కానీ దొరకలేదు. ఈ విషయంలోనే న్యాయస్థానం సైతం ఎన్‌సీబీ వాదనను పక్కనపెట్టినట్టు తెలుస్తోంది. వారం రోజులు కస్టడీకి అప్పగించడన్న ఎన్‌సీబీ వాదనపై కోర్టు అంగీకరిస్తుందా లేదా అన్నది తెలియాలి.

ఏదో దాచి పెడుతున్నారు..
ఈ మొత్తం ఘటనలపై సుశాంత్ ఫ్యామిలీ లాయర్ వికాస్ సింగ్ సంచలన కామెంట్స్ చేశాడు. ఎన్‌సీబీ అరెస్ట్‌లను చూస్తుంటే సుశాంత్ కేసులో ఏవో పెద్ద విషయాలను ముంబై పోలీసులు దాచి పెడుతున్నారని అనిపిస్తోంది. ఈ కేసులో ఎన్నో కోణాలున్నాయని ఇట్టే అర్థమవుతోంది. సుశాంత్ కేసు చుట్టూ ఉన్న కోణాలన్నీ బయటకు రావాలని కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారని వికాస్ సింగ్ తెలిపాడు.


Click it and Unblock the Notifications











