twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘సుశాంత్ దేహం సీలింగ్‌కు వేలాడలేదు.. ముమ్మాటికి హత్యే.. సీఎం కొడుకు హస్తం?’

    |

    బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసుకు సంబంధించిన దర్యాప్తును సీబీఐకి అప్పగించాలా? వద్దా అనే అంశంపై సుప్రీంకోర్టులో వాడివేడిగా వాదనలు జరిగాయి. సుశాంత్ సింగ్ తండ్రి కేకే సింగ్ తరఫు న్యాయవాది వికాస్ సింగ్ తన వాదనలను బలంగా వినిపించారు. సుశాంత్ మరణం ఆత్మహత్య కాదు.. మర్డర్ జరిగిందనే కోణంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తికి వాదనలు వినిపించారు. వికాస్ సింగ్ వాదనలకు సంబంధించి..

    Recommended Video

    Sushant Singh Rajput దేహం సీలింగ్‌కు వేలాడలేదు.. ముమ్మాటికి హత్యే.. సీఎం కొడుకు హస్తం? -వికాస్ సింగ్

    సీబీఐపై యూటర్న్ ఎందుకు? రియా చక్రవర్తికి సుప్రీంకోర్టు మొట్టికాయసీబీఐపై యూటర్న్ ఎందుకు? రియా చక్రవర్తికి సుప్రీంకోర్టు మొట్టికాయ

    సీఎం కుమారుడి హస్తం ఉందనే ఆరోపణలు

    సీఎం కుమారుడి హస్తం ఉందనే ఆరోపణలు

    సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం వెనుక సీఎం కుమారుడి హస్తం ఉందనే అనుమానాలు మీడియాలో వచ్చాయి. వాటికి సంబంధించిన ప్రెస్ నోట్స్ మీకు అందజేశాను. సుశాంత్ మరణం వెనుక కుటుంబం కూడా అనేక అనుమానాలను వ్యక్తం చేస్తున్నది. కాబట్టి ఈ కేసులో స్వచ్ఛమైన, నిజాయితీతో కూడిన, పారదర్శకమైన దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉంది అని వికాస్ సింగ్ తెలిపారు.

    సుశాంత్‌ను ఫ్యామిలీకి దూరం చేసింది

    సుశాంత్‌ను ఫ్యామిలీకి దూరం చేసింది

    సుశాంత్‌ను రియా చక్రవర్తి తన ఫ్యామిలీకి, సిస్టర్స్‌కు దూరం చేసింది. గత మే నెలలో సుశాంత్ తన తండ్రి కేకే సింగ్‌ను పాట్నాకు తీసుకెళ్లారు. ఆ తర్వాత తన కుమారుడితో మాట్లాడేందుకు కేకే సింగ్ ప్రయత్నించినా సాధ్యపడలేదు. రియాకు కేకే సింగ్ వాట్సప్ మెసేజ్ పెట్టినా సమాధానం ఇవ్వకుండా ఫ్యామిలీకి దూరం చేసింది అని వికాస్ సింగ్ తన వాదనలు వినిపించారు.

    ముంబై పోలీసుల దర్యాప్తులో లుకలుకలు

    ముంబై పోలీసుల దర్యాప్తులో లుకలుకలు

    సుశాంత్ మరణం కేసులో ముంబై పోలీసులు దర్యాప్తు సరిగా జరగడం లేదు. కేసుతో సంబంధమున్న ఏ ఒక్కరిని విచారించడం లేదు. కేసుకు సంబంధం లేని వ్యక్తులను విచారిస్తూ కేసు దర్యాప్తును తప్పుదోవ పట్టించింది. నిజమైన నేరస్థులను విచారించకుండా ముంబై పోలీసులు విచారణ, దర్యాప్తు చేస్తున్నారు, ఈ కేసును బీహార్, మహారాష్ట్ర పోలీసుల మధ్య చిచ్చు పెట్టేవిధంగా ముంబై పోలీసులు వ్యవహరిస్తున్నారు అని వికాస్ సింగ్ ఆరోపించారు.

    సుశాంత్ ఉరి వేసుకొని వేలాడటం చూడలేదు

    సుశాంత్ ఉరి వేసుకొని వేలాడటం చూడలేదు

    సుశాంత్ దేహం సీలింగ్‌కు వేలాడుతుండగా ఎవరూ చూడలేదు. బెడ్‌పైన ఉండటమే కనిపించింది. సుశాంత్ మరణం విషయం తెలుసుకొని ఇంటికి చేరుకోవడానికి 10 నిమిషాల ముందే దేహాన్ని బయటకు తెచ్చారు. సుశాంత్ మరణం గురించి ఫ్యామిలీ మెంబర్స్‌కు సమాచారం ఇవ్వలేదు అని వికాస్ సింగ్ తన వాదనలు వినిపించారు.

    మహారాష్ట్ర సర్కార్ విఫల ప్రయత్నాలు

    మహారాష్ట్ర సర్కార్ విఫల ప్రయత్నాలు

    సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసులో సీబీఐ దర్యాప్తును అడ్డుకొనేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం శతవిధాల ప్రయత్నించింది. సీబీఐ దర్యాప్తు వార్త వెలువడిన వెంటనే.. ముంబైకి వచ్చే ఎవరినైనా క్వారంటైన్‌లో పెట్టాలనే ఆర్డర్‌ను బీఎంసీ హడావిడిగా జారీ చేసింది. క్వారంటైన్ నిబంధనలను హడావిడిగా మార్చాల్సిన అవసరం ఏమొచ్చిందో చెప్పాలంటూ సుశాంత్ ఫ్యామిలీ లాయర్ వాదనలు వినిపించారు.

    English summary
    Supreme Court taken up hearing on Rhea Chakraborty's petition over CBI investigation in Sushant Singh Rajput death case. Sc questions Rhea Chakraborty's Counsel over CBI Investigation which are objecting. In this occassion, Sushant Family lawyer Vikas Singh arguedin Supreme court that Never saw Sushant Singh Rajput hanging.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X