Vikrant Massey: తప్పుగా అర్థం చేసుకున్నారు .. ఆ పోస్ట్ పై 12th ఫెయిల్ హీరో క్లారిటీ..

Vikrant Massey: 12th ఫెయిల్ అనే సినిమాతో దేశవ్యాప్తంగా ఒక్కసారిగా క్రేజ్ దక్కించుకున్న నటుడు విక్రాంత్ మాస్సే. ఇటీవల సబర్మతి రిపోర్ట్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రధానిమంత్రి నరేంద్రమోడీ, కేంద్ర క్యాబినెట్ మంత్రులు కూడా ఈ సినిమాను తిలకించారు. ఈ విక్రాంత్ నటనపై ప్రశంసలు కురిపించారు. అదేవిధంగా ఇండియాన్ బాక్సాఫీస్ వద్ద కూడా పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. అయితే.. ఇటీవల నటుడు విక్రాంత్ మాస్సే చేసిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఆ పోస్ట్ వల్ల తన అభిమానులే కాకుండా మూవీ లవర్స్ కూడా షాక్ అయ్యారు. దీంతో తన పోస్ట్‌పై విక్రాంత్ మాస్సే క్లారిటీ ఇచ్చాడు. ఇంతకీ ఏమన్నారంటే ?

నటుడు విక్రాంత్ మాస్సే ఇటీవల తన ఇన్‌స్టా ఖాతాలో ఒక పోస్ట్‌ను పోస్ట్ చేశారు. ఇందులో'గత కొన్ని సంవత్సరాలు మీ నుంచి అపారమైన ప్రేమను పొందుతున్నాను. కానీ ఇప్పుడు నేను నా కుటుంబం, నా కోసం సమయం కేటాయించాల్సిన సమయం వచ్చింది. 2025లో మిమ్మల్ని చివరిసారి కలుస్తాను. ' అని ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు. దీంతో విక్రాంత్ పోస్ట్ సర్వత్రా చర్చనీయంగా మారింది. ఈ పోస్ట్ తో కేవలం తన అభిమానులే కాదు. ఇండస్ట్రీ ప్రముఖులు కూడా షాక్ అయ్యారు. దీంతో విక్రాంత్ నటనకు స్వస్తి చెప్పినట్లు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

Vikrant Massey has clarified his recent social media post i didnot retired people misinterpreted

హీరో విక్రాంత్ ప్రకటనపై స్టార్ నటుడు హర్షవర్ధన్ రాణే బహిరంగంగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 'విక్రాంత్‌ అద్భుతమైన నటుడు. ఆయన నిజంగా రిటైర్మెంట్ తీసుకుంటే.. అది చిత్రపరిశ్రమకు భారీ నష్టం" అని పేర్కొన్నారు. అతడు హార్డ్ వర్కర్, అతని నటనకు నేను పెద్ద అభిమానిని. హసీన్ దిల్రూబా సెట్స్‌లో ఆయన అంకితభావాన్ని చూశాను. నటుడుఅమీర్ ఖాన్ సర్ చేసినట్లు, ఇది సినిమా ప్రమోషన్ కోసం చేసి ఉండవచ్చు. అదే జరిగితే అభిమానులకు రిలీఫ్‌'అని పేర్కొన్నారు.

నటుడు విక్రాంత్ రిటైర్మెంట్ ప్రకటనపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కొంతమంది దీనిని అతని డాక్యుమెంటరీ జీరో సే రీస్టార్ట్ కోసం ప్రమోషనల్ స్టంట్‌గా పరిగణిస్తున్నారు. ఈ డాక్యుమెంటరీని హిట్ సినిమా '12 ఫెయిల్' బిహైండ్ ది సీన్స్ఆధారంగా దీని రూపొందించారు.
వాస్తవానికి హీరో విక్రాంత్ రిటైర్మెంట్ వార్త.. ఆయన అభిమానులను భావోద్వేగానికి గురి చేసింది. చాలా మంది అభిమానులు తన నిర్ణయాన్ని మార్చుకోవాలని అభ్యర్థించారు. అదే సమయంలో ఆయన నిర్ణయాన్ని కొందరు గౌరవించారు.

Vikrant Massey has clarified his recent social media post i didnot retired people misinterpreted

ఈ క్రమంలో నటుడు విక్రాంత్ తన సోషల్ మీడియా పోస్టుపై స్పందించారు. తాను రిటైర్‌మెంట్ తీసుకోనని, కొంత కాలం విరామం కావాలని చెప్పాడు. 'నేను యాక్టింగ్ కెరీర్ కు వీడ్కోలు పలకలేదు. నాకు నటించడం మాత్రమే తెలుసు. నటన నాకు అన్నీ ఇచ్చింది. నాకు కొంత కాలం విరామం కావాలి. నేను ఇంటిని, ఇంట్లో వారికి దూరంగా ఉంటాను. అలాగే..ఆరోగ్య కారణాల వల్ల కూడా విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాను. ప్రజలు ( అభిమానులు)నా పోస్ట్‌ను తప్పుగా అర్థం చేసుకున్నారు' అన్నారు.

'నన్ను ఇంతగా ఆదరించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. కానీ, ఇంటికి తిరిగి రావడానికి ఇది సమయం అని నేను భావిస్తున్నాను. ఇప్పుడు భర్తగా, తండ్రిగా, కొడుకుగా, నటుడిగా నా బాధ్యతలు నిర్వహించాలి.సరైన సమయం వచ్చినప్పుడు రీ ఎంట్రీ ఇస్తానని అభిమానులకు భరోసా ఇచ్చాడు.ఈ ప్రకటనతో ఆయన ఫ్యాన్స్ మాత్రమే కాదు. మూవీ లవర్స్ కూడా ఖుషీ అవుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X